Pages

Wednesday, February 8, 2017

PANEER BUTTER MASALA

PANEER BUTTER MASALAPaneer Butter Masala is one ofthe most popular vegetarian curries in Indian cuisine. It is made with paneer dunked in a thick rich creamy tomato gravy.INGREDIENTS:1.Paneer (Indian cottage cheese) -  200 gms2.Butter - 2 tbsp3.Cinnamon - 1 inch4.Cloves - 35.Cardamom  - 16.Bay leaves - 27.Onions - 2 Medium size8.Tomatoes - 2 Medium size9.Garlic ginger paste - 1 tbsp10.Cashew nuts Paste - 2 tbsp11.Garam masala powder - 1 tsp12.Coriander powder - 1 tsp13.Red chili powder - 1 tsp14.Turmeric powder - 1/4 tsp15.Salt according to taste16.Heavy cream - 3 tbsp17.Coriander leaves18.Dry fenugeek leaves (Kasoori methi) - 1 tspPREPARATION:1.Cut onions into cubes.2.Boil them in water for about 10 minutes.3.Drain the water and grind it into a paste.4.Make a cross cuts at the base of each tomato as it easier to peel the tomato skins off later.5.Boil a large pot of water.6.Add tomatoes to boiling water and cook for about fiveminutes.7.Remove tomatoes from the boiling water and put them into cold water.8.When the tomatoes are cool, peel and discard the skin. Chop roughly and blend to a smooth puree in a food processor.9.Soak cashew nuts in warm water for about 10 minutes and blend it to a smooth paste.10.Cut paneer into cubes and slightly them in ghee or oil.11.Soak them in salt water.12.Heat butter in a cooking pan. Add cinnamon, cloves, cardamom and bay leaves.13.Add garlic ginger paste.14.Add onion paste and cook till it turns golden brown.15.Add cashew paste. Cook few minutes till its raw smellgoes.16.Add tomato puree.17.After two minutes add red chili, turmeric, coriander, garam masala powder and salt.18.Cook on low flame for about 10 - 15 minutes, till oil floatson top of the gravy.19.Add paneer cubes, heavy cream and kasoori methi.20.Cook on low flame for 5 minutes.21.Garnish with coriander leaves and serve hot with rice, naan or roti.

Tuesday, February 7, 2017

ఉప్మా చేయటం ఎలా?

ఉప్మా చేయటం ఎలా?
*కావల్సిన పదార్థాలు*: రవ్వ, ఉల్లిపాయలు,  పచ్చిమిర్చి,  పోపుదినుసులు, నూనే, ఉప్పు
*ముందుగా* స్టౌ వెలిగించుకొని కడాయిలొ రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి అవి వేగాక, ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను,పచ్చిమిర్చిని వేయాలి, కాస్త ఎరుపురంగులోకి వచ్చాక రెండు గ్లాసుల నీటిని అందులో పోయాలి, తర్వాత ఉప్పు తగినంత వేసుకొని నీరు మరిగే వరకు అలాగే ఉంచి నీరు మరిగాక నీటికి సరిపడ రవ్వని వేసి పది నిమిషాలు సన్నని మంటపై ఉంచి, తర్వాత స్టౌ అర్పేసి వేడివేడిగా ఉప్మా రెడి...😛😛😛😛

భీష్మ ఏకాదశి - శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి.

భీష్మ ఏకాదశి - శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి.

శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను ఆపోశనం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపదీ! ఇతరులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పారేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది.  దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.

మనం పారాయణ చేసే ’విష్ణు సహస్రనామం’ భీష్మాచార్యుల భిక్షగానే కదా దొరికింది.
అవసరంలేని, అన్య మత,దేశాలనుంచి అప్పు తెచ్చుకున్న సంస్కారంతో, అవైదిక మతాదులపెద్దలకు నీరాజనాలు పట్టి బిరుదులిచ్చి, ఉత్సవాలు జరపడానికి సెలవులు (కనీసం ఐచ్చిక సెలవులు) ప్రకటించుకునే మనం కనీసం భీష్మాచార్యుల పేర ఒక్క మంచి పనీ చేయం. కనీసం నేడైనా వారిని తలచుకొని నమస్కరించడం మన విహిత కర్తవ్యం. ఆయన కున్నటువంటి ధీరోదాత్తత, మాటమీదనిలపడి దేశాన్నీ, ధర్మాన్నీ, రక్షించి, ప్రేమించే మనో ధైర్యం, ధర్మాచరణానురక్తి మనందరికీ కలగాలని భీష్మాచార్యులవారి పాదాలను శిరసున ధరించి కోరుకుంటున్నాను.

This is why you should be cuddling!

*సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం..!!*

*సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం..!!*

సనాతన ధర్మశాస్త్రరీత్యా స్త్రీ ప్రకృతి స్వరూపినిగాను ధరణి(భూమాత) గాను గౌరవించటం పూజించటం జరిగింది..!
పరమాత్మ సైతం తనను రెండు భాగాలుగా విభజించుకుని అందులో రెండవ సగభాగం పరాశక్తికి ఇచ్చాడు..
నారాయణుడు సైతం లక్ష్మిని తన వక్షస్థలమున నిలిపాడు..!!

స్త్రీలందరూ మహా ప్రకృతియొక్క అంశలతో పుడతారని వారిని గౌరవించటం మన ధర్మమని..!
స్త్రీని దేవి స్వరూపంగా భావించి గౌరిపూజ కుమారిపూజ వంటి పూజలతో వస్త్రాలు అలంకారాలతో అర్చించటం పుణ్యప్రదమని మన సనాతన సంస్కృతి తెలుపుతుంది..!!

ధర్మార్థకామ్యమోక్షార్ది అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పితృఋణం.. దేవ ఋణం .. ఋషి ఋణాలనుండి ముక్తుడవుతాడు..
పురుషునకు సంతాన భాగ్యాన్ని విశేష గౌరవాన్ని అమృతత్వాన్ని ప్రసాదించేది భార్య మాత్రమే..!!

*"సఖా సప్తపదాభవ"*

స్నేహితలువలే ఇద్దరి మనసులు ఒక్కటికావాలి
ప్రేమానురాగాలతో జీవనం సాగించాలని కోరతారు..
వివాహ బంధంతో స్త్రీ తన జీవితాన్ని భర్తకు అర్పించటం మాత్రమే కాదు..
పురుషుడు సైతం తన సర్వస్వాన్ని తన జీవిత భాగస్వామికి అందిస్తాడు..!!

*"మూర్దానాం పత్యునారోహ"*

జీవికి శిరస్సు ఎంత ప్రధామైనదో
పురుషునకు స్త్రీ కూడా శిరస్సువలే ప్రధానమైనది..
శిరస్సు లేకుండా జీవించటం ఎంత అసాధ్యమో
భార్య లేని పురుషుడు కుడా శిరస్సు లేనటువంటి వాడే..!!

*"మమ హృదయే హృదయంతే అస్తు"*

నా హృదయం లో నీ హృదయం నా చిత్తం లో నీ చిత్తం మమేకమై ప్రేమభావముతో జీవించెదరు..!!

*" కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి "*

దాసిగా సేవచేస్తూ.. మంత్రిగా సూచిస్తూ.. తల్లిగా పాలిస్తూ.. రంభగా లాలిస్తూ.. ధరిత్రిగా క్షమిస్తుంది భార్య..!!
అనేక విధాలుగా భర్తకు సేవ చేస్తుంది ..
సేవ చేస్తుందని సేవకురాలు కాదు తానే ఇంటి యజమానురాలు..!!
తల్లిగా సేవచేసే లక్షణం వారికి జన్మతః వస్తుంది
కనుకనే ప్రతీ స్త్రీలో మాతృమూర్తిని చూడగలుగుతున్నాం..!!

దేవ ఋషి పితృ ఋణాలు తీర్చవచ్చునుగాని
మాతృఋణం తీర్చలేనిది
చెడ్డ కొడుకు పుట్టవచ్చునేమో కాని చెడ్డ తల్లి ఉండదు
తల్లిని వదిలేసిన సంతానం ఉంటుందిగాని
తల్లి వదిలేసిన సంతానం ఎవరు ఉండరు..!
మోక్ష మార్గాన్ని చూపే గురువుకన్నా
మోక్షస్వరూపమైన తండ్రికన్నా
జన్మనిచ్చిన తల్లి భుమికన్నా విలువైనది
తల్లిని పూజించటం కంటే గొప్ప పూజంటు లేదు..!!

*ఉపనయనంలో ముందుగా తల్లికే మాతృభిక్ష యాచించటం జరుగుతుంది .. సన్యాసించిన వారు ఎవరికి నమస్కరించకూడదు కాని తల్లికి నమస్కరించాలి... తల్లి ఋణం తీర్చలేనిది.. తల్లి శాపం త్రిప్పలేనటువంటది అనుభవించక తప్పదు.. తల్లిని గౌరవించకపోయినా హీనంగా చూసినా లేదా వృద్ధాప్యం లో వదిలేసిన రౌరవాది నరకాలు తప్పవని శాస్త్రాకర్తలు వాక్యానించారు..!!*

*" యత్ర నార్యస్తు పూజ్యంతే రమ్యతే తత్ర దేవతాః"*

ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో(గౌరవించబడతారో) అక్కడ దేవతలు క్రీడిస్తారు (సంతోషంగా నివసిస్తారు)..!!

*"కలకంఠి కన్నీరొలికిన సిరియింటనుండనొల్లదు సుమతీ"*

స్త్రీ కంట కన్నీరు వచ్చిన క్షణం గృహంలో లక్ష్మి నివసించదు

*"సగృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే గృహంతు గృహీణీహీనం అరణ్యం సదృషం భవేత్"*

స్త్రీ గృహంలో నివసిస్తుంది కనుకనే గృహము అనబడింది
స్త్రీ లేని గృహం అరణ్యంతో సమానం..!!

స్త్రీని అగ్నితో పోల్చారు..
అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్రమైనది ..
పరస్త్రీ ని తల్లిగా చెల్లిగా చూడాలని..
తల్లి అని సంబోధించాలని మన సంస్కృతి తెలుపుతుంది..!!

స్త్రీ దేవతలను పూజించే ఆచారం ఏ సంస్కృతిలోనైనా ఉందా అంటే అది కేవలం సనాతన ధర్మానికి మాత్రమే సొంతం..!!
స్త్రీలకు ఇంతటి గౌరవాన్నందించిన సనాతన ధర్మంలో జన్మించిన ప్రతీ ఒక్కరు ధన్యజీవులే కదా..!!

జీవిత సారాంశము...Songs Rupamulo 👁

జీవిత సారాంశము...Songs Rupamulo 👁
---------------------------------------------------
బిడ్డ పుట్టినప్పుడు:
------------------
"లాలీ  లాలీ లాలీ లాలీ...
లాలీ లాలీ లాలీ లాలీ...
వటపత్రసాయికి
వరహాల  లాలీ
రాజీవనేత్రునికి రతనాల లాలీ
మురిపాల కృష్ణునికి ముత్యాల  లాలీ..."

16 ఏళ్ళకి:

"పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
నేటి సరికొత్త  జాజిపువ్వల్లె
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..."

18 ఏళ్ళకి:

"ఎక్కడ ఉన్నా పక్కన  నువ్వే  ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేం అల్లరీ..
నా  నీడైనా అచ్చం  నీలా  కనిపిస్తూ  వుంది..
అరే ఇదేం గారడీ..
నేను  కూడా  నువ్వయానా
పేరుకైనా  నేను  లేనా..."

  25 ఏళ్ళకి:

"My Love is Gone
My Love is Gone
My Love is Gone
My Love is Gone
పోయే  పోయే లవ్వేపోయే
పోతే పోయిందే ..
its gone, its gone,
its gone, my love is gone."

35 ఏళ్ళకి:

"ఎందుకే  రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా
ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా
తాను  దూర సందు లేదు
తాను  దూర సందు లేదు
తాను  దూర సందు లేదు
మెడకేమో డోల రవణమ్మా
సతాయించాకే రవణమ్మా
బాగోదే రవణమ్మా
ఛీ ఛీ అంటారే రవణమ్మా"

45 ఏళ్ళకి:

"జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
బ్రతుకు సమరములో.. 
పండిపోయితిరా..
బ్రతుకు సమరములో.. 
పండిపోయితిరా..
మంచి తెలిసి మానవుడిగా మారినానురా...."

55 ఏళ్ళకి:

"సంసారం  ఒక చదరంగం
అనుబంధం  ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు రుణపాశాలు తెంచే  వేళలో
సంసారం  ఒక చదరంగం
అనుబంధం  ఒక రణరంగం.."

65 ఏళ్ళకి:

(పురుషుడు)
"కాశీకి  పోయాను  రామాహరి
గంగ తీర్థమ్ము  తెచ్చాను  రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.."
(స్త్రీ)
"కాశీకి పోలేదు రామాహరి
ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి
మురుగు  కాల్వలో నీళ్ళండి రామాహరి.."

75 ఏళ్ళకి:

"జగమంత  కుటుంబం నాది
ఏకాకి  జీవితం నాది
సంసారం సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే"

80 ఏళ్ళకి:

"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు  లేదులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...
లోకమెన్నడో చీకటాయెలే..."

90 ఏళ్ళకి:

"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.

95 ఏళ్ళకి.

ఇక నో సాంగ్ ఓన్లీ మ్యూజిక్.

డడనక డడనక డడనక డడనక డడనక.
😂😂😂😂😂😂😂😂😂

Thyroid cells created from stem cells, and other interesting news