ఎందుకు నేను హిందువును?
పార్ట్ -2
నేను చెప్పిన సమాధానానికి ఆమె ఆశ్చర్య పోయి ఐతే నువ్వు ఎవరెవు ? నేను హిందువుని అని చెప్పగానే ఆమె నన్ను ఒక బోనులో జంతువులాగా చూసి.నేను ఏమీ చెబుతున్నానో అర్ధం కానట్లు చూసింది.సాధారణ యూరప్ , అమెరికా పౌరులకి ప్రపంచం లోని ప్రస్తుత లీడింగ్ మతాలైన క్రైస్తవం ,ఇస్లాం గురించి మాత్రమే తెలుసు.
హిందువు ఏమిటి ఇది ?
ఆమె:మీ మత ప్రవక్త ఎవరు ?
అతను:మాకు మత ప్రవక్త ఎవరూ లేరు.
ఆమె: మీ పవిత్ర మత గ్రంధం ఏది ?
అతను: మాకు ఒక పవిత్ర గ్రంధం లేదు?
కానీ మాకు వందల,వేల పవిత్ర ఆధ్యాత్మిక గ్రంధాలు ఉన్నాయి.
ఆమె: ఐతే కనీసం మీ దేవుడి గురించి చెప్పండి ? అతను మీరేమని అడుగుతున్న్నారు. అదే క్రైస్తవుల కి క్రీస్తు ,ముస్లిము లకి అల్లాహ్ లాగా మీకు కూడా ఒక దేవుడు లేడా ?
అతను కాసేపు ఆలోచించాడు.
ముస్లిములు ,క్రైస్తవులు వాళ్ళ మతాలలో ఒకే ఒక మగ దేవుణ్ణి మాత్రమే నమ్ముతారు.వాళ్ళ దేవుడు మాత్రమే శ్రద్ధతో ఈ మానవులను సృష్టించాడు అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నమ్మకం వాళ్ళ బుఱ్ఱ అంతవరకే పరిమితం.
ఆమె , ఆమెలాగానే హిందుత్వం గురించి తెలియని వాళ్ళందరూ
ఒక మతానికి ఒక దేవుడు ,ఒక పవిత్ర గ్రంధం ,ఒక ప్రవక్త ఉండాలి అని అనుకుంటారు.వాళ్ళ బుర్రలో ఆలోచన అంత వరకే ,పరిమితం గా ,విశాల ధృక్పధము ఉండవు.ఇంతకంటే భిన్నమైన ఆలోచన వాళ్లు ఒప్పుకోరు
No comments:
Post a Comment