Pages

Wednesday, February 15, 2017

సెట్‌ దోశ

సెట్‌ దోశ

కావలసిన పదార్థాలు:
మినప్పప్పు - 1 కప్పు,
బియ్యం - 3 కప్పులు,
అటుకులు - 1 కప్పు,
మెంతులు - 1 టీ స్పూను,
నూనె - అర కప్పు,
ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం:
మినప్పప్పు, బియ్యం, అటుకులు, మెంతులు కలిపి కనీసం 4 గంటలు నానబెట్టాలి. మిక్సీలో వీటన్నిటినీ మెత్తగా రుబ్బుకుని, ఉప్పు కలిపి 8 గంటలపాటు పులబెట్టాలి. పిండి పలచగా కాకుండా చిక్కగా ఉండాలి. పెనంపైన మామూలు దోశల్లా పెద్దగా కాకుండా పూరీల సైజులో (అరంగుళం దళసరిగా) వేసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఇష్టమైతే పైన క్యారెట్‌ సన్నటి తురుము (ఒకవైపు) పలచగా చల్లుకుంటే చూడ్డానికి అందంగా ఉంటాయి. ఈ దోశలు వేడిమీద ఆలూ కుర్మాతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment