బనానా ఇడ్లీ
కావలసిన పదార్థాలు :
రవ్వ - ఒక కప్పు
కొబ్బరి తురుము
- పావు కప్పు
పండిన అరటిపండ్లు - 4
చక్కెర - అరకప్పు
బేకింగ్ సోడా
- అర టీ స్పూన్
నెయ్యి - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
పండిన అరటిపండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరటిపండ్ల గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, చక్కెర, బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేయాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కు నెయ్యి రాసి, అరటిపండ్లతో చేసిన మిశ్రమాన్ని పోసి 15నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇంకేముంది.. బనానా ఇడ్లీ రెడీ! పాలతో కలిపి ఈ ఇడ్లీలు తింటే ఎంతో ఆరోగ్యం!
No comments:
Post a Comment