ఒక అడవిలో సిరిపురం అనే గ్రామం ఉండేది. అక్కడ దాదాపుగా ఒక యాభై కుటుంబాలు ఉండేవి. ఆ గ్రామానికి చివర్లో ఒక మర్రిచెట్టు ఉండేది. ఒకనాడు ఎక్కడి నుండో ఒక యోగి వచ్చి ఆ చెట్టు క్రింద యోగాభ్యాసం ధ్యానం, సమాధి నిష్ఠలతో ఉండేవాడు. ఆ గ్రామం నుండి కట్టెలు కొట్టుకోవడం కోసం, ఆహారం కోసం అటుగా వెళ్ళే వారు సంస్కారవంతులు కనుక ఆ యోగికి నమస్కరించి వెళ్ళేవారు. కొందరు వారికి తోచిన పళ్ళు ఫలాలు ఇస్తూ ఉండేవారు. గ్రామం చుట్టూ అడవి ఉండేది కనుక అక్కడికి కొన్ని సాధు జంతువులు కూడా వస్తు ఉండేవి. వచ్చినవాటికి అక్కడి గ్రామ ప్రజలు ఇచ్చిన ఫలాలు పెట్టేవాడు కాని తాను మాత్రం తినేవాడు కాదు. ఉంచ్చ వృత్తితో బ్రతికేవాడు. ఉంచ్చ వృత్తి అంటే తనంతట తాను రాలిపోయిన పళ్ళని మాత్రమే తినడం. అవి దొరకనినాడు ఆహారం లేకుండా ఉండడం.
ఇలా జరుగుతూ ఉండగా కాలక్రమంలో గ్రామం బాగా పెరిగింది. వారికి సంపదలు కూడా పెరిగాయి. ఒకటి రెండు పళ్ళు ఇచ్చేవారు కాస్తా గంపల్లో తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా సంవత్సరాల తరబడి గ్రామప్రజలు పళ్ళు పలహారాలు ఇస్తున్నా ఏనాడూ తాను మాత్రం వాటిని స్వీకరించలేదు. సరికదా ఎవ్వరితో మాట్లాడేవాడు కూడా కాదు. అయినా గ్రామప్రజలు ఆయనకి ఆహారం అందజేస్తూనే ఉన్నారు. యోగి ఆ ఆహారాన్ని సాధు జంతువులకి పెడుతూనే ఉన్నాడు.
ఒకనాడు గ్రామంలో ఒక ధనికుడు యోగిని భోజనానికి రమ్మని తన ఇంటికి ఆహ్వానించాడు. అయన చిరునవ్వుతో తిరస్కరించాడు.అయన మళ్ళి మళ్ళి అడిగాడు. కుదరదు మాకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తిరస్కరించి నేను రాలేను. అన్నాడు. అయినా వదలకుండా పట్టుబట్టాడు. నానారకాలుగా బ్రతిమలాడాడు. ఇక చేసేది లేక సరేనని వెళ్ళాడు.
ఇల్లు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇంటి బయట ఇంటిలోపల పనివారితో, బంధువులతో కళకళలాడుతూ ఉంది. యోగి రాగానే అందరు సాష్టాంగ ప్రణామం చేసి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి మంచి విందు ఏర్పాటు చేశారు. అన్నీ బంగారంతో చేయించినవి. కంచం బంగారం, గ్లాస్ బంగారం, వడ్డించే గరిటెలు బంగారం. అయినా కానీ యోగి సంతోషించలేదు. భోజనం చేసారు. భోజనం చేయగానే త్రాగడానికి ఇచ్చిన మంచినీళ్ళ పాత్ర దొంగతనం చేయాలని అనిపించింది. పాత్ర పట్టుకోబోయి తమాయించుకొని ఆగాడు. ఏమిటి? నేను ఏమిటి? పాత్ర దొంగతనం చేయడం ఏమిటి? ఏమైంది నాకు? అనుకోని ఇంటి యజమానిని పిలిచి ఈరోజు వంట చేసింది ఎవరు? అని అడిగాడు.మా పనిమనిషి అని సమాధానం చెప్పాడు. ఐతే వెంటనే ఆపనిమనిషిని పిలవండి అన్నాడు. పిలిచారు.
ఏమ్మా! నువ్వు ఏమనుకుంటూ వంట చేశావు? నిజం చెప్పు పర్వాలేదు. అన్నాడు. మా యజమాని ఇచ్చేదాని కంటే తక్కువ జీతం ఇస్తున్నాడు. అయినా అలాగే పనిచేస్తున్నాను. ఈరోజు మరింత పని ఎక్కువ చెప్పాడు. జీతం ఎక్కువ ఇవ్వమన్నాను. ఇవ్వనన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది. ఇంట్లోవన్నీ బంగారపు వస్తువులే. మంచినీళ్ళ పాత్ర చాలా అందంగా ఉంది. దాన్ని ఎలాగైనా దొంగతనం చేయాలి. దొంగతనం చేయాలి. అనుకుంటూ వంట చేశాను. అంది. అది విషయం అనుకోని యజమానికి "పనికి తగ్గ జీతం ఇవ్వండి. లేదంటే మీరు నష్టపోవడమే కాకుండా ఇతరులను కూడా నాశనం అయ్యేలా చేస్తారు.ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ఆహారం తినగానే నీవు పెట్టిన మంచినీళ్ళ పాత్ర దొంగతనం చేయాలనిపించింది. నాకు బంగారమైన మట్టి బెడ్డ అయినా ఒక్కటే. అలంటి నాకే దొంగతనం చేయాలనే తలంపు వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?
వంట చేసే సమయంలో దైవనామ స్మరణ పూర్వకంగా చేస్తే ఆహారం శుద్దమౌతుంది. అంతేకాని చెడు ఆలోచనలు చేస్తూ వండితే అది తినేవాడు కూడా చెడిపోతాడు.దేహ శుద్ధి ఒక్కటే ఉంటె సరిపోదు. ఆత్మశుద్ధి కూడా ఉండాలి.అప్పుడే మీరు మీ చుట్టూ ఉండేవారు సుఖంగా ఉంటారు. సీరియల్స్ చూస్తూ వండితే మిమ్మల్ని యముడు కూడా సీరియల్ గా చంపుతూ ఉంటాడు. తినేటప్పుడు, త్రాగేటప్పుడు తప్పకుండ కూర్చుని ఉండాలి. నిలబడి త్రాగేవారిని తినేవారిని చేతులు నరికేస్తాను అని యముడు యమస్మ్రుతిలో వివరించాడు. కాబట్టి ఆహరం విషయంలో కాని ఆహారం తీసుకునే విషయంలో కాని జాగ్రత్తలు పాటించి తీరవలసిందే. ఇంటికి అథితి వచ్చినప్పుడు, శుభకార్యాలు జరిగేటపుడు అతిథులకు భోజనం పెట్టిన తరువాత వారు తిన్న విస్తరలు (ఎంగిలి ఆకులు) ఆ ఇంటి యజమానులు తీస్తే శుభం సుఖం కలుగుతాయి. ధర్మరాజు రాజసూయ యాగం చేసేసమయంలో భోజనం చేసిన లక్షలాది మంది తిన్న ఎంగిలాకులు సాక్షాత్తు శ్రీకృష్ణుడు తీశాడు. పాండవులు తీయకపోవడంతో వారు కష్టాల పాలయ్యారని పురాణాలు పేర్కొన్నాయి. అతిథిని గౌరవించడం, ఆహారం విషయంలో అంతటి ప్రాధాన్యం ఉంది.
శ్రీ గురుభ్యోనమః
అడ్మిన్
శ్రీకృష్ణ..
No comments:
Post a Comment