మన దేశంలో..
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల కంటే ముందే.. 1994 నుంచే.. మన దేశంలో అహ్మదాబాద్, బొంబాయి, దిల్లీ వంటి నగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ ‘కంగారూ మదర్ కేర్ యూనిట్ల’ను ప్రారంభించారు. 2003లో సంస్థ సిఫార్సుల తర్వాత ఈ యూనిట్లన్నింటినీ కలుపుతూ ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే ‘కేఎంసీ నెట్‌వర్క్’ అంటారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా నవజాత శిశువుల సంరక్షణ పథకం కింద ‘ఐఎంఎన్‌సీఐ’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఎన్నడో ప్రవేశపెట్టినా ఇప్పటికీ వీటి అమలు మందకొడిగానే ఉంటోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో దీన్ని విస్తృతంగా అమలు చేస్తూ.. వాళ్లు శిశు మరణాలను గణనీయంగా తగ్గించుకోగలిగారు కూడా.
ప్రపంచంలో నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల మరణాల్లో మూడో వంతు మన దేశంలోనే సంభవిస్తున్నాయి. కంగారూ సంరక్షణ విధానాన్ని అమలు చేస్తే ఈ మరణాల్లో కనీసం సగానికి సగం (50%) తగ్గించగలుగుతామని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మనం వీటిని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆసుపత్రిలోనూ నవజాత శిశువుల వార్డులో (నియోనేటల్ వార్డ్) ఈ కంగారూ యూనిట్‌ను ఏర్పాటు చెయ్యటం, తక్కువ బరువుతో పుట్టినబిడ్డలందరికీ ఇది అమలయ్యేలా చూడటం అవసరం.

No comments:
Post a Comment