Pages

Monday, January 30, 2017

ఐశ్వర్య  మంచి  అందగత్తే  .   ఆమె  భర్త  హరీష్   కూడా  అందగాడే . చూడ  చక్కని  జంట .  ఆన్యోన్యమైన    కాపురం   .  వాళ్ళను  చూసి   అందరూ  ముచ్చట  పడేలా  ఉండేవారు .
.
.
అనుకోకుండా   వాళ్ళ  జీవితాలలో   ఒక  విషాదం  జరిగింది
.
.
ఏమయిందో  తెలీదు  
.
ఐశ్వర్యకు   చర్మం  కాలినట్టు  రంగు  మారిపోతోంది .  ఆమె  అందమైన  ముఖం   కూడా  చర్మవ్యాదివలన రూపం  మారిపోవడం  మొదలు  పెట్టింది  .  ఆమె  అందం  అంతా  ఏమయిపోతోందో   ఆమెకే  అర్ధం  కావడం  లేదు .  డాక్టర్  లు  ఏమీ  చెప్పలేకపోయారు .
.
ఒక  రోజు హరీష్   ఆఫీస్  పని  మీద   టూర్  వెళ్ళాడు .  రిటర్న్  లో  వస్తూ  ఉంటె   ఆక్సిడెంట్  అయింది .  అతడి  రెండు  కళ్ళూ  పోయాయి .
.
ఐశ్వర్య  దుఃఖానికి  అంతే  లేదు  
.
అయితే  ఒక   అదృష్టం  .  వాళ్ళ  కాపురం  లో  కలతలు  లేకుండా  ముందు  లాగే  సాగుతోంది .  అతడికి  కళ్ళు  పోయాయని  ఆమెకు  చింత  లేదు  .  ఆమె   కురూపిగా  మారినా  హరీష్  కు  తెలియలేదు .
.
ఆమె  వ్యాధి   ముదిరిపోతోంది .  చర్మం  అంతా  కమిలిపోయి  సాదా  సీదా  పనులు  చెయ్యడానికి   కూడా  కష్టం  అయిపోతోంది .  గతాన్ని  తలచుకొని  ఆమె   ఎంతో  బాధ  పడుతోంది .  తన  బాధను  తనలోనే  అణుచుకొని  హరీష్  తో   మునుపటిలాగే  ఉంటోంది .
.

.
ఒక  రోజు  ఉదయానికి   ఐశ్వర్య   ఇంక  లేవలేక  పోయింది .  ఆమె  బాధను  చూడలేని  హరీష్  ఆమెకు  జ్వరం  వచ్చింది   అనుకుని   తోచినంతలో    అనీ  తానే  చేశాడు .   ఆమె  ఆ  సాయంత్రం  మరి  లేవలేదు .
.
.
హరీష్  ఆమె  కర్మకాండలు  అన్నీ  చేశాడు .  ఆమె లేని  ఇంట్లో  ఎలా  గడపడం ?
.
.
ఒక్కడే !
.
.

.
ఒక  రోజు  సామాను  అన్నీ  సర్దుకుని  వెళ్లిపోతుంటే  పొరుగు    ఉన్న  పవన్  వచ్చి  ఎలా  బ్రతుకుతారు ? ఇక్కడ  మీకు  అందరూ  తెలిసిన  వారు  కదా !  వేరే  చోట  మీకు  ఇబ్బంది  అవుతుందేమో ?  ఆలోచించండి  అన్నాడు .
.
.

.
‘నేను  గుడ్డివాడిని   కాను  పవన్ !  నా  భార్య  బాధ  పడకూడదు  అని  గుడ్డివాడిలా  నటించాను . తన  శరీరం  రంగు  మారడం   నాకు  తెలియనట్టు  నటించాను .  నాకు  తెలిస్తే  ,  నేను  తనకు  దూరం  అయిపోతాను  అని  తను  ఆత్మహత్య  చేసుకుని  ఉండేది పవన్ . తన శరీర  బాధ  కన్నా   నేను  ఏమన్నా  అనుకుంటానేమో  అనే  బాధ  ఆమెకు  ఎక్కువ  అయి  ఉండేది .   ఆమె  నన్ను  అంతగా  ప్రేమించింది .  ఆమెను  సంతోషంగా  ఉంచడం  కోసం  నేను  నటించాను .  ఆమె  తృప్తిగా  మరణించింది   .  అది  చాలు  నాకు   “
.
.
.
.

ఏమనుకుందాం ?
.
.

నిజమైన సంతోషం   ఎదుటివారిని  సంతోష  పెట్టడం  లోనే  ఉంది  అని  ఆచరణలో  చూపిన  హరీష్  వంటి  వారు  మనలో  కూడా  ఉండే  ఉంటారు  కదూ !
.
.
నచ్చితే  ఒక  మంచి  మాట  , 
.
వీలయితే   పదిమందికీ  పంచండి .
............🌹.............

*నిజమైన సంతోషం   ఎదుటివారిని  సంతోష  పెట్టడం  లోనే  ఉంది*
👌
🙏
Let we all practice this😀

No comments:

Post a Comment