Pages

Sunday, June 5, 2016

అహం

అహం
చైనాని పాలించిన టుంగ్‌ వంశీయుల కాలంలో వాళ్లదగ్గర ఒక ప్రధాన మంత్రి ఉండేవాడు. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు. దేశవిదేశ వ్యవహారాల్లో రాజుకు ఎంతో సహాయం చేసేవాడు.  దేశాన్ని అల్లకల్లోలాలకు గురికాకుండా చూసేవాడు.  సైనిక విషయాల్లోనూ ఎంతో నైపుణ్యం ప్రదర్శించేవాడు. ఆ ప్రధాన మంత్రికి ఎంతోగొప్పపేరు ఉంది. అందరూ ఆయన్ని గౌరవించే వాళ్ళు. పేరు ప్రఖ్యాతులు,గౌరవ మర్యాదలు, ఐశ్యర్యం,అధికారం అన్నీ ఉన్నా ఆయనకు బుద్ధునిపట్ల భక్తి. బుద్ధుని ధర్మాలను తూచా తప్పకుండా ఆచరించేవాడు.  ఆప్రాంతంలో పేరుపొందిన బౌద్ధ గురువు ఉండేవాడు. ఆ బౌద్ధ గురువు బుద్ధుడి బోధనల్ని అకుంఠిత దీక్షతో ఆచరించేవాడు. అతను బుద్ధుని బోధనల సారాంశం తెలిసినవాడు.  దేశవిదేశాల నుంచి ఆయన దగ్గరకు ఎందరో శిష్యరికం కోసం వచ్చే వాళ్లు.  దేశ  ప్రధానమంత్రి కూడా ఆయన శిష్యుడే.  ఒకరోజు గురువుగారిని దర్శించడానికి ప్రధాన మంత్రి ఆశ్రమానికి వచ్చాడు. గురువుగారికి నమస్కరించాడు. పరామర్శలు అయ్యేకా ఇద్దరూ ధర్మ చర్చల్లో దిగారు.  ఎన్నో విషయాలు ప్రధాన మంత్రి అడిగాడు. గురువు వాటన్నిటికీ సమాధానం చెప్పాడు.  ప్రధాన మంత్రి ఎంతో ఆనందించాడు. ఇక తను బయల్దేరాల్సిన సమయం వచ్చింది.  ప్రధాన మంత్రి ”గురువుగారూ! ఈ రోజు ఎంతో హాయిగా గడిచింది. నాలో కలిగిన ఎన్నో సందేహాలకు మీరు సమాధానాలిచ్చారు.  సంతృప్తి కలిగించారు. చివరిగా ఒక ప్రశ్న. దానికి మీరు సరైన సమాధానమిస్తే ఈరోజు సంపూర్ణమయిందని నేను భావిస్తాను” అన్నాడు.

గురువు ”దాందేముంది అడగండి” అన్నాడు.  ప్రధానమంత్రి ”అహం అంటే ఏమిటి?” అన్నాడు. ఆ మాటలతో గురువుగారి ముఖం ఎర్రబడింది. నిర్లక్ష్యంగా ప్రధానమంత్రి వేపు చూశాడు.  గురువుగారి ముఖంలో రంగులు మారడం చూసి ప్రధాన మంత్రి ఆశ్చర్యపోయాడు.  గురువు ప్రధాన మంత్రి కళ్లలోకి చూసి ”ఎంత తెలివి తక్కువ ప్రశ్న వేసావు?” అన్నాడు.  ఆ సమాధానంతో ప్రధాన మంత్రి షాక్‌ తీన్నాడు. ఊహించని ఆ సమాధానంతో ప్రధానమంత్రి ఉలిక్కిపడ్డాడు. గురువునుంచీ అతను అట్లాంటి సమాధానాన్ని ఊహించలేదు.  అప్పటి దాకా మరచిపోయిన తన అధికారం, స్థాయి అన్నీ అతనికి గుర్తుకొచ్చాయి. అతన్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన ఎదుట ఉన్నది తన గురువన్న విషయాన్ని కూడా అతను మరచిపోయాడు.  ఒరలో ఉన్న కత్తి దగ్గరకు అతనిచేయి కదిలింది. కళ్ళలో నిప్పులు కదిలాయి. అతని పరిస్థితి గమనించిన గురువు ” ప్రధానమంత్రిగారూ! దీన్నే అహం అంటారు” అన్నాడు. దాంతో ఒక్కసారిగా ప్రధానమంత్రి ఆవేశమంతా చల్లబడిపోయింది.  హఠాత్తుగా అతని పెదాలపై చిరునవ్వు కదిలింది.

Wednesday, June 1, 2016

ఆంజనేయుడు హనుమ అయిన కధ

ఆంజనేయుడు హనుమ అయిన కధ

ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు .ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని .ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది .అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది . నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు .అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు .దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము ,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు .దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు .

ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక ,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు .అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు .వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు .ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది .మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు .దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు .దీర్ఘాయువు ,బలం ,పరాక్రమం ,ఆరోగ్యం తేజస్సు ,గుణం ,బుద్ధి ,విద్య ,విచక్షణ ,ప్రసన్నత ,చతురత ,వైరాగ్యం ,విష్ణు భక్తి ,దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు .వజ్రాయుధం చేత మరణం ఉండదని ,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు .

విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని ,రామ కార్యం నేరవేరుస్తాడని ,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ,లంక లోని రాక్షసులను వదిస్తాడని ,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని ,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు .ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు .
దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రుమ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ ,అందర్నీ బాధిస్తుందే వాడు .అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా వుండే వారు .వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి ”నీ సహజ శక్తిని మర్చిపోతావు ”అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు .క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు .

విద్య నేర్చే వయసు వచ్చింది .తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది .ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు .తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు .తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద ,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు .అయిదు వ్యాకరణాలు నేర్పాడు .మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు .చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు .దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు .ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు .వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది .సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద .హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు .ఆమె సంతోషించి ”నాయనా !నాకు వాలి ,సుగ్రీవుడు అనే సోదరులున్నారు .నీకు వాళ్ళు మేన మామలు .వారిద్దరికీ బద్ధ వైరం .అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు .నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు .నీకు శుభం జరుగుతుంది ”అనిదీవించి పంపింది .

తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు .తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా , జాడను లంకలో తెలుసు కోని ,రాముని ముద్రికను ఆమెకిచ్చి ,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు .వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి ,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు .రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ .రావణున్ని రాముడు సంహరించాడు .సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు .మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి ,సేవా తత్పరుడై ,రామ కార్య దురంధరుడై ,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమ .

పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )

పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు
ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )

ఏదో చిన్న గొడవ వలన క్రీ.శ.2090లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంచుమించు అన్ని బలవత్తరమైన దేశాల వద్ద అణ్వాస్త్ర సంపద వున్నాయి. అందరూ యుద్ధంలో పాల్గొని ఒకరి మీదకొకరు ఈ అస్త్రాలు సంధించుకున్నారు. కొన్ని ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కూడా పడ్డాయి. అక్కడున్న మంచుకొండలన్నీ కరిగిపోయి ఒక్కసారి మొత్తం ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయాయి. దాదాపు అన్ని దేశాలు నీటమునిగిపోయాయి. అన్ని భవనాలు అగ్నికీలలో దగ్ధమయి తరువాత జల ప్రళయం వలన మునిగిపోయి, ఎక్కడనుండో కొట్టుకువచ్చిన మట్టితో కప్పబడిపోయాయి. ఈ భీభత్సం ఒక పది రోజులు జరిగాక మరల మామూలుగా నీరు తీసేసింది.వాతావరణం అంతా మారిపోయింది. దేవుని దయ వలన కొందరు మాత్రం ఎత్తైన కొండ గుహలలో, కొన్ని జీవ జంతుజాలం గుహలలోనో ఎక్కడో నక్కి ప్రాణం దక్కించుకున్నారు. వారు బయటకు వచ్చి చూస్తె కొత్త ప్రపంచం, మొత్తం మారిపోయి కనబడుతోంది. ఆకలేస్తోంది. వారు చెట్టులు, పుట్టలు వెతికి వారికేమైనా దొరికితే తింటూ బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది కొన్ని గుహలలోను, లేదా వారిదగ్గరున్న పుస్తకాలలోనూ వారు చూసిన ప్రపంచం గురించి రాసారు. అప్పుడు రాకెట్స్ ఉండేవని, ఎలా ఉండేవో నమూనాలు రాసుకున్నారు, దూరంగా వున్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడేవారని, టీ వీలు, ఇంటర్నెట్, వగైరా, వగైరా గురించి రాసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి, ఎలా చికిత్స చేసేవారో, ఆపరేషన్లు, ఇతర జీవన ఆరోగ్యం గురించి ఎన్నో రాసుకున్నారు. అవన్నీ ఒక చోట భద్రంగా దాచుకున్నారు. నేడు వారికి తిండి దొరకడమే ప్రధానం. అన్నీ పోవడంతో వారు కేవలం కొన్ని ఆకులు కప్పుకుని బతుకుతున్నారు. వారికున్న జ్ఞానంతో కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వారి సంతానానికి విషయం చెప్పారు. కానీ తిండి కోసం వారు మరిన్ని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

ఇలా ఒక పది తరాలు గడచి పోయాయి. అప్పుడు వారిలో ఒకడు వీరు ముందున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని పాడుబడ్డ ఆవాసాలు కనబడ్డాయి, శిధిలమై. వాటిలో వాడికొక పుస్తకం దొరికింది. దానిలో ఎలా జీవించాలో రాసుంది, అంతకు ముందు ఎలా జీవిన్చారో రాసుంది. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ తెగలో కొంతమందికి చెప్పాడు. భగవంతుడిని ఎలా ఆరాదిన్చేవారో తెలుస్కుని, వారు కూడా ఆ పద్ధతి పాటించారు. ఇదే భూగోళానికి అటువైపు కూడా కొంత మంది బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళు ఎప్పుడో వీళ్ళను కలుసుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న పుస్తకాలలో విషయాల గురించి విన్నారు. అప్పట్లో గాల్లో వేల్లెవారట, ఇది నమూనా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తిండే దొరకని మనకు ఈ కట్టు కధలు అవసరమా అంటూ గేలి చేసారు. ఈ తెగ వాళ్ళనందరినీ పిట్టకధల దొరలూ అని ముద్ర వేసారు. వారి జీవన విధానాన్ని వెక్కిరించారు. వారి గ్రంధాలను తిట్టారు. అప్పుడు విమానాలుంటే ఇప్పుడెక్కడికి పోయాయి. ఏది నువ్వొకటి తయారు చెయ్యి అన్నారు. కానీ అప్పుడు కరెంటు లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, ఏమి లేదు. వారికి ఆ జ్ఞానం లేదు. వీళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలలో విషయాన్ని ప్రాక్టికల్ గా చూపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళవన్నీ కాకమ్మ కబుర్లు అని, వీళ్ళు వట్టి వెధవలోయ్ అని ముద్ర వేసారు. అవును నిజమే అని ఈ తెగలో కొంతమంది మిగతా వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తిక నాస్తిక మతాలు పుట్టాయి. ఆ పుస్తకాలు నమ్మిన వాళ్ళు వెర్రి వెంగలప్పలు నమ్మనివాళ్ళు ఆధునీకులు అని పేర్లు పెట్టుకున్నారు.

పైదంతా చదివితే మీకేమైనా గుర్తుకొస్తోందా? ఈ రోజున జరుగుతున్న విషయం స్ఫురిస్తోందా? మన వాంగ్మయంలో చెప్పారు ఒకప్పుడు పుష్పక విమానంలో విహరించారట అంటే అదొక కట్టు కధ. ఒకప్పుడు రాజ్యాలలో ఈ విధంగా రాజ్యం చేసారట అంటే మరొక పిట్ట కధ. అస్త్ర, శాస్త్రాలతో యుద్ధం చెయ్యగలిగేవారట. సమయం ఇలా గణించారు, శస్త్రచికిత్సలు చేసారు, కుంభ సంభవులు పుట్టారు అంటే ఇవన్నీ mythology అని కొట్టి పారేస్తున్నారు. మంత్రప్రభావం, ప్రాభవం ఇదంటే దాని మీద నమ్మకం లేక చింతకాయలు రాల్చమంటున్నారు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతే ఒక మనువు బ్రతికాడని, తరువాత ఎందరో మహర్షులు వచ్చి మనకొక జీవన విధానం నేర్పారు అని మన పురాణం చెబుతోంది.. నిత్యసత్యాలన్నీ మన వాంగ్మయంలో, గ్రంథాలలో ఉన్నాయంటే నమ్మి పాటించిన వారు ఒక 8000 ఏళ్ళ క్రితం ఎలా వుండేవారో నేడు కొన్ని తవ్వకాలలో బయట పడ్డాయి. అదే మనకు అవతలి వైపు వాళ్ళు అప్పటికి అడవి పందులు వేటాడుకుంటూ వుండేవారు కనీసం 1000 సంవత్సరాల క్రితం వరకు. కాలక్రమేణా వారు కొన్ని కనిపెట్టారు, మనం అందరం వాడుకుంటున్నాం. అది నిజం, ఇదీ నిజం. కానీ పురాతన గ్రంథాలలో ఎలా ఉండేదో అప్పటి మన మనుష్యుల జీవనం, న్యాయం, ధర్మం జీవన విధానం, శాస్త్ర దృక్పధం ఆరోగ్య పరిరక్షణ విధానం అన్నీ రాసి వుంది. దేవుడిని ఎలా చేరాలని రాసి వుంది. దాన్ని నమ్మి పట్టుకున్న మనం తప్పక సాధించగలం. కావలసినదల్లా దాని మీద నమ్మకం. వారు చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోగల సామర్ధ్యం కావాలి. వాటి గురించి మనం మరింత లోతుగా పరిశీలించాలి. శోధించాలి, సాధించాలి. అంతేకానీ మనకు మనం తక్కువ అంచనా వేసుకుని మనం ఆత్మన్యూనతా భావం పనికిరాదు. మన మీద, మన గ్రంథాలపై, మన పురాణాల మీద మనకు నమ్మకం, గౌరవం వుండాలి. కాదంటారా?
మీకోసం ఈ లంకె.
http://timesofindia.indiatimes.com/…/articlesh…/52485332.cms

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Sunday, May 22, 2016

మోస్ట్ పవర్ ఫుల్ స్టొరీ!

మోస్ట్ పవర్ ఫుల్ స్టొరీ!
(ఇదొక ఈజిప్ట్ కథ .. ఈ కథ రాసిన రచయితను దేశం నుండి బహిష్కరించారట.)
ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది.
ఆడుతూ పాడుతూ పని చేసిది. అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది.
సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు.
ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు.
చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది, దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది. వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గా నియమించుకుంది. సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వలన ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబంధించిని రిపోర్ట్ లు వగైరా అడిగారు. ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది. అది చేసే పనికి తోడు పై అదికారులతో మీటింగ్ లు, ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి.
ఈ లోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజర్, వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి. క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఉత్పత్తి పడిపోయింది. సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్థితిిగతులని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి.
.

Saturday, April 30, 2016

నీ విలువ ఎంత --?

🌹నీ విలువ ఎంత --?🌹
=================

ఒక వ్యక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఎంత” అని.
అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.
ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు.
తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.

ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు.

ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.
అది వారి స్థాయి.
కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.

Friday, April 29, 2016

అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........

అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........
ఓ కొడుకు.........కోడలు....వారి పుత్రుడు.......
..వారితో పాటు
నాన్నమ్మ
ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచం
ఉండేది.ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి
ఒప్పుకోలేదు..........రోజూ ఏదో వంకతో భర్తను సాధించసాగింది.
ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే..........ఇలా అన్నది......
" మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి.....సమయానికి
ఆమెకు
వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమెకూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి
ఆలోచించండి "
ఏదో చికాకులో ఉండి " సరేలే చూద్దాం " అన్నాడు భర్త......ఇదే
అదనుగా
అత్తగారికి ఇంటికి పక్కనే
ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు......
ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక.........తనవల్ల
ఇద్దరి
మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది..
కానీ కొడుకు కు
తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది .
అదేంటంటే.........అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫినుకు

పళ్ళెం తీసుకుని అత్తగారు
రావాలి....
పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది....
...అడుక్కుతినే
దానిలా
అలా వెళ్ళడం బాధగా
అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ
అత్తగారు.
ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది..........నాన్నమ్మ
అలా దూరంగా
ఉండటం ఆ
పసిమనసుకు నచ్చలేదు. అలా తిండికోసం నాన్నమ్మ రావడం
అస్సలే
నచ్చలేదు....
వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి
ఆడుకునేవాడు.......
అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి....మనవడికి మంచి
ఉద్యోగం
వచ్చింది....మొదటి జీతం
రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు.......
.తల్లి
ఆనందంతో ..........
" నామీద ఎంత ప్రేమరా! నీకు నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే
రా నా
కొడుకంటే" అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది.......
" ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా
కన్నా! "
అని అడిగింది.
దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు....
" అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వుకూడా వేరేగా ఉండాల్సి
వస్తుంది కదా! అప్పుడు
నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి
ఒప్పుకోకపోవచ్చు
....అందుకే ఇప్పుడే
వెండి పళ్ళెం కొనేశాను..........రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం
తినడం నేను
చూడలేనమ్మా!"
కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు
ఉండాలి
కదమ్మా!"
కాబట్టీ............మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా
మళ్ళీ
మనకే తిరిగి వస్తుంది....
తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ........మీ
పిల్లలకు
కూడా నేర్పకండి...
.