Pages

Wednesday, February 15, 2017

ఉల్లిపాయ పచ్చడి


ఉల్లిపాయ పచ్చడి

కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
పచ్చిమిర్చి -3
ఎండుమిర్చి - 3
నువ్వులు - 2 టీ.స్పూ.
మినప్పప్పు - 1 టీ.స్పూ.
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
ఎండుమిర్చి - 2
పుదీనా ఆకులు - 10
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 టీ.స్పూ.
కరివేపాకు - 1 రెబ్బ
చింతపండు - పెద్ద సైజు నిమ్మకాయంత
ఉప్పు - తగినంత
నూనె - 4 టీ.స్పూ.

తయారుచేసే పద్ధతి :
పాన్ వేడి చేసి నువ్వులను దోరగా వేయించుకోవాలి.
పాన్‌లో సగం నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా ఆకులు, నువ్వులు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్దవేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత దింపేసి చల్లారనివ్వాలి.
ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి తగినంత ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరో చిన్న గిన్నె లేదా గరిటలో మిగిలిన నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేగాక కరివేపాకు వేసి కలిపి నూరిన పచ్చడిలో వేసి కలపాలి.

No comments:

Post a Comment