పనీర్ పాలకూర బాల్స్
కావలసిన పదార్థాలు :
బ్రెడ్‌ముక్కలు-పది,
పాలకూర-కట్ట
అల్లం,పచ్చిమిర్చిముద్ద-అరచెంచా,
వెల్లుల్లి ముద్ద-అరచెంచా
గరంమసాలా-అరచెంచా,
నిమ్మరసం-చెక్క
ఉప్పు-రుచికి తగినంత,
పనీర్-150 గ్రా.
మారినేషన్ కోసం:
నిమ్మరసం-చెంచా,
అల్లం,పచ్చిమిర్చి ముద్ద-అరచెంచా
వెల్లుల్లిముద్ద-అరచెంచా,
మిరియాల పొడి-పావుచెంచా
మొక్కజొన్న పిండి-తగినంత,
నూనె-వేయించడానికి తగినంత
తయారుచేసే విధానం:
మొక్కజొన్న పిండి, నూనె కాకుండా మిగతా మారినేషన్ పదార్థాలు, పనీర్‌ను గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి.
తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్‌ముక్కల చివర్లు తీసేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకోవాలి.
అందులో పాలకూర తరుగు, మారినేట్ చేసిన పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేర్చుతూ బాగా కలపాలి.
బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని వేయించుకోవాలి.
బాగా వేగాక దించేస్తే పనీర్ పాలకూర బాల్స్ సిద్ధమయినట్టే. వీటిని చల్లటి సాయంత్రం వేళ టమాటాసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.
No comments:
Post a Comment