How to control BP
ఆహారనియమాలు
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .
గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో... ఆ శక్తి .
బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్ (Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .
ఉప్పు : బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయము కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానం లో మార్పులు ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. జీవితములో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉందుకోవచ్చును.
ఆహారములో ఉప్పు వాడకము తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడొద్దు . ముఖ్యము గా ప్రాసెస్డ్ , ప్యాకేజీపధార్ధములు , ఫాస్ట్ పుడ్స్ , క్యాన్డ్ పధార్ధములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికము చేస్తుంది.
పొటాషియం : ఇది బి.పి.ని తగ్గిస్తుంది .బీన్స్ , జఠాణీలు, నట్స్ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం , ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడము లో బాగా ఉపయోగపడతాయి.కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
కొవ్వు పదార్ధములు : వీటివలన రక్తము లో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడాకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు , ఆవకాయ , కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.
ఆహారములో మార్పులు : ఎక్కువ పీచు పదార్ధము ఉన్న వాడాలి. పండ్లు , కాయకూరలు , ఆకు కూరలు , పప్పులు వాడాలి. రోజుకు కనీషము 5 సర్వింగులు పండ్లు , కూరకాయలు తింటుండాలి. సాష్ లు , ఊరగాయలు బాగా తగ్గించాలి.
ఆల్కహాలు : అలవాటు ఉండే వారు మానివేయాలి , . . లేదా పరిమితులు ఉండాలి.ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయము .
పొగ త్రాగడము : దీనిలో నికొటిన్ ఉండడము వలన రక్తనాళాల పై ప్రబావము చూపుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం చేయవద్దు .
No comments:
Post a Comment