Pages

Showing posts with label moral. Show all posts
Showing posts with label moral. Show all posts

Monday, December 26, 2016

దుర్యోధనుని చెల్లెలి కథ

దుర్యోధనుని చెల్లెలి కథ

కౌరవులు ఎంతమంది అనగానే ఠక్కున వందమంది అని చెప్పేస్తాం. దృతరాష్ట్రుని పిల్లలందరూ కౌరవులే అనుకుంటే కనుక 102 మంది కౌరవుల లెక్క తేలుతుంది. ఎందుకంటే దృతరాష్ట్రునికీ, సుఖద అనే చెలికత్తెకీ యుయుత్సుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇక కౌరవులకు దుస్సల అనే చెల్లెలు కూడా ఉంది. ఈ ఇద్దరితో కలుపుకొని కౌరవులు 102 మంది!

జననం
వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది. అయితే కాలం గడుస్తున్నా తనకి సంతానం కలగకపోగా, తన తోటికోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు. దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు, తన వరం వృధా పోదనీ, ఆ మాంసపు ముద్దలని నూరు కుండలలో ఉంచమనీ... వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారనీ పేర్కొంటాడు. అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి. ఆమె కోరికను వ్యాసుడు మన్నించడంతో 101 కుండలలో ఆమె గర్భస్థ శిశువుని భద్రపరుస్తారు. అలా జన్మించిన 101వ శిశువే దుస్సల.
వివాహం
దుస్సల బాల్యం గురించి మహాభారతంలో ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే నూరుగురు సోదరులకు తోడు ఐదుగురు పాండవులు కూడా కలిసి పెరగడంతో బహుశా ఆమె వారందరి సోదర ప్రేమను పొంది ఉంటుందనడంలో సందేహం లేదు. దుస్సలకి యుక్తవయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రధునితో వివాహం జరుగుతుంది. ఇతను ఎవరో కాదు... మనం తరచూ వినే ‘సైంధవుడే’! సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధునికి ఆ పేరు వచ్చింది. సైంధవుడు మహా క్రూరుడు. పైగా స్త్రీలోలుడు. ఒకరోజు వనవాసంలో ఉన్న ద్రౌపది చూసి మోహిస్తాడు. ఆమె ఎంతగా వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆశ్రమానికి చేరుకున్న పాండవులు, విషయాన్ని తెలుసుకొని ద్రౌపదిని వెతుక్కుంటూ బయల్దేరతారు. ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకువెళ్తున్న సైంధవుడు కంట పడటంతో, వారి క్రోధానికి అంతులేకుండా పోతుంది. అయితే దుస్సల సౌభాగ్యం కోసం అతడిని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించడంతో.. అతని చావచితక్కొట్టి, గుండు గొరిగించి వదిలిపెడతారు పాండవులు. అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది.
తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సైంధవుడు, శివుని కోసం ఘోరర తపస్సుని ఆచరిస్తాడు. అర్జునుడు మినహా, మిగతా పాండవులందరినీ ఒక్కరోజు పాటు యుద్ధంలో నిలువరించగల వరాన్ని పొందుతాడు. ఆ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులను నిలువరించి, అభిమన్యుడి చావుకి కారణం అవుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుని చావుకి ప్రతీకారంగా సైంధవుని సంహరించడంతో సైంధవుని చరిత్ర సమాప్తమవుతుంది.
అర్జునునితో సంధి
కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితుడవుతాడు. అదే సమయంలో జయద్రధుని వారసునిగా, అతని కుమారుడైన సురధుడు సింధు రాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధయాగాన్ని తలపెడతాడు. ఇందులో భాగంగా యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీస్తుంది. ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడూ బయలుదేరాడు.

యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురదుడు, అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండాగి చనిపోతాడు. సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. కానీ మహామహావాళ్లే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు, అతను ఎంతసేపని తన పోరుని సాగించగలడు. అందుకే ‘తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి, తన మనవడిని కాపాడమంటూ’ దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెనుదిరుగుతాడు అర్జునుడు. అలా దుస్సల విచక్షణతో కౌరవ, పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరాన్ని నిలిచిపోతుంది

* అగ్ని దేవుడు

* అగ్ని దేవుడు

జీవితంలో ఎదురయ్యే క్లేశాలనూ, వినాశాలనూ, తప్పిదాలనూ, నిర్మూలించి సర్వతోముఖ శ్రేయస్సును అందించే అగ్ని తత్త్వం అపూర్వం.

• పాపమే అంటని అగ్నిదేవుడు సకల వ్యాపియై తన జ్వాలల ద్వారా లోకాన్ని పునీతం చేసి సత్యరూపంగా చిత్రిస్తుంటాడు.

భారతీయ సంస్కృతికీ, సంప్రదాయానికీ ఆలవాలమైన ప్రాకృతిక సౌందర్యం మానవ మనుగడకు ఊతమందిస్తూ రక్షణ కవచమై అలరారుతుంది. మనిషి ప్రకృతిని ఆరాధిస్తే, ప్రకృతి కూడా మనిషిని ఆదరిస్తుంది. ఆలంబనై నిలుస్తుంది. పరస్పర సహకారంతో మనుగడ సాగించడం ప్రకృతి ప్రణాళిక. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశమనే అయిదు తత్త్వాలే సృష్టికి మూలహేతువులై పంచభూతాలుగా ప్రకృతిలో భాగమయ్యాయి. మనిషి ముఖ్య ఆధారాలై భాసిల్లుతుంది.

సర్వాగ్రణీ, సర్వ ప్రథముడూ అయిన అగ్నిదేవుడు ప్రకృతి శక్తులలో ప్రముఖుడూ, ప్రధానుడు. భూమండలంలోని ప్రముఖ తత్త్వాలకు ఆలంబన అగ్నితత్త్వం. సత్యనిష్ఠతో ప్రేరితమైన అగ్నిజ్వాల లోకంలోని సమస్తమునూ పవిత్రీకరిస్తుంది. పావనం చేస్తుంది. అందుకే స్వర్గ ప్రాక్తికి సాధనం అగ్ని ఆరాధన అంటోంది వేదం.

‘" ఓం అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవ మృత్విజమ్|
హోతారం రత్నధాతమమ్|| "

సృష్టి యజ్ఞానికి ప్రథమ పురోహితుడూ, లోకంలోని అందరి ఆహుతులనూ మోసుకెళ్లి దేవతలకర్పించే ఏకైక యాగపురుషుడూ అగ్నిదేవుడు

అగ్ని దేవునికి రెండు తలలు , ప్రతి తలకి రెండు కొమ్ములు ,ఏడు నాలుకలు, ఏడు చేతులు, మూడు కాళ్ళు ఉంటాయి. ఈయనకు కుడి వైపు భార్య స్వాదా దేవి, ఎడమవైపు స్వాహా దేవి ఉంటుంది. దైవ కార్యాలలో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాలలో స్వదా దేవి తన పాత్ర పోషిస్తుంది. ఈయన వాహనం మేక. అన్నిటినీ ఈయన ఆరగించ గలడు కావునా ఈయన్ని ” సర్వభక్షకుడు ” అంటారు. ఇంకా ఈయనకు హుతవాహనుడు, దేవముఖుడు, సప్తజిహ్వుడు, వైశ్వానరుడు, జాతవేదుడు అని కూడ పేర్లు.

సృష్టి యజ్ఞపు అంతరార్థాన్ని ఆవిష్కరించే వాడూ, నిత్యనిజసత్య స్వరూపుడూ, అనంత మహిమాన్వితుడూ అయిన అగ్నిదేవుడు దేవతలందరితో భువికి అరుదెంచి ప్రసన్నుడై ఆశీర్వదించేలా వారందరినీ హవిస్సులతో తృప్తిపరచి నిష్పక్షపాతంగా లోకాన్ని సుఖిక్షం చేసే దేవదేవుడు.

ఇవి చదివి తెలుసుకొందాం. .

ఇవి చదివి తెలుసుకొందాం. .
*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్......

జ్యోతిష్యం కర్మసిద్ధాంతం :

జ్యోతిష్యం కర్మసిద్ధాంతం :

ఈ రోజు మనమున్న స్థితికి గతజన్మలో మనం చేసిన కర్మఫలం కారణం. అలాగే ఇవాళ మనం చేసిన కర్మల ఫలితాన్ని రాబోయే జన్మలో మనం అనుభవించక తప్పదు. ఈ విషయాలను మన ఋషులు మనకు ఉపదేసించారు. పాపకృత్యాలే అన్నింటికీ కారణమన్నారు. భగవంతుడు కరుణామయుడు. అదే సమయంలో న్యాయమూర్తి కూడ! మనం చేసిన పుణ్యాలకు మోక్ష ఫలాన్ని అందిస్తూనే, పాపకృత్యాలకు తగిన శిక్షను అమలు చేస్తాడు. ఇది తప్పదు.

ఈ నేపథ్యంలో జ్యోతిశ్శాస్త్రం భవిష్యత్తులో మనకు జరుగబోయే విషయాలను తెలియజేసి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మార్గదర్శకంగా ఉంటుంది. ఒక విపత్తు వస్తుందని ముందుగా తెలిస్తే, దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి, దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మనకు తెలియకుండా ప్రమాదం జరిగితే, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం కూడా భవిష్యత్తులో జరుగబోయే సంఘటనల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంది విముక్తి పొందే మార్గాన్ని స ూచిస్తుంది. కర్మ సిద్థాంతం మూడు రకాలైన కర్మలను గురించి చెబుతోంది.

1. ప్రారబ్దకర్మ: గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని ప్రస్తుతం అనుభవించడాన్ని ప్రారబ్ద కర్మ అంటారు.

2. సంచితకర్మ: గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం సంచితకర్మ.

3. ఆగామికర్మ: ప్రస్తుతజన్మలో మనం చేస్తున్న కర్మల ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించేదిగా రూపుదిద్దుకోవడాన్ని ఆగామికర్మ అనంటారు.

మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. శ్రీకృష్ణ భగవానుడు మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జ్యోతిష శాస్త్రం, జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనిషికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

ఎవరైనా... పరిహార ప్రక్రియలు పాటిస్తే... జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తి పొందగలరు. అందుచేత జయం, దానం, హోమం, శాంతి, దేవాలయ దర్శన, రత్నధా రణ, మొ విషయాలు జ్యోతిష్యంలో చెప్ప బడ్డాయి. ఇవి చేయటానికి ముందు మరికొ న్ని విషయాలు తెలుసుకొని అప్పుడు పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.

‘భా’ అంటే కాంతి, కాంతి విజ్ఞానానికి, ఆనం దానికి, పరమాత్మకు సంకేతం. దాని యందు ‘రతి’ (వీలు) గలవారే భారతీయులు.

కర్మ సిద్ధాంతం అంటే (ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి అని కొందరి భావన. కాని చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించుట సార్వత్రికంగా నియ మం కాదు. అప్పుచేసిన వాడు తీర్చకపోతే జైలుకు పోవుట కర్మ ఫలితంగా భావిస్తే... ‘తీర్చుట’ అనే ప్రక్రియ జైలుకు పోకుండా కాపాడుతుంది. అనగా పూర్వం చేసిన కర్మకు అనుభవించుటం ఒక మార్గమైతే...

దానిని నిరోధించుట కొరకు మరో కర్మ చేయుట మ రో మార్గం. కాగా జాతకం లో ఉన్నది తప్పక అనుభవించాలి. అనే విధానం మాత్రం సరియైనది కాదు. బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టత్పలుడు ‘జాతక ఫలితాన్ని అనుభవించుటే తప్పనిసరి అయితే దానిని తెలుసుకొనుట వ్యర్థం. భావి ఫలితాన్ని ముందుగా తెలుసుకొట వల్ల రాబోయే దుఃఖం కోసం ఇప్పటినుండి దుః ఖించడం అనే నష్టాలుండటం వల్ల జాతక ఫలితం తెలుసుకోవడమే నష్టప్రదం అవుతుం ది. శాస్త్ర ప్రయోజనం అదికాదు. ఒక జాతకంలో శుభ ఫలితాన్ని తెలుసుకొని అనువైన కృషి చేయటం ద్వారా ఫలితాన్ని సంపూర్ణంగా సాధించవచ్చు.

జాతకంలోని దుష్ట ఫలితాన్ని విశ్లేషించి దానాదికములైన పుణ్యకర్మల ద్వారా శుభఫలితాన్ని పెంచుకోవచ్చు. దుష్టఫలితాన్ని ముందుగా తెలుసికొనుట ద్వారా దానికి వ్యతిరేదిశలో ప్రయత్నించి దుష్ట ఫలితాన్ని జయించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఆ దోష ప్రాబల్య శా తాన్ని గమనించి దాన్ని జయించడం సాధ్యం కాని పంలో దానికి సిద్ధపడి తన జీవనగమనంలో అనుగుణమైన మార్పులను చేసుకోవచ్చు’ అని వివరించాడు.

కర్మ ఫలితం వుంటుంది. అది దుష్టమైనదైనపుడు దాని నివారణకు చేసే కర్మకూ ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి. పూర్వం చే సిన కర్మను దానివల్ల వచ్చే ఫలితా న్ని అదృష్టమని, దైవికమని పిలుస్తుంటారు. ‘విహన్యాద్ధుర్బలం దైవం పురుషేణ విపశ్చితా’ అనే వ్యాసుని వచనం పూర్వకర్మను ప్రస్తుత కర్మచే జయించవ్చనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. మనమిదివరలో చేసిన కర్మననుసరించి మ న జననం సంభవిస్తుంది. మన జననం మనచేతిలో లేదు, కాని అప్పటి గ్రహస్థితి పూర్వకర్మకు అనుగుణంగా ఉంటుంది. ఆ గ్రహస్థితి ప్రభావం కాలక్రమంలో దశాక్రమాన్ననుసరించి ఆయా భావనలు ప్రేరేపిస్తుంది.

ప్రేరేపించబడిన భావనకు స్పందించిన వ్యక్తి తన భావాలను అనుసరించి ప్రవర్తించ కుండా శాస్త్రం, సామాజిక న్యాయం, అనుభవం ఆధారంగా చేసుకొని వివేకంతో ప్రవర్తించి మంచి న పెంచుకోవడం, చెడ్డను తొలగించుకోవడం, చేయవలసి వుంటుంది. దోషఫలితం సిద్ధించే సమయాన్ని జాతకం తెలుపుతుంది. దానిని ముందుగా గుర్తించడం ద్వారా దానిని జయిం చే అవకాశాన్ని జాతకం కల్పిస్తుంది. అఘజాతకంలో ‘యదుపచిత మన్య జన్మని శుభ శుభం తస్య కర్మణః పంక్తిం వ్యం జయతి శాస్తక్రులత్‌ తమసి దైవ్య ణి దీపమేవ’ అన్నారు వరాహమిహిరుడు. పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క ఫలానుభవ కాలాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయం తో గుర్తించినట్లుగా కలుగబోయే శుభాశుభాలను జాతకం ద్వారా గుర్తించి అనుకూల, వ్యతిరేక ప్రక్రియ ల ద్వారా జీవితాన్ని సుఖవం తం చేసుకొనుటకు ఈ శాస్త్రం సహకరిస్తుంది.
కర్మ 3 విధులు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ప్రారంబ్ధం అంటే -

పూర్వజన్మలో మనం చేసిన కర్మల ఫలితం అనుభవించడం ప్రారంభించింది. ప్ర - ఆర బ్దం - ఇంతకు ముందే ఆరంభింపబడింది. దానిని జయించ శక్యం కాదు. విడిచిపెట్టిన బాణం యొక్క మార్గాన్ని మళ్ళించ డం అంత సులభం కాదు. సంచితం- సంచితకర్మ అంటే పూర్వం చేయబడిన నిల్వవున్నది. ఆగామి - అంటే రాబోయే కాలంలో పరిపక్వమయ్యేది. మన సత్ప్రవర్తన ద్వారా ఆ గామిని మంచిగా మలచుకోవచ్చు. జాతకం ద్వారా రాబోయే దుష్టఫలితానికి వ్యతిరేకంగా మనం చెయ్యాల్సి న కృషిని అం చనా వేసుకొని ఆధ్యాత్మిక లౌకిక ప్రయత్నాల ద్వారా కృషి చేసి దుష్టఫలితాన్ని అధిగమించవచ్చు. ఉదాహరణకి... నిన్న ఒక వ్యక్తిని మనం కొట్టాం. ఈ రోజు అతను మనల్ని కొట్టడానికి పదిమందిని వెంటవేసుకొనివస్తున్నాడు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని మనం అతని చేతిలో దెబ్బలు తినటం తప్పనిసరి అని తెలిస్తే మూడు విధాలుగా దానిని అధిగమించవచ్చు.

ఎ) అతను ఎన్నింటికి వస్తున్నాడో తెలుసుకొని అతను వచ్చే సమయానికి ముందే అతనితో వచ్చే బలగం కాన్నా ఎక్కువ బలగంతో వెళ్ళి ‘క్షమార్పణ’ చెప్పడం ఒక మార్గం. జాతకంలో ఉన్న దుష్టఫలితం యొక్క శాతాన్ని గమనించి దానాదుల ద్వారా దానికన్నా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించి గతంలో తాను చేసిన అపరాధాలను క్షమించమని ప్రార్థించేటువంటి ఇది.

బి) ఎదుటివాడు 10 మందితో వస్తే అతన్ని జయించే విధంగా ఇంకా ఎక్కువ బలగంతో వెళ్ళి ఎదురించడం రెండో మార్గం... జాతకంలో దుష్ట సమయాన్ని గుర్తించి లౌకికమైన కృషిని పెంచి దుష్టఫలితాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం ఇలాంటిదే.

సి) అతను వచ్చేసమయానికి అతనికి కనిపించకుండా దాక్కోవడం. మనకు జాతకంలో వచ్చే దుష్టసమయాన్ని గుర్తించి నూతన ప్ర యత్నాలు చేయాలి.

వేదం గోప్పదా ????అదిఏలా

వేదం గోప్పదా ????అదిఏలా
అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది. 
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.
ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం
1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )
2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )
3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)
4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )
5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)
6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)
7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)
చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.
ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.
క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం. పేద్దల సహకారంతో   ..
!! సర్వం శ్రీ శివార్పణమస్తు!!