ఓ సాధువు ఓ పార్టీకి వెళ్ళాడు
అక్కడ అంతా బాగా తాగి ఉన్నారు,
అక్కడున్న వారంతా సాధువు వేషం చూసి అతడిని ఆటపట్టించసాగారు
నాయనా నేను ఓ సాధువును,నాకు కోపం తెప్పించకండి,శపించగలను అన్నాడు
వారు అతని మాటలు పట్టించుకోకుండా అరే పాగల్ గా శపిస్తవా శపించురా చూద్దాం బావురు గడ్డమూ నువ్వూనూ నీ అయ్య అని నవ్వసాగారు
సాధువుకి చాలా కోపం వచ్చింది
అకస్మాత్తుగా సాధువుని చూసి నవ్విన వారందరి కళ్ళూ పోయాయి
వారు తమ తప్పు తెలుసుకుని అతని కాళ్ళ మీద పడి ఏడవసాగారు
స్వామీ మీ మహిమ తెలియక హేళన చేశాం
మా తప్పు మన్నించండి
మా కళ్ళు మాకు ప్రసాదించండి
అని వేడుకున్నారు
అప్పుడు స్వాధువు పలికాడు
అరేయ్ మీకు బాగా ఎక్కేసిందిరా
నేను మిమ్మల్ని శపించలేదు
మీ కళ్ళూ పోలేదు
కరెంటు పోయింది
నాకూ కనపడట్లేదు
కింద పడేలా ఉన్నా నా కాళ్ళు వదలండిరా
పిచ్చిపుల్కాలారా
ఎవరైనా వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి లేవండి పొండి
😂 .....😂 .....😂
No comments:
Post a Comment