Pages

Thursday, January 5, 2017

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యం.

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యం.

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదట...తింటే వచ్చే ప్రమాదం ఏమిటి

ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పరమపవిత్రమైన రోజు ఈ ఏకాదశి.  ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆరోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యంపై ఒక అవలోకనం... 

                ఒక్క ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే....

ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది.

          ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్నరోజు, రథసప్తమి రోజు, స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈరోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

ఏకాదశి ప్రాశస్త్యం

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించిన వివ రణ అనేక పురాణాలలో ఉంది.. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీమహా విష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసర మని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘‘ఏకాదశి’’ అని నామకరణం చేశారు. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు.

విశేష ఆరాధన

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.

జీవిత ఉపయెాగాలు

జీవిత ఉపయెాగాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.

2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.

4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.

5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.

6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).

7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.

8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.

9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.

10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.

11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.

12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.

13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.

14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు.

15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.

16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.

17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.

18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.

19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.

20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.

21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.

22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.

23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).

24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.

25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.

27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.

28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .

29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌

30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.

31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.

32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.

34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).

35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).

36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).

37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.

38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి...

Har Har Mahadev🚩🌿 Today is the day of lord shiva take a darshan of G

18 Simple Lessons From The Bhagavad Gita That Are All You Need To Know About Life!!

10 Unhealthy Things You Think Are Healthy

సీత-భూతం

సీత-భూతం
---------------
అనగా అనగా ఓ అడవి అంచున ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో చంద్రదీప్ అనే మేదరి ఒకడు ఉండేవాడు . అతని భార్య సీత చాలా తెలివైనదీ, మంచిదీనీ.

చంద్రదీప్ ప్రతిరోజూ ప్రొద్దునే బయలుదేరి అడవికి వెళ్ళేవాడు. ఆ రోజుకు అవసరమైనన్ని వెదుర్లు మటుకు కొట్టుకొని తెచ్చుకునేవాడు. అడవి బాగా దట్టంగా ఉండేది కదా, లోపల రకరకాల క్రూరమృగాలు నివసించేవి. అందుకని అందరూ అడవిలోపలికి పోయేందుకు జంకేవాళ్ళు. సాధారణంగా చంద్రదీప్‌కి కావలసిన వెదుర్లు అడవిలో ఎక్కువ లోపలికి పోకుండానే సులభంగా దొరికేవి. అందువల్ల పెద్ద సమస్యగా ఏమీ ఉండేది కాదు.

అయితే ఒక రోజున అతనికి సన్నగా ఉండే ప్రత్యేకమైన వెదురు కావలసి వచ్చింది. అది అడవిలోపల మాత్రమే దొరికే రకం. అందుకని వాటికోసం చంద్రదీప్ ఉదయాన్నే బయలుదేరి అడవిలోపలికల్లా పోయాడు. అయితే అతనికి ఆ వెదురు అంత సులభంగా దొరకలేదు.. మెల్లగా చీకటి కూడా‌ పడసాగింది.

చంద్రదీప్ ఇక వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకున్నాడుగానీ, అతని పాదాలు ఎందుకనో అతన్ని ముందుకే తీసుకెళ్ళాయి. అడవిలోని ఆ ప్రాంతంలో చెట్లు మరీ దట్టంగా పరచుకొని ఉన్నాయి. తనకు భయం వేసినప్పుడల్లా చంద్రదీప్‌ తనకు దొరకనున్న సన్నటి వెదురును గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకుంటున్నాడు.

చివరికి అతనికి తను వెతుకుతున్న వెదురుపొద ఒకటి కనబడింది. దాన్ని చూడగానే చంద్రదీప్‌కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను గబగబా వెళ్లి దాన్ని నరికేందుకు కత్తి ఎత్తాడు- అంతలోనే అతని వెనక ఏదో అలికిడి అయ్యింది. చంద్రదీప్ గబుక్కున వెనక్కి తిరిగాడు; కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అక్కడ నివసిస్తున్న భూతం ఒకటి అతన్ని పట్టుకొని, వంచి నేలమీద పడుకోబెట్టేసింది. మరుక్షణంలో అతను స్పృహ కోల్పోయాడు!

ఆ భూతం చాలా కాలంగా మనుషుల్ని పట్టుకోవటం కోసమే వేచి ఉన్నది. దానికి నరమాంసం అంటే చాలా ఇష్టం. అయితే, దాని తత్వం పిల్లి మాదిరిదే- చడీ చప్పుడు లేకుండా తన వేటని తినటం దానికి ఇష్టం లేదు. తినేముందు కొంచెం ఏడుపూ, హడావిడీ, రొదా, గందరగోళమూ లేకపోతే దానికి అసలు తిన్నట్టుండదు. అందుకని, ఏం చేద్దామా అని అది కొంచెంసేపు ఆలోచించింది. ఆ పైన వెంటనే తన రూపం మార్చుకొని, అచ్చం చంద్రదీప్‌లా తయారైంది!

ఒకసారి అట్లా రూపం మార్చుకోగానే దానికి చాలా ఉత్సాహం వచ్చింది. అది నిజం చంద్రదీప్‌ని అట్లాగే నేలమీద వదిలి, ఈ వేషంలో ఊళ్ళోకి బయలుదేరింది. అదృష్టం బాగుంటే ఈ వేషంలో తనకు సాయంత్రంకల్లా మరింతమంది మనుషులు దొరికే వీలుంది!

అది మెల్లగా నడచుకుంటూ చంద్రదీప్‌ వాళ్ల ఇల్లు చేరుకునే సరికి సాయంత్రం కావొస్తున్నది. అతని భార్య సీత వంటగదిలో అన్నం వండుతున్నది. అక్కడినుండి వెలువడుతున్న ఘుమఘుమలకు మామూలుగా ఎవరి నోరైనా ఊరాల్సిందే. భూతానికి కూడా నోరు ఊరింది. అయితే దాని నోరు ఊరేందుకు కారణం వేరు: చంద్రదీప్ భార్య సీత, పిల్లలు చాలా చక్కని వాసన వచ్చారు, దానికి! సాయంత్రం కొంచెం చీకటి పడ్తుండగా అది వీళ్లనందరినీ తినేయనున్నది!

అయితే చంద్రదీప్ భార్య సీత మటుకు అతని ప్రవర్తనలో తేడాని ఏమాత్రం‌ గుర్తించలేదు. "ఏది, వెదురు తేలేదా?" అని ఆమె అడిగితే అతను ఊరికే నవ్వాడు తప్పిస్తే ఇంకేమీ మాట్లాడలేదు. ఇంకా చీకటి పడకనే ఆమె అందరికీ అన్నం వడ్డించింది. భూతం కూడా అన్నం తినేసింది. ఆ తర్వాత దానికి కంటినిండా నిద్రవచ్చేసింది. పొయ్యికి దగ్గరలోనే వెచ్చగా పడుకొని, అది తన కాళ్ళకు నూనె రాయమని సీతను ఆజ్ఞాపించింది. అంతలోనే దానికి కునుకు పట్టేసింది.

సీత నూనె తీసుకొనివచ్చేసరికి చంద్రదీప్ రూపంలోని భూతం గురకపెట్టి నిద్రపోతున్నది. ఆమె అతని కాళ్ల దగ్గర కూర్చొని నూనె రాయబోతూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది: ఇవి తన భర్త కాళ్ళు కాదు! బయటినుండి చూసేందుకు భూతం అచ్చం చంద్రదీప్ లాగా తయారైంది; కానీ దుస్తుల లోపల మటుకు దాని శరీరంలో ఏ మార్పూ లేదు!

దాంతో ఒక్కసారిగా సీతకు వణుకు వచ్చినట్లయింది. ఇది తన భర్త కాదు- భర్త వేషంలో‌వచ్చిన ఏదో భూతం! అయినా ఆమె క్షణంలో తెప్పరిల్లి, ఏం చేయాలో ఆలోచించింది. ముందుగా పిల్లల్ని లేపి, "చప్పుడు చేయకండి, రండి!" అని సైగలు చేసి, వాళ్లను దూరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అటుపైన వెనక్కి తిరిగి వచ్చి, అంతకు ముందు వాళ్ళు పడుకున్న చోట దిండు ముక్కలు పెట్టి, వాటికి దుప్పటి కప్పేసింది. ఆ తర్వాత వంట ఇంట్లోంచి రెండు దోసిళ్ల బఠానీలు తెచ్చి, వాటిని ఇల్లంతా చల్లింది. తర్వాత కణకణా మండుతున్న బొగ్గులు తీసుకొచ్చి వంటగది వాకిలికి ప్రక్కగా పోసి, అవి కనబడకుండా వాటి మీద ఓ ఇనప పెనం పెట్టింది. ఈ పనులన్నీ చెయ్యగానే పిల్లలతో కలిసి ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయి, ఏం జరుగుతోందో గమనించసాగింది.

బాగా రాత్రయ్యాక భూతానికి మెలకువ వచ్చింది. మేలుకోగానే దానికి నరమాంసం గుర్తుకు వచ్చింది. సీత-పిల్లలు తన ప్రక్కనే ఉన్నారనుకొని, అది గబుక్కున దిండ్లలోకి గోర్లను గుచ్చింది. తీరా చూస్తే అక్కడ ఉన్నవి ఒట్టి దిండ్లే! తను మోసపోయానని గుర్తించగానే, దానికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఒక్క ఉదుటన లేచి ముందుకు దూకబోయిన భూతం నేలమీద ఉన్న బఠానీలమీద కాలు వెయ్యగానే ఒక్కసారిగా జారింది. దభాలున క్రింద పడబోతూ, దాన్ని ఆపుకునే క్రమంలో మరింత గందర గోళపడి, రెండు పల్టీలు కొట్టి, నేరుగా పెనం క్రింద పెట్టిన నిప్పుల్లో పడింది. ఆ రకం భూతాలకు నిప్పు సరిపోదు- నిప్పుని ముట్టుకోగానే అది కాస్తా తన సొంత రూపాన్ని పొంది, చచ్చిపోయింది!

బయటినుండి దాన్ని గమనిస్తున్న సీత ఇప్పుడు తృప్తిగా ఊపిరి పీల్చుకొన్నది. పిల్లలూ, తనూ లోపలికి వచ్చి ఆ భూతపు శరీరాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించారు. దాన్ని అట్లా ఇంట్లో వదిలేసేందుకు వీలులేదు! సీత దగ్గర తను పుట్టింటినుండి తీసుకు వచ్చిన ఇనప భోషాణం ఒకటి ఉండేది. దానిలో అంత విలువైనవస్తువులేవీ లేవుగానీ, చూసేందుకు మటుకు అది గొప్పగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు దాన్ని భూతం శరీరం దగ్గరికి లాక్కొచ్చి, అతి కష్టం మీద భూతం శరీరాన్ని దానిలోకి నెట్టి మూత వేసేశారు.

ఒక సారి ఆ పనయ్యాక, సీతకు చంద్రదీప్ గుర్తుకొచ్చాడు. భర్త ఏమయ్యాడోనని ఆందోళన మొదలైంది ఆమెకు. ఈ భూతం అతన్ని తినెయ్యలేదు గద, లేకపోతే అతని పోలికలు ఎలావచ్చాయి, దీనికి?!

వెంటనే ఆమె పిల్లల్ని వెంటబెట్టుకొని, చేతిలో ఓ లాంతరు పట్టుకొని, ఆ రాత్రి వేళనే అడవిలోకి బయలుదేరింది. సీత చాలా ధైర్యం గలది. అంతేకాక ఆమెకు అడవంతా కొట్టిన పిండి. నేరుగా ఆమె అడవి మధ్యలో సన్నటి వెదుళ్ళు ఉన్న పొద దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడ నేలమీద పడి ఉన్న భర్త కనిపించాడు. ఆమె గబుక్కున వంగి చూసింది. చూడగా అతని శ్వాస ఇంకా ఆడుతూనే ఉన్నది. ఆమె తన చీర చెంగుతో భర్త ముఖం తుడిచి, అతన్ని మూడుసార్లు కొట్టేసరికి చంద్రదీప్ టక్కున తేరుకొని, లేచి కూర్చున్నాడు-"నా కొడవలి ఏది, వెదుళ్ళు కొట్టాలి" అంటూ.

"చాల్లే, ఇప్పటికే చీకటి పడింది- పోదాం పద" అని, భర్త చెయ్యి పట్టుకొని లేవదీసింది సీత. అందరూ‌కలిసి అడవి దాటి తెల్లవారు జాముకల్లా భద్రంగా ఇల్లు చేరుకున్నారు. ఇంటి పరిస్థితిని చూసి సీత నిర్ఘాంత పోయింది. మధ్య గదిలో తాము వదిలి వచ్చిన భోషాణం అదృశ్యం అయ్యింది!

నిజానికి జరిగిందేంటంటే, ఆ రోజున ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం చూసి, నలుగురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. మధ్య గదిలో వాళ్లకోసమే పెట్టినట్లున్న భోషాణాన్ని చూసే సరికి వాళ్లకు ఎక్కడలేని సంతోషం కలిగింది. దాన్ని ఎత్తి చూసుకొని,"బరువుగా కూడా‌ఉందిరా!" అని మురిసిపోయారు వాళ్ళు.

అంతలో దూరంగా ఏదో అలికిడి అయినట్లనిపించి, వాళ్ళు నలుగురూ కూడబలుక్కున్నట్లు ఆ భోషాణాన్ని ఎత్తుకొని ఆయాసపడుతూనే గబగబా చాలా దూరం పోయారు. అక్కడ వాళ్ళు మూత తెరిచి చూసుకుంటే ఏముంది, కొమ్ములూ, కోరలూ పెట్టుకున్న పెద్ద భూతం బయటపడ్డది!

ఆ దెబ్బకు వాళ్ళలో ఒకడు అక్కడే మూర్ఛపోయాడు; మిగతా వాళ్లంతా‌ తలొక దిక్కుకూ పరుగు తీశారు. తర్వాత కొత్వాలు మనుషులకు మూర్ఛపోయినవాడూ, వాడిద్వారా మిగిలినవాళ్లూ అందరూ చిక్కారు. భూతం బెడద వదిలించటమే కాక, దొంగల్ని కూడా పట్టించినందుకు సీతకు రెట్టింపు సన్మానాలు చేశారు ఊళ్ళోవాళ్ళు!

woooww amazing Girl