Pages

Monday, February 6, 2017

ఇప్పుడు  " కాటమరాయుడు " గురించి చర్చ జరుగుతుంది.

ఇప్పుడు  " కాటమరాయుడు " గురించి చర్చ జరుగుతుంది.

.
" కాటమరాజు "  కనిగిరి (ప్రకాశం జిల్లా) ని పరిపాలించిన యాదవరాజు.
ఇతని కోట కనిగిరిదగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేది. ఇతడు మహాపరాక్రమ సంపన్నుడు.
ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి పగదీర్చటానికి
కాటమరాజు వాలికేతు రాజును సంహరించి విజయం సాధించాడు. ఇతనికి విస్తారమైన పశు సంపద
ఉండేది. కాటమరాజు "ఆవులమంద కుదిరితే ఆరామడ, చెదిరితే పన్నెండామడ" అని ప్రతీతి.
పద్మరాఘవుడు కాటమరాజు మంత్రి. అతనిని పద్మనాయకుడని కూడా అంటారు. తన భుజబలానికి
పద్మనాయకును నీతి బలం తోడు కాగా కాటమరాజు నేర్పుతో రాజ్యం చేశాడు.
ఒకప్పుడు వానలు లేక కరువుకాటకాలు కనిగిరి సీమను పీడించాయి. పశువులు మేతకై వెంపరలాడ
మొదలు పెట్టాయి. ఆవులు, ఎద్దులు, కోడె దూడలు, లేగలు, అన్నీ మలమల మాడిపోతున్నాయి.
ఈ స్థితిని చూచిన కాటమరాజు కడుపు.రంపంతో కోసినట్లు ఏదో చెప్పరాని బాధ. తన మంత్రి
పద్మనాయకునితో కర్తవ్యం ఆలోచించాడు. "నెల్లూరి సీమలో పచ్చికబీళ్ళు, అడవులు విస్తారంగా
ఉన్నాయి. నెల్లూరి ఏలిక నల్లసిద్ధిని ప్రార్థించి అక్కడి పచ్చిక బయళ్ళలో ఆలమందల్ని
మేపుతూ గండం గడపవచ్చు. అందుకు ప్రతిగా ఏటా మనం కొన్ని కోడెదూడల్ని రాజు కివ్వవచ్చు" నని
పద్మనాయకుడు తెలిపాడు. కాటమరాజుకు ఈ ఉపాయం నచ్చింది. వెంటనే అతడు నెల్లూరికి
సపరివారంగా ప్రయాణమయ్యాడు.
ఆనాటి నెల్లూరి ప్రభువు మనుమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధి రాజు. నల్లసిద్ధి దగ్గర
సేనాపతిగా ఖడ్గతిక్కన, ప్రధానామాత్యుడుగా చింకర్ల భీమినీడు ఉండేవారు.
కాటమరాజు నల్లసిద్ధిని దర్శించి తమకు వచ్చిన ఆపదను తెలిపి సహాయం కోరాడు.
నల్లసిద్ధిరాజు అందుకంగీరించి అనుమతి పత్రం వ్రాయించి కాటమరాజుకిచ్చాడు. అడవులలో,
పచ్చికబయళ్ళలో పశువులను మేపినందుకు ప్రతి సంవత్సరం మందలోని కొన్ని
కోడెదూడలను ఇవ్వాలన్నది అందులోని ఏర్పాటు.
కాటమరాజు ఆలమందలు పచ్చికమేసి బలిసినందువల్ల పాడికొరత తీరింది. కానీ అడవుల్లో జీవించే
వారి భృతికి ఈ ఆలమందలు,వాటిని కాసేవారు అడ్డువచ్చారు. చిలకలు రొదచేస్తుండగా ఆవులు బెదిరి
పోయాయి. వెంటనే వాటిని బాణంతో పడగొట్టాడు పద్మనాయకుడు.వాటిలో నల్లసిద్ధి రెండోరాణి
కుందమాదేవి పెంపుడు చిలుక ఒకటి. ఇది తెలిసిన కుందమాదేవి గోవులను చంపండని
ఆటవీకులను ఆజ్ఞాపించింది. ఇందుకు కుపితుడైన కాటమరాజు ఏడాది దాటినా నల్లసిద్ధికి పుల్లరి
పంపలేదు. గోనష్టం జరిగిన విషయం నల్లసిద్ధికి తెలియదు.కానీ పుల్లరి చెల్లించవలసిందని
రాయబారిగా ఒక భట్టును పంపించాడు.
ఆ రాయబారి కాటమరాజు గుడారాలవద్దకు వెళ్ళాడు. నలభైనాలుగు స్తంబాల శిబిరంలో
కాటమరాజు కొలువుదీరి ఉన్నాడు. భట్టుమాటలు విని "మీరాజు చేయించిన గోనష్టానికి
మేము చెల్లించవలసిన పుల్లరికీ సరిపోయింది" పొమ్మన్నాడు.రాయ
బారం చెడినందుకు చింతిస్తూ భట్టు వెళ్ళిపోయాడు. కాటమరాజు పద్మనాయకునితో "రాయబారం చెడింది.
నల్లసిద్ధి మనపై ఎప్పుడైనా దండెత్తవచ్చు. మనం యుద్ధానికి సిద్ధంగా ఉండటం అవసరం.
మన వారందరికీ కమ్మలు వ్రాయించి యుద్ధ సన్నద్ధులై రావలసిందని కబురుపెట్టు" మన్నాడు.
మంత్రి తగిన ఏర్పాట్లు చేయించాడు.
రాయబారి తిరిగివచ్చి కాటమరాజు పుల్లరి చెల్లించ నిరాకరించాడని చెప్పగానే నల్లసిద్ధి
ఉగ్రుడయ్యాడు.. "పుల్లరి చెల్లించ నిరాకరించి కాటమరాజు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.
మనం మన మగటిమి చూపించవలసిన తరుణం ఆసన్నమైంది. రణరంగంలోకి దూకి మీ పరాక్రమాన్ని
ప్రకటించండి" అని హెచ్చరించాడు. మంత్రి చింకర్ల భీమినీడు యుద్ధరంగంలో సాయం చేయవలసిందని
కోరుతూ సామంత రాజులందరికీ లేఖలు వ్రాయించాడు. వెంటనే నెల్లూరి పరిసరాలు సైన్యాలతో
నిండిపోయాయి. దండనాయకుడు ఖడ్గతిక్కన ఎర్రగడ్డపాటి యుద్ధభూమిలో
కాటరాజు సైన్యాలను ఎదురించాడు. రెండు దళాలకూ సంకుల సమరమయ్యింది. ఖడ్గతిక్కన
సైన్యమంతా నేలకూలింది. అతడు ఏకాకి. తిక్కన చింతించి మళ్ళీ సైన్యాలతో వచ్చి
శత్రు నాశనం చేయవచ్చునని నెల్లూరికి తిరిగి పోయాడు.
తిరిగి వస్తున్న తిక్కనను పౌరులు ఎగతాళి చేశారు. ముదుసలి తండ్రి సిద్ధన "పగరకు వెన్నిచ్చి
పిరికి పందలా పారి వచ్చావు. నీ బ్రతుకు వ్యర్థ" మని తూలనాడాడు. భార్య చానమ్మ భర్త
స్నానం కొరకు మంచం అడ్డుగా ఉంచి పసుపుముద్ద నీళ్ళ పెరటిలో పెట్టింది. "ముగురాడువారమైతిమి"
అని వెక్కిరించింది. తల్లి పుత్రునికి విరిగిన పాలిచ్చి "పశువులతోపాటు పాలుకూడా విరిగిపోయాయి"
అన్నది. ఈ నిందలు భరించలేక ఖడ్గతిక్కన సైన్యసమేతంగా వెళ్ళి మళ్ళీ తలపడ్డాడు.
కాటమరాజు పక్షాన బ్రహ్మరుద్రయ్య అనే వీరుడు తిక్కనతో ఘోరయుద్ధం చేసి
తిక్కనను చంపి తానూ చచ్చాడు.
ఖడ్గతిక్కన మరణవార్త విన్న నల్లసిద్ధిరాజు అపారమైన సైన్యాలతో
కాటమరాజును ఎదుర్కొన్నాడు. సంకుల సమరం జరిగింది. అపుడు కాటమరాజు కృష్ణుని అవతారంగా
భావించిన బొల్లావును పూజించి నల్లసిద్ధి సేనలను తునుమాడమని ప్రార్థించాడు. బొల్లావు ఎందరో
శత్రువులను హతమార్చింది. అయితే నల్లసిద్ధి మాయోపాయంతో చంపించాడు.
కాటమరాజు నిరుత్సాహపడ్డాడు కానీ అతని సేనలు వెన్నుచూపలేదు. వారిలో ఒకడైన బీరినీడు ఒకే
దెబ్బకు మద్దిమాను నరికి తనకత్తికి పదును చూసుకొని నల్లసిద్ధి సైన్యాన్ని ఊచకోత
కోశాడు. కానీ అతనుకూడా వీరమరణం పొందక తప్పలేదు. బాలవీరుడు పోచయ్య విజృంభించి పోరాడి
వీరస్వర్గం చేరుకున్నాడు. కాటమరాజు సైన్యం బలహీనపడింది.
అప్పుడు కాటమరాజు మంత్రాలోచనచేసి నల్లసిద్ధి సైన్యం పైకి ఆవులను, ఎద్దులను పంపాలని
నిర్ణయించాడు. యాదవులు ఆవులను అశ్వాలపైకి, ఎడ్లను గజబలం మీదికి ఉరికించారు.
అవికాల్బలంతో కూడా ఘోరయుద్ధంచేసి మరణించాయి. కాటమరాజు స్వయంగా నల్లసిద్ధిని
ఎదుర్కొన్నాడు. వారి ద్వంద్వ యుద్ధం "దక్షుండు శంభుండు తారసిలినట్లు,
రామరావణులు కదసినట్లు, మత్స్యంబు మొసలియు మల్లాడినట్లి, వారిధి వారిధితో,
మేరువు మేరువుతో తాకినట్లు" జరిగింది. కాటమరాజు చేతిలో నల్లసిద్ధి నిహతుడయ్యాడు.
అతని సైన్యం కాలికి బుద్ధి చెప్పింది. ఈ ఘోర రణం కాటమరాజు విజయంతో ముగిసింది.
.JAI Kathmaraaju YADAV

Never beg anyone to be in your life

మన విద్యావిధానం లో భగవద్గీత ఒక పాఠ్యాంశంగా ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి A.R దవేగారు ది 29-01-2014 వతేదీన ఈనాడు పేపర్ లో తెలిపారు.గీత ఆవశ్యకతను తెలిపేసన్నివేశం
                                     ఇదేమి ఖర్మ...?..ఐన్ స్టీన్
                         భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా॥ బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు. అతను విద్యార్థి గా ఉన్న రోజులలో ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు.ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే         ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.

ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత భాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా?పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు.

 "హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చారు. మీదేశంలోని అద్భుతమైన ఉపనిషత్తులు  సంస్కృతంలో  ఉన్నాయి. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.
   
     ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి.  వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాధానమిచ్చాడు.

     "ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు నన్ను ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతఃదృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను అని ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఇంకా ఏమన్నారంటే!

మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు అన్నారట.
 
భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో ఉన్నారు. అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే అని గీత గొప్పదనాన్ని గుర్తించటం లేదు.                                                               మన దేశ ఔన్నత్యం తెలుసుకోవడానికి  ప్రతీరోజు ఉ॥ 7.30కి భారత్ టుడే అనే T.V chanal చూడగలరు.          
                                                    ఈ విషయం ప్రతి భారతీయుడికి అందేటట్లుగా ప్రచారం చేయగలరు.

Interesting Facts of Telugu Language

Interesting Facts of Telugu Language

1. Telugu Language known to exist since the Time period 400 BCE.

2. In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.

3. Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.

4. An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.

5. There are many many Telugu communities in Myanmar Just do a Google Search.

6. In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.

7. Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.

8. Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaleswaram in Naizam, Srisailam in Rayalaseema and Bhimeswaram in Kostha;

9. Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.

10. Telugu language has the most number of Saamethalu i.e., idioms and proverbs.

11. Telugu language previosuly also known as Tenungu or Telungu or Tenungu.

12. Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.

13. About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius for slavery now Prime Minister is one of their descendant.

14. A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.

15. Sri Krishnadevaraya visited his temple in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amuktamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.

16. We have a single lettered poem in Telugu also called ekashara padhyamul

Check out how varicose veins are treated.

#శ్రీమన్నారాయణ_నామస్మరణ_మహాత్యం

#శ్రీమన్నారాయణ_నామస్మరణ_మహాత్యం

ఒకసారి నారద మహర్షి కి ఓ అనుమానము వచ్చింది

నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటాని? వెంటనే మహర్షి వైకుంఠము వెళ్ళి తన అనుమానమును శ్రీమన్నారాయణుని ముందుంచాడు. భగవంతుడు నారదమహర్షితో ఇలా అన్నాడు. “నారదా! ఇప్పుడే భూలోకంలో నైమిశారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది. దానిని వెళ్ళి అడుగు” అని ఆకీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆకీటకము దగ్గరకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆకీటకము గిలగిలకొట్టుకుని చనిపోతుంది. విచారంగా నారదమహర్షి వైకుంఠము తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. “ఒహో! అలాగా!! అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి, కశ్యపుని ఆశ్రమములోనున్న కపిలగోవుకి జన్మించిన వత్సము(ఆవుదూడ)ను అడుగు” అని ఆనతిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమములోనున్నఆవుదూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నవినగానే ఆ ఆవుదూడకూడ గిలగిల తన్నుకుని చనిపోతుంది.నారదమహర్షి ఆశ్చర్యచకితుడయ్యి, విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు.శ్రీమన్నారాయణుడు “నారదా! ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి” అని చెపుతాడు. అప్పుడు నారదమహర్షి ” ప్రభూ, నావలన ఒకకీటకము ఆవుదూడ చనిపోయినవి. ఇప్పుడు శిశుహత్యాపాతకముకూడా నామెడకు చుట్టుకునేలావుంది.” అని శ్రీమన్నారాయణునితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, “నారదా! నీకు ఏహత్యాపాతకము తగలదు. ఆశిశువు వద్దకు వెళ్ళి నీఅనుమానము నివృత్తిచేసుకో” అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞమేరకు నారదమహర్షి ఆ కాశీరాజుకు జన్మించిన శిశువు దగ్గరకు వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడాశిశువు పకపకానవ్వి “ఓ మహర్షి నేను అనేక జన్మలలో చేసిన పాపాల ఫలితముగా నీచమైన కీటకజన్మ ఎత్తవలసివచ్చింది. ఆజన్మలో నీవు వచ్చి “నారాయణ” అనే నామము నాచెవిలో పడవేసావు. ఆ అతిపవిత్రమైన నామము నాచెవిన పడగానే నాజన్మజన్మల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరల ఆ అతిపవిత్రమైన నామము నాకు వినిపించావు. తక్ష్ణమే ఆ పుణ్యఫలము అనుభవించనిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహాత్యము ఏమని చెప్పమంటావు! ఓ మహర్షి !” అని ఆ శిశువు మరల తన నరజన్మ అనుభవములోనికి వెళ్ళిపోతుంది.

నారదమహర్షి పరమానందభరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన ఆశ్రమమునకు తిరిగి వెడతాడు.

✍ _*లీడర్ షిప్ లక్షణాలు మేధావుల మాటలలో:-*_

✍ _*లీడర్ షిప్ లక్షణాలు మేధావుల మాటలలో:-*_

*1.లీడర్ ఎప్పుడూ జాతిలో నుండి పుట్టుకురాడు. జనంలో నుండిపుట్టుకొస్తాడు.*
                          
*-రాం రాజయ్య*
   
*2.లీడర్ మనకు ఏం కావాలో చేస్తాడు. మనకు ఏం వద్దో చెప్తాడు.*
            
*-డా:బి.ఆర్. అంబేద్కర్*

*3.లీడర్ కి కులం ఉండదు. గుణం ఉంటుంది.*
                    
  *-జ్యోతిబాపూలే*

*4.లీడర్ విభేదిస్తాడు. అవసరమైతే విడిపోయి వచ్చేస్తాడు.*
                
   *-బిపిన్ చంద్ర పాల్*

*5.లీడర్ ముందుకు నడిపిస్తాడు. ముందుకు వచ్చి నిలబడతాడు.*
                             
*-అల్లూరి*

*6.లీడర్ దీక్షతో, దక్షతతో అనుకున్నది సాధిస్తాడు.*       
                               
*-గాంధీజీ*

*7.లీడర్ నవ్వు ప్రశాంతత ఇస్తుంది. ప్రగతివైపు నడిపిస్తుంది.*

  *-డా:ఏ.పి.జే.అబ్దుల్ కలాం*

*8.లీడర్ ఒదిగి ఉంటాడు, మది(మనసు)ఎరిగి ఉంటాడు.*
     
*-నెల్సన్ మండేలా*

*9.లీడర్  సైన్యం కోసం చూడడు. తనే దళపతి, తనే సైన్యం అవుతాడు...*               
                         
*-కొమురం భీమ్*

*10.లీడర్ తనని లీడర్ అని అనుకొడు. కార్యకర్త అని మాత్రమే అనుకుంటాడు.*

   *-మార్టిన్ లూథర్ కింగ్*.