Pages

Sunday, February 12, 2017

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.

10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.

24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. 26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.

27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.

28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.

34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.

35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.

46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.

47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.

48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.

50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.

51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.

81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

91. దిగంబరంగా నిద్రపోరాదు.
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*మీ*
*పురోహితులు*
*"శ్రీనివాస హరిపూర్ణేశ్వర పుత్ర "*
*గండిబత్తుల వీరవేంకట నాగమల్లేశ్వర శాస్త్రి.* 
*పోరంకి గ్రామము  ,* *విజయవాడ*
*సెల్ నెం*  : *9989247208*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

I ve believed otherwise my whole life!😳

* లక్ష్మీదేవి తలపై వుండకూడదంటారు. నిజమేనా?

* లక్ష్మీదేవి తలపై వుండకూడదంటారు. నిజమేనా?

నిజమే.  అయితే  పెద్దలు చెప్పిన ప్రతిమాటకీ  మనం మాటల అర్ధమేకాక ఆ మాటలకంతర్లీనంగా వున్న అసలు అర్ధం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా.

లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు.  మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే.  ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.  దీనికి ఒక పురాణ కధ చెప్తారు.

పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు.   అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు.  ఇంకేముంది.  జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు.  పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి  సమాలోచన చేశాడు.  వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణువేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.

ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు.  దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు.  అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు.  ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.  ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు.  నువ్వు  దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు.  దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.  యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు  దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు. 

ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు.  ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.  అనఘా దేవి భర్త వంక చూస్తుంది.  దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు.  అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది.  నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.  జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు.  అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.  నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు.

ఇది ఎలా సాధ్యమయింది.  అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం.  మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో  లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.  మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా.  లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగపరచినంతమటుకూ పర్వాలేదు.  కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని  గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు.  తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుందని ఈ కధ తెలియజేస్తుంది.

చెవిపోటుఉందా…… అయితే ఇలాచేయండి

చెవిపోటుఉందా…… అయితే ఇలాచేయండి

చెవులో నొప్పి ఎక్కువుగా ఉన్నపుడు జ్వరం వెంటనే వస్తుంది. అలాకాకుండా చీము కారుతున్నపుడు వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి. చెవి నొప్పి వచ్చినప్పుడు ఒక చిన్న నాప్కిన్ తెసుకోండి దానినివేడినీటిలో ముంచండి దీనిని బాగా పిండండి ఇప్పుడు దీనిని నొప్పి ఉన్న చెవి మీద ఉంచండి ఇలాఅ గుడ్డ చల్ల బడే దాకఉంచండి. ఇలాకొంచెం సేపు చేస్తే నొప్పినుండి ఉపసేమనం వస్తుంది. చెవి నొప్పి ఉన్నపుడు కొన్ని తులసి ఆకులని తెసుకొని రసం తీసి చెవులో వేసుకోండి. చెవిపోటు అనేది స్నానం చేసేటప్పుడు నీళ్ళు చేవులోకి వెళ్ళినపుడు కూడావస్తుంది. అలాంటపుడు కొంచెం అల్లం రసాన్ని తీసి చేవులోవేసుకోవాలికొంచెం సేపు తర్వాత చెవు వంచేయాలి ఇలాచేస్తే అల్లం రసం చెవిలో ఉన్న నీరుతోసహా బయటకు లాగేస్తుంది అ తర్వాత నొప్పి తగ్గుతుంది. చెవిపోటు వచ్చినపుడు చెవులో కొంచెం బ్రాందీ చుక్కలు వేసుకున్న నొప్పినుండి మంచి ఉపసేమనం వస్తుంది. లేదంటే 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలివీటిని బాగా ఉడికించి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరాలిఈ నూరిన పేస్టు ను ఒక చిన్న బట్ట తీసుకొని దానిలోవేసుకొని ముటలగాకట్టి నొప్పి ఉన్న చెవులో పెట్టుకోవాలి ఇలాచేయటం వల్ల నొప్పిలాగేస్తుంది. నువ్వుల నూనెలో ఒక వెల్లుల్లి రేబ్బను వేసి కొంచెం దోరగావేయించాలి అ తర్వాత ఆ నునెను గోరువెచ్చగా ఉన్నపుడు రొండు చెవుల్లో నాలుగు చుక్కలు చొప్పున వేసుకోవాలి. బాగా నొప్పిగా ఉంటె కొంచెం అతి మధురం తీసుకొని కొంచెం తేనెలో వేసి బాగా మిశ్రమంగా చేయాలిదీనిని నొప్పి ఉన్న చెవి చుట్టూ రాసుకుంటేనొప్పి నుండి తొందరగారిలీఫ్ వస్తుంది. గోరువేచ్చగా ఉన్న నువుల నూనెలో కొన్ని ఆముదం ఆకులూ వేసి బాగా మరిగించి అ నునెను చెవి చుట్టూ రాసుకోవాలి. లేదంటే చిన్న గుగ్గిలం ముక్కను తెసుకొని గ్యాస్ పైన చిన్న మంట మీద వేడి చేసుకోవాలిఇది కొంచెం వేడిగా అయాకదానినుండి పొగవస్తా ఉంటుంది ఆ పోగకు చెవి చూపించిన నొప్పి తగ్గుతుంది. 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో ఒక టేబుల్ స్పూన్ వాము వేసి బాగా వేడి చేసుకోవాలిఇది కొంచెం వేడిగా ఉన్నపుడు నొప్పిగా ఉన్న చెవిలో నలుగు చుక్కలు వేసుకోవాలి మావిడాకులనితెసుకొని రసం చేసుకోవాలిఈ రసాన్ని కొంచెం వేడి చేసుకొని నలుగు చుక్కలు చొప్పున చెవిలో వేసుకోవాలిఇలాచేస్తే వెంటనే ఉపసేమనం లబిస్తుంది. ముల్లంగిని చిన్న ముక్కలుగా కోసుకోవాలివీటిని ఆవ నూనెలో వేసి బాగా మరిగించి ఈ నునెను చెవిలో నాలుగు చుక్కలు వేసుకుంటే నొప్పి నుండి ఉపసేమనం లబిస్తుంది.3 ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి దానినివేడి చేసి చెవులో వేసుకున్న కూడానొప్పి తగ్గుతుంది. ఆవ నూనెను వేడి చేసి చెవులో వేసుకున్న కూడానొప్పి తగ్గుతుంది. చెవి నొప్పిగా ఉన్నపుడు కాన్దీస్ చప్పరించడం లేదా బాబ్బుల్ గం నమలడంచేస్తే నొప్పి నుండి ఉపసేమనం లబిస్తుంది. ఆవ నూనెలొకొన్ని మెంతులు వేసి వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత చెవుల్లో వేసుకుంటే చెవిపోటు రాదు,చెవిలో నుంచి చీము కారడంలాంటిసమస్యలు ఉండవు. పైన చెప్పిన వీదాలలోఏదైనాసరే చెవి నొప్పి వచ్చినప్పుడు చేసి వెంటనే ఉపసేమనం కలిగించుకోండి.

చెవిపోటుఉందా…… అయితే ఇలాచేయండి

చెవిపోటుఉందా…… అయితే ఇలాచేయండి

చెవులో నొప్పి ఎక్కువుగా ఉన్నపుడు జ్వరం వెంటనే వస్తుంది. అలాకాకుండా చీము కారుతున్నపుడు వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి. చెవి నొప్పి వచ్చినప్పుడు ఒక చిన్న నాప్కిన్ తెసుకోండి దానినివేడినీటిలో ముంచండి దీనిని బాగా పిండండి ఇప్పుడు దీనిని నొప్పి ఉన్న చెవి మీద ఉంచండి ఇలాఅ గుడ్డ చల్ల బడే దాకఉంచండి. ఇలాకొంచెం సేపు చేస్తే నొప్పినుండి ఉపసేమనం వస్తుంది. చెవి నొప్పి ఉన్నపుడు కొన్ని తులసి ఆకులని తెసుకొని రసం తీసి చెవులో వేసుకోండి. చెవిపోటు అనేది స్నానం చేసేటప్పుడు నీళ్ళు చేవులోకి వెళ్ళినపుడు కూడావస్తుంది. అలాంటపుడు కొంచెం అల్లం రసాన్ని తీసి చేవులోవేసుకోవాలికొంచెం సేపు తర్వాత చెవు వంచేయాలి ఇలాచేస్తే అల్లం రసం చెవిలో ఉన్న నీరుతోసహా బయటకు లాగేస్తుంది అ తర్వాత నొప్పి తగ్గుతుంది. చెవిపోటు వచ్చినపుడు చెవులో కొంచెం బ్రాందీ చుక్కలు వేసుకున్న నొప్పినుండి మంచి ఉపసేమనం వస్తుంది. లేదంటే 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలివీటిని బాగా ఉడికించి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరాలిఈ నూరిన పేస్టు ను ఒక చిన్న బట్ట తీసుకొని దానిలోవేసుకొని ముటలగాకట్టి నొప్పి ఉన్న చెవులో పెట్టుకోవాలి ఇలాచేయటం వల్ల నొప్పిలాగేస్తుంది. నువ్వుల నూనెలో ఒక వెల్లుల్లి రేబ్బను వేసి కొంచెం దోరగావేయించాలి అ తర్వాత ఆ నునెను గోరువెచ్చగా ఉన్నపుడు రొండు చెవుల్లో నాలుగు చుక్కలు చొప్పున వేసుకోవాలి. బాగా నొప్పిగా ఉంటె కొంచెం అతి మధురం తీసుకొని కొంచెం తేనెలో వేసి బాగా మిశ్రమంగా చేయాలిదీనిని నొప్పి ఉన్న చెవి చుట్టూ రాసుకుంటేనొప్పి నుండి తొందరగారిలీఫ్ వస్తుంది. గోరువేచ్చగా ఉన్న నువుల నూనెలో కొన్ని ఆముదం ఆకులూ వేసి బాగా మరిగించి అ నునెను చెవి చుట్టూ రాసుకోవాలి. లేదంటే చిన్న గుగ్గిలం ముక్కను తెసుకొని గ్యాస్ పైన చిన్న మంట మీద వేడి చేసుకోవాలిఇది కొంచెం వేడిగా అయాకదానినుండి పొగవస్తా ఉంటుంది ఆ పోగకు చెవి చూపించిన నొప్పి తగ్గుతుంది. 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో ఒక టేబుల్ స్పూన్ వాము వేసి బాగా వేడి చేసుకోవాలిఇది కొంచెం వేడిగా ఉన్నపుడు నొప్పిగా ఉన్న చెవిలో నలుగు చుక్కలు వేసుకోవాలి మావిడాకులనితెసుకొని రసం చేసుకోవాలిఈ రసాన్ని కొంచెం వేడి చేసుకొని నలుగు చుక్కలు చొప్పున చెవిలో వేసుకోవాలిఇలాచేస్తే వెంటనే ఉపసేమనం లబిస్తుంది. ముల్లంగిని చిన్న ముక్కలుగా కోసుకోవాలివీటిని ఆవ నూనెలో వేసి బాగా మరిగించి ఈ నునెను చెవిలో నాలుగు చుక్కలు వేసుకుంటే నొప్పి నుండి ఉపసేమనం లబిస్తుంది.3 ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి దానినివేడి చేసి చెవులో వేసుకున్న కూడానొప్పి తగ్గుతుంది. ఆవ నూనెను వేడి చేసి చెవులో వేసుకున్న కూడానొప్పి తగ్గుతుంది. చెవి నొప్పిగా ఉన్నపుడు కాన్దీస్ చప్పరించడం లేదా బాబ్బుల్ గం నమలడంచేస్తే నొప్పి నుండి ఉపసేమనం లబిస్తుంది. ఆవ నూనెలొకొన్ని మెంతులు వేసి వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత చెవుల్లో వేసుకుంటే చెవిపోటు రాదు,చెవిలో నుంచి చీము కారడంలాంటిసమస్యలు ఉండవు. పైన చెప్పిన వీదాలలోఏదైనాసరే చెవి నొప్పి వచ్చినప్పుడు చేసి వెంటనే ఉపసేమనం కలిగించుకోండి.

🍎బావుంది... ఓ రెండు నిముషాలు కేటాయించి చదివేయండి....

🍎బావుంది...
ఓ రెండు నిముషాలు కేటాయించి చదివేయండి....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నేటి బంధాల్లో బలమెంత?

ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన.

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా...ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.

ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు.
స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.

మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.

ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.

నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??

మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.

ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం
.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??

మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''

మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.

ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?

పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?

పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?

ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో

ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో

ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో

ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో

ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో

ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో

ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో

ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో

ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో

అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.

అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.

తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.

పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.

ఆలోచించండి ..😎🙏

కర్మఫలం!

కర్మఫలం!

ఒక వ్యక్తి ఉపాహారం తీసుకునేందుకు ఫలహారశాలకెళ్లాడు. చెల్లించవలసిన మూల్యం గురించి భయపడ్తూ ధారాళంగా తినేందుకు జంకుతున్నాడు. అక్కడి పదార్థాలను పంపిణీ చేసే ఉద్యోగి ''మీ రంతగా భయపడవలసింది లేదు. బిల్లు మీరు చెల్లించనక్కరలేదు. భవిష్యత్తులో రాబోయే మీ మనవల నుంచి వసూలు చేస్తాం'' అన్నాడు. తాను తిన్నదానికి తానే చెల్లించవలసిన అవసరం లేదని తెలుసుకున్న ఆ వ్యక్తి పరమానందభరితుడై అవసరమైన దానికంటే అధికంగానే తిని తృప్తిగా లేచిపోతుండగా ఆ ఉద్యోగి వేల రూపాయలతో కూడిన బిల్లు తెచ్చి ముందుపెట్టాడు. నిజానికతను తిన్నది వందలోపే. తెల్లబోయి ఇదేమిటని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ''మీరు తిన్నది మీ మనవలు చెల్లించబోతున్నప్పుడు మరి మీ తాతలు తిన్నది మీరు కట్టవలసిందే కదా?'' అన్నాడు నింపాదిగా.

ఎవరి కర్మఫలాలను వాళ్లే అనుభవించవలసి ఉంది అని తెలిసి కూడా ఇంత దుబారాగా దుష్కర్మలు చేసే లోకులు తమ కర్మఫలాలను ఇతరులు అనుభవిస్తారనే వెసులుబాటు ఉంటే ఇంకెంత విశృంఖలంగా  ఉండేవారో కదా!? కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, మన బిల్లును మనమే కట్టవలసిన  అనివార్యతను గుర్తుంచుకుంటే అప్రమత్తులమై కర్మలనాచరించి అమృత పుత్రులమనే మన స్వనామానికి సార్థకత చేకూర్చగలం............