సీమంతం ఎందుకు చేస్తారు..?
💐💐💐💐💐💐💐💐💐💐
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం.
కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.
ఇది గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును. అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును. అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ చేసెడి నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.
కాబట్టి సీమంతమనగా మనము చేసుకునే వేడుక గాదు. తల్లి, అత్తగారు, భర్త, శ్రేయోభిలాషులతో సంతోషముగా, ముత్తైదువుల ఆశీర్వాదము పొందుట ఏ మహిళకైనా మంచిదే. కానీ, దాని పేరిట పైన చెప్పిన సీమంత ప్రక్రియను చేయకుండుట శాస్త్ర సమ్మతము కాదు.
సీమంతం అనే వేడుక జరపడం వలన ఆ స్త్రీకి మానసికపరమైన ఉల్లాసం లభిస్తుంది. సంతానం గల ముత్తయిదువులంతా వచ్చి ఆశీర్వదించడం వలన వారి నుంచి ఆమెకి అవసరమైన శక్తి అందుతుంది. ప్రసవ సంబంధమైన ఆందోళన ఆమెకి లేకుండా చేస్తుంది.
ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతం లో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.
No comments:
Post a Comment