Pages

Showing posts with label joke. Show all posts
Showing posts with label joke. Show all posts

Friday, April 29, 2016

ఈ-మెయిల్ పొరపాటు.!

ఈ-మెయిల్ పొరపాటు.!
.
ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు. రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది.
భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు.
ఆ ఈ-మెయిల్ సారాంశం. ప్రియమైన భార్యామణీ! విషయం: నేను చేరుకున్నాను. నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను.
రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ…
నీ ముద్దుల రేడు
.

ఒక రోజు సర్దార్ ఉద్యోగం కోసం అని ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి కూర్చుంది.

అమ్మాయి : ‘‘మీరు మందు తాగుతారా..?’’
సర్దార్ : ‘‘అవును’’.

అమ్మాయి : ‘‘ఎంత?’’
సర్దార్ : ‘‘రోజుకి ఆరు పెగ్గులు తాగుతా’’!

అమ్మాయి : ‘‘ఓహో.. ఆ ఆరు పెగ్గులకు ఎంత ఖర్చవుతుంది?’’
సర్దార్ : ‘‘సుమారు 1000 రూపాయల వరకు’’.

అమ్మాయి : ‘‘ఎప్పటినుంచి తాగుతున్నావ్?’’
సర్దార్ : ‘‘దాదాపు 14 సంవత్సరాల నుంచి’’

అమ్మాయి : ‘‘ఓహో.. అంటే రోజుకు 1000 రూపాయల లెక్కను నెలకు 30000 రూపాయలు తాగడానికి ఖర్చు పెడుతున్నావన్నమాట! అలాగే సంవత్సరానికి 360000 రూపాయలు! అంటే మొత్తం 14 సంవత్సరాలలో నువ్వు 50 లక్షల రూపాయల వేస్ట్ చేశావ్. నీకో విషయం తెలుసా.. అదే 50 లక్షలు వుండుంటే ఇప్పటికి నువ్వు BMW కొనుండేవాడివి’’

సర్దార్ : ‘‘నువ్వేమైనా మందు తాగుతావా?’’

అమ్మాయి : ‘‘లేదు. నేను ఇంతవరకు దానిని ముట్టుకోలేదు కూడా!’’

సర్దార్ : ‘‘మరి నీ BMW ఏది?’’  హాహాహాహాహా... హాహాహాహాహ.. అని నవ్వుకున్నాడు.