.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అప్పటికే ఆమె చనిపోయింది.
.
.
.
.
.
.
.
.
మత్కుణం_కథ
----------------
ఒకసారి కృష్ణదేవరాయలవారి ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనతో పాటు ఒక బండి నిండా పత్రాలు ఉన్నై. "సంస్కృతంలో నన్ను మించినవాడు లేడు. అనేక దేశాల సంస్కృత పండితులు నాతో ఓడి, నాకు ఈ విజయపత్రాలను అందించారు. మీ రాజ్యపు పండితులతో శాస్త్ర చర్చ చేద్దామని వచ్చాను. మీ రాజ్యంలో ఎవరైనా పండితుడన్నవాడు ఉంటే నాతో తలపడమనండి. లేదూ, వారెవ్వరూ నాతో శాస్త్ర చర్చకు ముందుకు రాలేమంటే, మరి విజయపత్రాలను ఇప్పించండి" అన్నాడు గొప్పగా.
రాయలవారు సభలోని కవుల కేసి చూసారు. వాళ్లంతా కొంచెం ఇరుకున పడ్డారు. ఏమంటే "ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితులు అందరూ ఆ సమయానికి వేరే దేశానికి వెళ్ళి ఉన్నారు- రాజ్యంలో ఉన్నదల్లా తెలుగు కవులు మాత్రమే. ఈ సంస్కృత కవి తీరు చూస్తే మామూలు వాడిలాగా లేడు. ఊరికే చర్చించేదెందుకు, ఓడేదెందుకు, రాజ్యాన్నంతా ఓటమి పాలు చేసిన అపకీర్తిని మూటగట్టుకునేదెందుకు?"
రాయలవారు వారి సంశయాన్ని గుర్తించారు. సభలో కూర్చున్న తెనాలి రామకృష్ణుడికేసి చూసారు. రామకృష్ణుడు ఇకిలించాడు. రాయలవారు తల పంకించారు. "అయ్యా! పండితులవారూ! మా సంస్కృత కవులందరూ విదేశ యాత్రలో ఉన్నారు. వారి శిష్యులైన పామరులు మాత్రం కొందరు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. తమరి రాకను వారికి తెలియజేస్తాం. రేపు మధ్యాహ్నంగా శాస్త్రచర్చ ఏర్పాటు చేసుకుందాం. అంతవరకూ తమరు మా ఆతిథ్యం స్వీకరించండి" అని పండితులవారికి తుంగభద్రా నదీ తీరాన వున్న ఒక భవంతిలో విడిది ఏర్పాటు చేసారు.
పండితులవారు అటు పోగానే ఇటు రాయలవారు "రామకృష్ణా!" అన్నారు.
"ప్రభువులవారు ఈ పని నాకు వదిలెయ్యండి!" అన్నాడు రామకృష్ణుడు నవ్వుతూ.మరునాడు తెల్లవారే సరికి రామకృష్ణుడు చాకలివాడి వేషం వేసుకున్నాడు. తన భార్యకు చాకలమ్మ వేషం వేసాడు. ఏం చెయ్యాలో అంతా ఆమెకు చెప్పి వుంచాడు. ఓ బట్టల మూటనెత్తుకొని తను తుంగభద్రా నదీ తీరం చేరుకున్నాడు. నదిలో బట్టలు ఉతుకుతున్నట్లు నటించటం మొదలు పెట్టాడు.
అనుకున్నట్లే ఆ రేవు దగ్గరికి వచ్చాడు సంస్కృత పండితుడు. నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. చాకలి ఆయన తీరును చూస్తూ తన జోరు పెంచాడు.
అంతలోకే చాకలమ్మ వచ్చింది మరో చిన్న బట్టల మూట పట్టుకొని. రామకృష్ణుడిని అడిగింది గట్టిగా, దగ్గర్లోనే ఉన్న పండితుడికి వినబడేట్లు- "యివ్వాళ అన్నం లోకి సాధకం ఏమి చెయ్య మంటావు మామా ?" అని.
చాకలివాడు కొంచెం ఆలోచించాడు:
"మత్కుణం నది సంయుక్తం, విచార ఫల మేవచ, గోపత్నీ సమాయుక్తం,
గ్రామచూర్ణం చ వ్యంజనం" అని జవాబి-చ్చాడు.
ఆమె కనబడీ కనబడనట్లు నవ్వింది. "సరే అలాగే- 'తథైవ అస్తు' " అని చెప్పి, ఉతికిన బట్టలు పట్టుకొని వెళ్ళిపోయింది.
నదిలో సంధ్యావందనం చేసుకుంటున్న పండితుడికి తల తిరిగినట్లైంది. "ఈ దేశంలో ఒక సాధారణ చాకలి, చాకలమ్మ సంస్కృతంలో మాట్లాడుకున్నారు! ఇంతగొప్ప సంస్కృత పండితుడైన తనకు ఆ శ్లోకం అర్థం కాలేదు!"
"ఇంతకీ 'మత్కుణం' అంటే ఏంటి? 'మత్కుణం' అంటే సంస్కృతంలో 'నల్లి' అని అర్థం.
'నది సంయుక్తం' అంటే 'నదితో కలిసినది'- నల్లి నదితో కలవటమేమిటి? తెలీదు!
"విచార ఫలం" అన్నాడు- విచారిస్తే ఫలితం ఏముంటుంది? కన్నీళ్ళు వస్తాయి.. అయితేనేమి?
ఇక "గో పత్ని- ఆవు భార్య" అంటున్నాడు. ఆవే ఆడది కదా, ఇక ఆవుకు భార్య ఎక్కడినుండి వస్తుంది?
అంతా చేసి "గ్రామ చూర్ణం" కావా-లంటున్నాడు! అదేంటి?
"పోనీ 'దీనికంతా అర్థం లేదు' అనుకుందామంటే అట్లానూ లేదే, చాకలమ్మ "సరే సరే" అని పోయింది. అంటే ఆమెకు అర్థమైనట్లే కదా!" ఆలోచించీ ఆలోచించీ అతనికి మతి పోయింది-
"ఈ రాజ్యపు చాకలివాడి శ్లోకమే తనకు అర్థం కాలేదు- చాకలమ్మకు అర్థమయినంత నాకు అర్థం కాలేదు. యింక రాజుగారి దగ్గర పనిచేసే పండితులతో నేనెక్కడ గెలువగలను?" అనుకున్నాడాయన. రామకృష్ణుడు చూస్తుండగానే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బయలుదేరి భవనానికి వెళ్లి, మూటా ముల్లె సర్దుకొని, నగరం విడిచి పారిపోయాడు.
మరునాడు సభలో రాయలవారు అడిగారు- "ఏడీ! పండితుడు?!" అని."విడిది పరిసరాల్లో ఎక్కడా లేడు" చెప్పారు భటులు. "వేరే నగరానికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే వెళ్ళాడాయన!" వింటున్న రామకృష్ణుడు నవ్వాడు. రాయలవారు "నువ్వే ఏదో చేసినట్లున్నావు
?!" అన్నారు మర్మగర్భంగా
"లేదు- నేను కాదు, ఇదంతా చేసింది మత్కుణం" అని కథంతా చెప్పాడు రామకృష్ణుడు.
రాయలవారు నవ్వి, ఇంతకీ ఈ శ్లోకం మాక్కూడా అర్థం కాలేదు- ఏంటి, దీని కథ?" అన్నారు.
అప్పుడు రామకృష్ణుడు ఇలా అర్థం చెప్పాడు:
"మత్కుణం అంటే నల్లి; నది అంటే ఏరు. నల్లి, ఏరు కలిసి 'నల్లేరు' అయ్యింది.
విచారం అంటే చింత; ఫలం అంటే పండు- కలిసి చింతపండు అయ్యింది.
గోవు అంటే ఆవు; పత్ని అంటే భార్య- ఆలు. ఆవు,ఆలు కలిస్తే అయ్యేవి ఆవాలు-"
రాయలవారు కడుపుబ్బా నవ్వారు. మరి ఇంతకీ గ్రామచూర్ణం ఎలా చేస్తారు? అన్నారు.
ఏమీ లేదు- గ్రామం అంటే ఊరు; చూర్ణం అంటే పిండి- వెరసి 'ఊరుబిండి' అవుతుంది ప్రభూ. మన సీమలో అందరికీ ఇష్టమైన పచ్చడి కదా అది?" అన్నాడు రామకృష్ణుడు కొంటెగా.
"నల్లేరు, ఆవాలు, చింతపండు కలిపి చేసే వూరుపిండి సంస్కృత పండితుడినే భయపెట్టిందే, అంతగొప్ప పండితుడు పలాయనం చిత్తగించేట్లు చేసింది ఇది మామూలుది కాదు" నవ్వారు రాయలవారు.....
.
బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి...?
పెద్దలు అందరు చెప్తూఉంటారు—బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు.
అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.
ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యం ఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.
మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతా చెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.
మరి గృహిణులు ఎందుకు లేవాలి?
ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.
బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపు నుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartment culture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.
మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు. వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.
అఘోరాలు.....!!
హిమాలయ పర్వతశ్రేణులు.. మంచు కొండల మధ్యన ఆశ్రమాలు.. అఖారాలు... ఆశ్రమాల్లో సాధు సంతులు.. నిస్సంగులు.. గడ్డ కట్టే చలిలో ఆవాసాలు.. దొరికితేనే తిండి.. దొరక్కపోతే గాలే భోజనం.. బట్టలూ అంతంత మాత్రమే.. దిగంబరులకైతే ఆ వసా్తల్ర బాధా లేదు.. మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా? మినిమమ్ హండ్రెడ్ ఇయర్‌స.. ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళు్ల .. 250 ఏళ్ల పాటు జీవించిన వాళూ్ల ఉన్నారంటే నము్మతారా? నమ్మాల్సిందే మరి..
1.
150 ఏళు్ల.. వినిడానికి వింతగానే ఉంది కదా? ఇన్నేళు్ల జీవించటం మానవ మాత్రుడికి సాధ్యమేనా? యెస్.. సాధ్యమే.. హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధపురుషులు చాలా మంది వందేళ్లకు పైగా వయసున్న వాళ్లే.. వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారున్నారు.... ప్రతికూల వాతావరణంలో, నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు.. మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం..పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకే ఎందుకు బాల్చీ తన్నేస్తున్నాడు..? వాట్ ఈజ్ ది మిస్టరీ...
2.
ఒకరి వయసు 120 ఏళు్ల
మరొకరు 150 ఏళు్ల
ఇంకొకరికి ఏకంగా 250 ఏళు్ల
కలా? నిజమా?
ఇంతకాలం జీవించిందెవరు?
పురాణాల్లో దేవతలు కారు..
మన కళ్ల ముందున్న సాధువులు
హిమాలయాల్లో ని సంతులు
మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు
ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు.
దేవ్హ్‌బ్రాబా... ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి హిమాలయాలకు వచ్చారు... అక్కడే ఉంటున్నారు.. ఈయన ఫోటోను ఇంటర్నెట్‌లో చూడవచ్చు కూడా.. ఈయన వయస్సు మాత్రం 250 సంవత్సరాలు..ఈయన పుట్టింది 1772 మార్చిలో.. చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.. ఈశ్వరుడి ఉపాసనలో జీవితం గడపుతున్నారు.. హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్నా చాలా కాలం పాటు ఎవరికీ దర్శనమిచ్చేవారు కారు.. ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలూ తీరుతాయని ప్రజల విశ్వాసం..
ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ మీడియాకూ మిస్టరీగా మారింది.. దీనిపై తెగ రీసర్‌చ చేసింది.. పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాల్ని శిరసుపై ఉంచుకుని వెళ్లిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు...
3.
కోరుకున్నప్పుడు మరణించటం సాధ్యమేనా?
మామూలు మనుషులకు సాధ్యం కానిది
సాధు సంతులకు ఎలా సాధ్యపడింది?
వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు?
సైన్‌సకు సైతం అంతుపట్టని మృత్యురహస్యం
చావును జయించిన సాధువులు
వాళు్ల ఉండే మంచుకొండల నడుమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు.. అక్కడికి వెళ్లాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు.. ఒళ్లంతా ఉన్నితో కప్పుకుని కానీ కదలలేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు.. అంతే కాదు.. వారి జీవన విధానం కూడా పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది.. అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళు్ల వందల సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు, మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు?
4
మనం ఎన్నేళు్ల బతుకుతాం? మహా అయితే 50 ఏళు్ల.. కాకుంటే అరవై ఏళు్ల.. అంతకన్నా ఆశ లేదు లెండి... ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం.. ఇంకేం బతుకుతాం చాల్లెద్దూ.. ఇవాళ ప్రతి ఒక్కరి నోటా సహజంగా వినిపించే మాటే ఇది.. ఎక్కువకాలం బతకటం.. ఒకరిపై ఆధారపడటం దేనికి? హాయిగా యాభై ఏళు్ల బతికితే చాలనే వాళ్ల సంఖ్యే ఎక్కువ.. మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్షు మాత్రం ఎక్కువగా కోరుకుంటున్నారు.. కోరుకుంటున్నట్లే ఉండగలుగుతున్నారు..
ఎందుకు? ఎలా?
హిమాలయాలు.. ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం.. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం.. కైలాస్, మానస సరోవర్, గంగ, యమున, సరస్వతి, కేదార్‌నాథ్, హరిద్వార్, రుషికేష్, బద్రీనాథ్.. ఒకటా రెండా.. వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు..వెండి కొండల్లో వేలుపుల వెలుగులు..ముక్కోటి దేవతల అలవాలం..సాధుసంతుల పాలిటి కల్పతరువులు.
హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే.. సిద్ధపురుషులే.. ఈశ్వరోపాసనలో తలమునకలై కనిపిస్తారు. భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు.. విభూతి ఇస్తారు.
లోకాన్ని పట్టించుకోరు
తమనూ పట్టించుకోరు
శరీరంపై మమకారం లేదు
కోరికలు లేని జీవన విధానం
ఉపాసనలోనే జీవితం
అందులోనే ఆనందం అనుభవిస్తారు.
సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు.. మంచి చెడులు చెప్తారు. ఆశీర్వదిస్తారు.. కానీ, ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధుపురుషులు ఉన్నారు.. వీళ్లకు లోకం పట్టదు.. లోకానికి వీళు్ల పట్టరు.. వీళు్ల ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు.. వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు.. హిమాలయ సానువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే.. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు.
హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు.. మంచు కరిగిన స్వచ్చమైన నీటిని తాగుతారు.. ఒంటి నిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు.. దేనిపైనా మోజు ఉండదు.. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు.. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు...పవిత్రస్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు..
5.
మిగతా మనుషులకూ, హిమాలయాల్లో ఉండే సాధువులకు మధ్య తేడా ఏమిటి? వాళు్ల సుదీర్ఘ కాలం ఎలా జీవించగలుగుతున్నారు.. కేవలం ఈశ్వరుని ఉపాసించటమే వారి ఆరోగ్య రహస్యమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? ప్రతికూల వాతావరణం, శరీరం గడ్డకట్టే చలి, అన్నింటినీ తట్టుకునే శక్తి ఎక్కడిది? అతీంద్రియ శక్తులు ఉన్నాయా? సిద్ధులు లభించాయా?
సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి?
ఇది నిజంగా అంతుపట్టని విషయం.. సైన్‌స పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం.. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి.. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళు్ల.. తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థా్యన్ని సాధించిన వాళు్ల. అందుకే ఎన్నేళ్లయినా వారి శరీరం క్షీణించదు.. రోగాలు దగ్గరకు రావు.
హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్షుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టి కర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది.. నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నము్మతారు.. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే వారు భావిస్తారు..తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు.
తమ ఆయుష్షుపై నమ్మకం ఉండటం రెండో కారణం. తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని వారు గట్టిగా నము్మతారు.. కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు.. ఇది వాస్తవం.. మన మైండ్‌ను పూర్తిగా మన అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చన్న అంశం మిలియన్ల కొద్దీ సందర్భాల్లో రుజువైన సంగతే. విల్‌పవర్ అన్నది అందరికీ తెలిసిన సంగతే.. ఆ విల్ పవరే.. మనల్ని మన లక్ష్యానికి చేరువ చేస్తుంది. సాధుపురుషులు సాధించింది ఇదే.
తమ జీవితంపై తమకు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండటం మూడో విషయం.. మనలో చాలామందికి కరవైంది ఇదే. ఈ పాజిటివ్‌నెస్సే తగ్గిపోయింది. యూత్ సైతం లైఫ్‌లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడటం మామూలే.. కానీ, హిమాలయాల్లో సాధువులు అలా కాదు.. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నము్మతారు.. జీవితాన్ని ముగించేయాలనుకోవటమో.. ముగించటమో లాంటి హక్కు తమకు లేదని నము్మతారు.. తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్నిస్తుందనేది హిమాలయ సాధువులను చూసి తెలుసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైంది సాధువుల్లో అంతర్గతంగా కనిపించే శక్తి.. ఆహారం, వ్యాయామాలకంటే మించిన అంతర్గత శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది. శరీరంలో ఇంటర్నల్‌గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి స్థాయిలో ఆక్టివ్‌గా ఉంచటం. హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు.. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోతారు.. ఇది శరీరాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకువస్తుంది.
6.
ఒక ప్రత్యేక జీవన శైలి... మామూలు ప్రపంచానికి అర్థం కానిది.. మనకు.. అంటే సాధారణ ప్రజలు అవలంబించలేని జీవన విధానం... అందుకే వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు. కోరుకున్నేళు్ల జీవిస్తున్నారు.. కేవలం హిమాలయాల్లోనే కాదు.. ప్రపంచంలో అక్కడక్కడా, అడపా దడపా నూరేళ్ల పైచిలుకు జీవించిన వారి వివరాలు తెలుసుకున్నా ఇంచుమించు వాళ్ల లైఫ్‌లోనూ ఇలాంటి ఆసక్తికర కథనాలే కనిపిస్తాయి..
హిమాలయాల్లో సిద్ధపురుషులు నియమిత జీవితం అసాధారణమైంది. మామూలు ప్రజలు కనీసం ఊహల్లోనైనా ఆలోచించలేనిది. వాళు్ల చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు.. కొందరు దిగంబరంగా ఉంటారు.. కొందరు స్మశానంలో తిరుగుతారు.. ఆహారం విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు.. దొరక్కపోతే మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు. పచ్చి మాంసమూ తింటారు.
సాధువులంతా శాకాహారులే అనుకుంటే పొరపాటే.. నాగా సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు.. హుక్కా పీలుస్తారు.. ఒళ్లంతా విభూతి రాసుకుని ఉంటారు.. వీళ్లకు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. అలాగని ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్లుగా తినరు.. పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు.. నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికే ప్రిఫరెన్‌స ఇస్తారు..
అన్నింటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది. భారతీయ యోగ
శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు సాధు సంతుల నిత్యకృత్యాలు.. యోగా ద్వారా మనిషి శరీరంలోని కుండలినీ శక్తిని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది.. ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు.. వారు చేసే యోగాను చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక తప్పదు.
ఉపాసన, సాధనల ద్వారా హిమాలయాల్లో సాధువులు ఇచ్ఛామరణాన్ని సాధించారు. దేవ్హ్ బాబా ఇందుకు ఒక్క ఉదాహరణే... ఈయన్ను దర్శించుకోవటానికి ఆనాడు ఇందిరాగాంధే స్వయంగా వచ్చారు... ఈ సాధువులే కాదు.. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడక్కడా మనకు వందేళ్లకు పైగా జీవించిన వాళు్ల మనకు తారసపడతారు. బంగ్లాదేశ్‌లో 150 ఏళ్లు జీవించిన వ్యక్తి, చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన మనుషులను చూడవచ్చు.
నియమిత పద్ధతిలో ప్రకృతి సహజసిద్ధమైన జీవిత విధానాన్ని అనుసరించే వాళు్ల కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు. సో బి పాజిటివ్ ఆబౌట్ యువర్ లైఫ్.. అండ్ బి ఏ పాజిటివ్ ఆటిట్యూడ్.. ట్రైటు లాంగ్‌లైఫ్ యువర్ సెల్‌ఫ... మీ విల్ పవరే మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న వాస్తవాన్ని గ్రహించండి.
శ్రీ మాత్రే నమః।।!!!