Pages

Saturday, February 18, 2017

పంచముఖ ఆంజనేయస్వామి..................!!

పంచముఖ ఆంజనేయస్వామి..................!!

ఆంజనేయుడు అష్టసిద్ధులను కలిగియుండటం వల్లనే ఈయన మహాసిద్ధుడయ్యాడు..
ఎలాంటి క్షుద్ర ప్రయోగాలనైనా ఎదుర్కోవాలంటే ప్రత్యంగిరాదేవి ప్రముఖం.. కానీ ఆమెకంటే కూడా అధిక శక్తివంతమైన హనుమంతుడు కాశ్మోరా వంటి అతిభయంకరమైన క్షుద్ర ప్రయోగాలను నిమిషాలమీద నిర్మూలించగలడు.. ఆంజనేయస్వామి స్వరూపాలలో పంచముఖ ఆంజనేయస్వామి అత్యంత శక్తిమంతుడు.. మానవాతీత శక్తులను పొందాలనుకునేవారు క్షుద్రపీడలు నివారించగలిగే శక్తిని సాధించాలనుకునే వారు ఎక్కువగా పంచముఖ ఆంజనేయస్వామివారిని ఆరాధించాలి.. ఆయన ఐదు శిరస్సుల గురించి చెప్తున్నాను..
మధ్యభాగంలో వానరముఖం హనుమంతుడు..ఈ శిరస్సు ఆయన ధైర్యానికి, బలానికి చిహ్నం..
దక్షిణంవైపు చూసే శిరస్సు నారసింహుడు..ఈ శిరస్సు ఆయన నిర్భయుడని చెప్తుంది..
పశ్చిమ దిక్కువైపు చూసే శిరస్సు గరుత్మంతుడు.. ఈ శిరస్సు ఆయనయొక్క తంత్రజ్ఙానాన్ని తెలియజేస్తూ, పాము కాటు నుంచి కూడా రక్షిస్తుంది..
ఊత్తరదిక్కువైపు చూసే శిరస్సు వరాహస్వామి..ఈ శిరస్సు అనారోగ్యములను తొలగించి, పిశాచాలను వదిలించే శక్తినిస్తుంది..
ఆకాశంవైపు చూసే శిరస్సు హయగ్రీవస్వామి..ఈ శిరస్సు ఎంతటి బలవంతమైన శత్రువులనైనా జయించే శక్తినిస్తుంది.. ఇన్ని అద్భుతమైన శక్తులను కలిగియుండటం వల్లనే పంచముఖ ఆంజనేయస్వామి తంత్రమార్గంలో గొప్పస్థానాన్ని పొందాడు.. సూర్యనమస్కార విధానాన్ని, ప్రాణాయామాన్ని కనుగొన్నది కూడా ఆంజనేయుడే...

No comments:

Post a Comment