Pages

Thursday, February 16, 2017

పనీర్ పాలకూర బాల్స్


పనీర్ పాలకూర బాల్స్

కావలసిన పదార్థాలు :
బ్రెడ్‌ముక్కలు-పది,
పాలకూర-కట్ట
అల్లం,పచ్చిమిర్చిముద్ద-అరచెంచా,
వెల్లుల్లి ముద్ద-అరచెంచా
గరంమసాలా-అరచెంచా,
నిమ్మరసం-చెక్క
ఉప్పు-రుచికి తగినంత,
పనీర్‌-150 గ్రా.

మారినేషన్‌ కోసం:
నిమ్మరసం-చెంచా,
అల్లం,పచ్చిమిర్చి ముద్ద-అరచెంచా
వెల్లుల్లిముద్ద-అరచెంచా,
మిరియాల పొడి-పావుచెంచా
మొక్కజొన్న పిండి-తగినంత,
నూనె-వేయించడానికి తగినంత
తయారుచేసే విధానం:
మొక్కజొన్న పిండి, నూనె కాకుండా మిగతా మారినేషన్‌ పదార్థాలు, పనీర్‌ను గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి.
తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్‌ముక్కల చివర్లు తీసేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకోవాలి.
అందులో పాలకూర తరుగు, మారినేట్‌ చేసిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేర్చుతూ బాగా కలపాలి.
బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని వేయించుకోవాలి.
బాగా వేగాక దించేస్తే పనీర్‌ పాలకూర బాల్స్‌ సిద్ధమయినట్టే. వీటిని చల్లటి సాయంత్రం వేళ టమాటాసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.

బేల్ పూరి


బేల్ పూరి

కావలసిన పదార్థాలు:
మరమరాలు - 100 గ్రాములు,
టమాటాలు - 10 గ్రాములు,
ఉల్లిగడ్డ - 1,
కొత్తిమీర - 1 కట్ట,
కట్టామీటా చట్నీ - టేబుల్‌ స్పూన్‌,
కారం - 3 గ్రాములు,
చాట్‌ మసాలా - 3 గ్రాములు,
నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు,
సేవ్‌ - 20 గ్రాములు
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ఉల్లిగడ్డ, టమాట, పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి.
ఓ గిన్నెలో కట్టామీటా చట్నీ, ఉప్పు, కారం, చాట్‌మసాలా కలపాలి.
అందులోనే మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేటట్టు తిప్పాలి.
చివర్లో సేవ్‌, కొత్తిమీర తరుగు చల్లుకుంటే చాలు.

🏚 The most miserable man in the world was born in a one-room log cabin with dirt floors...

Seriously, kiss more often

Wednesday, February 15, 2017

New implant could help stroke patients recover faster

Having a soft heart in a cruel world is courage, not weakness

బనానా ఇడ్లీ


బనానా ఇడ్లీ

కావలసిన పదార్థాలు :
రవ్వ - ఒక కప్పు
కొబ్బరి తురుము
- పావు కప్పు
పండిన అరటిపండ్లు - 4
చక్కెర - అరకప్పు
బేకింగ్ సోడా
- అర టీ స్పూన్
నెయ్యి - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
పండిన అరటిపండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరటిపండ్ల గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, చక్కెర, బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేయాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కు నెయ్యి రాసి, అరటిపండ్లతో చేసిన మిశ్రమాన్ని పోసి 15నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇంకేముంది.. బనానా ఇడ్లీ రెడీ! పాలతో కలిపి ఈ ఇడ్లీలు తింటే ఎంతో ఆరోగ్యం!