Pages

Thursday, December 15, 2016

The Story of the Praying Hands



Video Link :
The Story of the Praying Hands
http://ift.tt/2hnYkAy
Via #

.
ఇంటికి  వెడుతున్నా  నడుచుకుంటూ
.
దారిలో  ఒక  కరంటు స్థంభానికి  ఒక  కాగితం  కట్టి  ఉంది . 
.
"దయచేసి  చదవండి "    అని  రాసి  ఉంది . ఖాళీ  గానే  ఉన్నాను  కదా  అని  దగ్గరకు  వెళ్లి  చూశాను .
.
.
" ఈ  రోడ్డులో  నేను  నిన్న  ఒక  50 రూపాయల  నోటు  పారేసుకున్నాను . నాకు  కళ్ళు సరిగా  కనబడవు .  మీకు  దొరికితే  దయచేసి  ఈ  ఎడ్రెస్  దగ్గరకు  తెఛ్చి  ఇవ్వగలరు,  దయచేసి   ఈ  సహాయం  చెయ్యండి  "  అని  రాసి  ఉంది  .
.
.
నాకు  ఎందుకో  ఆ  ఎడ్రెస్  ఉన్న  చోటుకు   వెళ్ళాలి  అనిపించింది
.
అడ్రెస్   గుర్తుపెట్టుకున్నాను .
.
అది   ఆ  వీధి  చివరన  ఉన్న  ఒక  పూరి  పాక   .  దగ్గరకు  వెళ్లి పిలిస్తే పాక  లో నుండి  ఒక వృధ్ధురాలు  వచ్చింది .   ఆమె  కు  కళ్ళు  సరిగా  కనబడటం  లేదు .ఆ  పాకలో  ఆమె  ఒక్కర్తే  ఉంటోంది అని  అర్ధం  అయ్యింది .  చేతి  కర్ర  సహాయం  తో  తడుము  కుంటూ   బయటకు  వచ్చింది  
.
.
"ఏమీ  లేదమ్మా !   నువ్వు  పోగొట్టుకున్న  50 రూపాయల  నోటు  నాకు  కనబడింది  .  అది  ఇఛ్చి  పోదామని  వచ్చాను "  అన్నాను
.
.
  .
ఆమె  ఏడుస్తోంది . 
.
"బాబూ !  ఇప్పటికి   ఇలా  దాదాపు   50-60   మంది   వఛ్చి  ఒక్కొక్కరూ  ఒక  50  రూపాయలు   ఇస్తున్నారు .   నాకు  కళ్ళు  కనబడవు .   నాకు  చదవడం   రాయడం  రాదు .నేను  అది  రాయలేదు  బాబూ !  ఎవరో  నాకు  సహాయం  చెయ్యాలి  అనిపించి  అలా   రాశారేమో !" 
.
.
" పోన్లే  అమ్మా  ఇదిగో  ఈ  యాభై   నోటు  తీసుకో  ! "
.
.
బాబూ  !  అది  నేను  రాయలేదు . నా   ఇబ్బంది  చూసి  ఎవరో   మహానుభావుడు   ఇలా  రాసిపెట్టి  ఉంటాడు .   వెళ్ళేటపుడు   అది  కాస్త   చించెయ్యి  బాబూ !   అంది
.
.
ఆమె  ఇలాగే  అందరికీ  చెప్పి  ఉంటుంది .  ఒక్కరూ  చించెయ్యలేదు .  ఆమె  రాయలేదు .  ఎవరో  ఆమెకు  సహాయపడటం  కోసం  ఇలా  రాశారు .
.
.
ఆ  రోడ్డున  వెడుతున్న   ఎందరిలోనో  కొందరు అది  చూస్తారు  .  అలా  చూసిన  ఎందరిలోనో  కొందరు  ఆమెకు     సహాయ  పడాలని  అనుకుంటారు .   అలా  అనుకున్న   ఎందరిలోనో   కొందరు   ఆమె  ఇంటికి  వఛ్చి   ఆమెకు  సహాయ  పడతారు .  నేను  అది  చించేస్తే  ఆమెకు   అలాంటి  సహాయం  దూరం  చేసిన  వాడిని అవుతాను ............  ఇలా  సాగుతున్నాయి   నా  ఆలోచనలు ..... అది  చింపెయ్యనా  ?   ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే  ఇంతకు  ముందు  వాళ్లకు  కూడా  చెప్పి  ఉంటుంది  కదా !  వాళ్ళెవరూ  చింపెయ్యలేదు .  అంటే  అందరూ  ఆమెకు   ఈ  రకంగా  సహాయం  అందాలి  అని  కోరుకుంటున్నారు ........ మరి  నేను  ఎందుకు  అది  చింపెయ్యడం ....... ఇలా  అనుకుంటూ   వస్తున్నాను .
.
.
ఒకాయన   చేతిలో  చిన్న  కాగితం  పట్టుకుని   ఎదురుపడ్డాడు
.
.
.
సర్ !  ఈ ఎడ్రెస్   చెప్పగలరా ?  నాకు  ఒక  50  నోటు దొరికింది  .  వాళ్లకి  ఇచ్ఛేద్దామని ఎడ్రెస్  అడుగుతున్నాను .
.
.
.
ఆమె  ఎడ్రెస్
.
.
.
నాకు  అనిపించింది  "మానవత్వం  చచ్చిపోలేదు"  .
.
అది  రాసిన  వారికి  మనసులోనే  కృతజ్ఞతలు  చెప్పుకున్నాను .  ఎవరికయినా    సహాయం  చెయ్యాలి  అంటే  ఎన్నో  మార్గాలు  .  ఈ  మార్గం  ఎంచుకున్న  వ్యక్తిని  మనసులోనే  అభినందించాను . .  ఒంటరిగా  నివసిస్తున్న  ఆమెకు   ఇది ఒక  ఊరట  కలిగిస్తుంది  అనడం  లో  నాకు  సందేహం  లేదు .
.
.
అది  చింపడం   భావ్యం   కాదు .అనిపించింది .
.
.
.
నేను  అది  చింపేయాలా ?   అలా  వదిలేయాలా ?
.
.
వదిలేశాను
.
.
.
.

.
వదిలేసి   నేను  మంచి పని  చేశానా  ?   లేదా   ?  
.
.
మీరే  చెప్పండి ...... ఇది  కధ  అయి   ఉండొచ్చు ... కానీ    ఈ   పరిస్థితి  ఎదురయితే  .....

ప్రతి ఒక్కరు త‌ప్పక చ‌ద‌వండి...!!

*ప్రతి ఒక్కరు త‌ప్పక చ‌ద‌వండి...!!
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.
మనిషి ధర్మం తప్పకూడదనీ, తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ, అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి...................

Sometimes just sometimes, when people say, “Forever”, they mean it. ♥♥



Video Link :
Sometimes just sometimes, when people say, “Forever”, they mean it. ♥♥
http://ift.tt/2hHgIpf
Via #

Sometimes just sometimes, when people say, “Forever”, they mean it ♥♥

Wednesday, December 14, 2016

☘☝🏻 *ధర్మో రక్షతి రక్షితః*☝🏻☘

☘☝🏻 *ధర్మో రక్షతి రక్షితః*☝🏻☘

          యజ్ఞం జరుగుతోంది.
యజమానికి👶🏻 యజ్ఞకుండంలో🔥 బంగారం🏵 ముద్ద దొరికింది.
ఆయన ఆశ్చర్యపోయాడు 🤔.
అప్పుడు భార్య🙅🏻 చెప్పింది. *"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో 🔥 తాంబూలాన్ని 🍃ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద🏵 అయింది."*

         ఇంటి యజమాని👶🏻 పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో 🔥తాంబూలాన్ని🍃 ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద 🏵దొరికింది.

          ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా👶🏻👶🏻👶🏻 యజ్ఞ కుండంలో 🔥ఊసేశారు🗣. బంగారు ముద్దలు 🏵🏵🏵పొందారు. ఒక్క *అర్క సోమయాజి*తప్ప.

*"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు"* అన్నాడాయన.

              ఊరు ఊరంతా🏘🏘🏘 ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
*ఆయన భార్యకు ఇది నచ్చలేదు.* "మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది*.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

        ఊరి పొలిమేర🌾 దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల🏵🏵🏵 పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు🏘 కాలిపోతున్నై. మనుషులు👥 చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు🏘 ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.

         అప్పుడే కలిపురుషుడు☝🏻 వారికి ఎదురు వచ్చాడు.
*"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి,  ధర్మ హీనులను ధ్వంసంచేశాను."* అన్నాడు కలిపురుషుడు.

... *ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*👏🏻👏🏻👏🏻

☘☝🏻 *ధర్మో రక్షతి రక్షితః*☝

దేవుని ప్రణాళిక

* “దేవుని ప్రణాళిక” కధ *

వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.

దేవుడితో మొరపెట్టుకున్నాడు.

రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.

నా బతుకు చూడు.
ఎంత కష్టమో.

ఒక్క రోజు… ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,”
అని సవాలు విసిరాడు.

దేవుడు దయతో సరేనన్నాడు.
అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు,
నోరు మెదపకూడదు
అన్నాడు దేవుడు.

సరే అన్నాడు మనోడు.

మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.

కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
“దేవా … నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు”
అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.
ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది.
అతను చూడకుండా వెళ్లిపోయాడు.

మనోడు “ఒరేయ్… పర్సు వదిలేశావు చూసుకోరా…” అందామనుకున్నాడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.

ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
“దేవా… నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ”
అంటూ మోకరిల్లాడు.

కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.
“ఇలా దయ చూపించావా తండ్రీ”
అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.

“ఒరేయ్ దొంగా…. “
అని అరుద్దామనుకున్నాడు మనోడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.

ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
“దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ”
అన్నాడు.

అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు.
“నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి” అన్నాడు.

పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.

“ఆగండ్రా… ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు.”
అని అరిచేశాడు.

దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.

సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.

దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.

“దేవా… ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా…

నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.
ఒక దోషిని అరెస్టు చేయించాను.”
అన్నాడు మనోడు.

దేవుడు “ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా… ఎందుకలా చేశావు.”
అన్నాడు నిష్ఠూరంగా.

“అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను.”
అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా….

“ధనవంతుడు మహాపాపాత్ముడు.
వాడు అందరినీ దోచుకుంటాడు.
వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను.

పేదోడికి కష్టాలు తీరేవి.
వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.

ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు.
దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు.
వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.

ఇప్పుడు చూడు… పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు.

ఎంత పని చేశావు నువ్వు…
అన్నాడు దేవుడు.

దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు.
తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు.
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం ?