Pages

Friday, April 29, 2016

ఒక రోజు సర్దార్ ఉద్యోగం కోసం అని ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి కూర్చుంది.

అమ్మాయి : ‘‘మీరు మందు తాగుతారా..?’’
సర్దార్ : ‘‘అవును’’.

అమ్మాయి : ‘‘ఎంత?’’
సర్దార్ : ‘‘రోజుకి ఆరు పెగ్గులు తాగుతా’’!

అమ్మాయి : ‘‘ఓహో.. ఆ ఆరు పెగ్గులకు ఎంత ఖర్చవుతుంది?’’
సర్దార్ : ‘‘సుమారు 1000 రూపాయల వరకు’’.

అమ్మాయి : ‘‘ఎప్పటినుంచి తాగుతున్నావ్?’’
సర్దార్ : ‘‘దాదాపు 14 సంవత్సరాల నుంచి’’

అమ్మాయి : ‘‘ఓహో.. అంటే రోజుకు 1000 రూపాయల లెక్కను నెలకు 30000 రూపాయలు తాగడానికి ఖర్చు పెడుతున్నావన్నమాట! అలాగే సంవత్సరానికి 360000 రూపాయలు! అంటే మొత్తం 14 సంవత్సరాలలో నువ్వు 50 లక్షల రూపాయల వేస్ట్ చేశావ్. నీకో విషయం తెలుసా.. అదే 50 లక్షలు వుండుంటే ఇప్పటికి నువ్వు BMW కొనుండేవాడివి’’

సర్దార్ : ‘‘నువ్వేమైనా మందు తాగుతావా?’’

అమ్మాయి : ‘‘లేదు. నేను ఇంతవరకు దానిని ముట్టుకోలేదు కూడా!’’

సర్దార్ : ‘‘మరి నీ BMW ఏది?’’  హాహాహాహాహా... హాహాహాహాహ.. అని నవ్వుకున్నాడు.

No comments:

Post a Comment