Pages

Thursday, February 16, 2017

మన *శ్రీహరికోట* గురించి కొంత తెలుసుకుందాం.....

మన *శ్రీహరికోట* గురించి కొంత తెలుసుకుందాం.....
దీనికి వేదికగా Sathish Dhawan Space Centre ను వేదికగా చేసుకుంది....SHAR గురించి మీకు తెలియని విషయలని మీతో పంచుకోబోతున్నాను....
* అసలు SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SHAR అంటే శ్రీహరికోట అని అర్ధం.....
* శ్రీహరికోట, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలుమార్గం లో ఉన్న సూళ్లూరుపేట అనే రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్లు దూరం లో ఉంది.
*శ్రీహరికోట అనేది చెప్పాలంటే ఒక ద్వీపం.*
ఒక పక్క సముద్రం, ఒక పక్క పులికాట్ సరస్సు ఉంటుంది.
మనం ఎప్పుడూ వింటూ ఉండే Buckingham కెనాల్ కి ఒడ్డున ఉంటుంది.
* శ్రీహరికోట అనే ద్వీపం వైశాల్యం 44000 ఎకరాలు ఉంటుంది. అంటే మనం కట్టబోయే అమరావతి కన్నా కొంచెం పెద్దది. ఎక్కువ భూభాగం అడవులు ఉంటాయి. ఈ అడవులలో అడవి దున్నలు, పాములు, జింకలు వంటి వన్యప్రాణులు ఉంటాయి. ఎక్కువ ఆడవులు ఉండడం వల్ల వేసవి లో కూడా చల్ల గా ఉంటుంది.
* ఒకానొక సమయంలో రాకెట్ ను సైకిళ్ళ మీద ప్రయోగానికి తీసుకునివెళ్లే వారు. మొదటిగా సౌండింగ్ రాకెట్స్ ను ప్రయోగించేవారు.
* ఈ ప్రాంతం సముద్రం ఒడ్డున కోల గా ఉండడం వల్ల ఏమైనా అనుకోని పొరపాటు వల్ల రాకెట్ విఫలం అయితే సముద్రంలో పడిపోయేలా ఉంటుంది. సముద్రం లోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి ఉండదు.
* ఇక్కడ సముద్రం చాలా అందం గా ఉంటుంది. మన గోవా లో ఉన్నట్టు బాగా నీలం రంగు లో ఉంటుంది. అందులో పని చేసే వాళ్ళకి అప్పుడప్ప్పుడు వెళ్ళే అవకాశం ఉంది.
* సామాన్యులకు లోపలి కి వెళ్లే అనుమతి దొరకడం చాలా కష్టం. మన దేశ సరిహద్దు లో ఉండే CRPF, BSF జవానులు నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు. మన దేశానికి గర్వకారణం అయిన రహస్యాలు వల్ల.....
* లోపలికి ఫోన్ కాదు కదా, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కూడా తీసుకువెళ్ళనియరు. మూడు చోట్ల CRPF జవానులు సోదా చేశాకనే లోపలికి పంపిస్తారు.
* ఇక్కడ ప్రస్తుతానికి రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. వాటి చుట్టూ హై వోల్టాజ్ ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ నిత్యం ఉంటుంది. ఇంకొకటి నిర్మాణం లో ఉంది. అది పూర్తి అవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది.
* ఒక లాంచ్ ప్యాడ్ నందు అసెంబ్లీ హాల్ (రాకెట్ ను తయారు చేసే చోటు ) కిలోమీటర్ దూరం లో ఉంటుంది. అసీంబ్లీ హాలు నుంచి రైల్వే ట్రాక్ వంటి వాటి మీద రెండు పెద్ద లారీలు రాకెట్ ను పాడ్ కు తరలిస్తారు.
* ఇంకో లాంచ్ పాడ్ నుంచి అసెంబ్లీ హాలు కిలోమీటర్ వెనక్కి వెళ్తుంది. అంటే అసెంబ్లీ హాలు కదిలేలా తయారు చేశారు.
* సాధారణం గా మనం లాంచ్ పాడ్ చూసి దానికింద ఏమి ఉండదు అనుకుంటాం. కానీ దాని కింద త్రిభుజం బోర్లించినట్టు ఆకారం లో 200 అడుగులు లోతు ఉంటుంది. కింద నీరు వచ్చేలా హై స్పీడ్ నాజిల్సు ఉంటాయి. 200000 లీటర్లు సరిపడా నీరు ఒకొక్క నాజిల్ నుంచి వస్తుంది. రాకెట్ వేడిని తట్టుకునేందుకు....
* ప్రయోగం జరుగుతున్నప్పుడు 7 కిలోమీటర్లు చుట్టు పక్కల ఏ ప్రాణి ఉండదు. ఉన్నా బ్రతకదు. లాంచ్ పాడ్ పక్కన రెండు భారీ లైటినింగ్ అరెస్ట్లు ఉంటాయి. అంటే పిడుగులు పడినా ప్యాడ్ కి ఏమి కాకుండా అవి తీసుకుంటాయ్.
* వాటికీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. సాధారణ కెమెరా తో ఆ చిత్రాలను బంధించడం కుదరదు. ISRO సౌజన్యం లేనిదే ఆ చిత్రాలు బయటకి రావు.
* శాస్త్రవేత్తలు కూర్చుని ఉండే స్థలాన్ని కంట్రోల్ సెంటర్ అంటారు. అక్కడ VVIP కి మాత్రమే అనుమతి. ప్రయోగం పూర్తి అయిన వెంటనే ఒక అగ్నిమాపక దళం వచ్చి పరిస్థితులు అన్ని సక్రమం గా ఉన్నాయి అని తేల్చిన తర్వాతే అక్కడకి మనుషులను అనుమతిస్తారు.
* లాంచ్ ఆయిన ప్రతి సారి ప్యాడ్లకు పెయింట్ వర్క్ చేస్తారు. అంత వేడి వల్ల పెయింట్ అంత కరిగిపోతుంది.
* స్పేస్ మ్యూజయం లో అన్ని మోడళ్లను ప్రదర్శన కు ఉంచుతారు. అక్కడికి మొబైల్ ఫోన్ లను అనుమతిస్తారు. చాలా అబ్బురపరిచే విషయాలు ఆ ప్రదర్శన శాల లో ఇన్నాయి.
* చెప్పాలంటే ISRO సాటిలైట్ ను మాత్రమే తయారు చేస్తుంది. ఇక్కడ ISRO కింద దాదాపు 800 కంపెనీలు పని చేస్తాయి. ఒకొక్క పార్ట్ ఒక దగ్గర తయారు అవుతుంది. ISRO వాటి అన్నింటికీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది....
* దాదాపు 150 అడుగుల వెడల్పు లో ఒక భారీ antenna ఉంటుంది. అంటే మన డిష్ టీవీ కి ఉండే డిష్ లాగా అన్నమాట. దాని నుంచే రాకెట్ ట్రాకింగ్ అవుతుంది. అది కొంత దూరం వరకే పని చేస్తుంది. ఆ పరిధి దాటితే అండమాన్ దీవుల్లో ఇంకో ట్రాకింగ్ సిస్టం ఉంది. అక్కడి నుంచి సంకేతాలు అందుతాయి. అది కూడా దాటితే Antarctica సముద్రం లో ISRO కి ట్రాకింగ్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి కూడా సమాచారం అందుతుంది.
* ట్రాకింగ్ స్టేషన్ ఎపుడూ చాలా చల్ల గా ఉంచడానికి నిత్యం AC లు రన్ అవుతూనే ఉంటాయి. SHAR లోపల ఒక చివర నుంచి ఇంకో చివరకి 40 కిలోమీటర్లు దూరం ఉండే రోడ్లు ఉంటాయి.
* అత్యంత భారీ దున్నపోతులు ఇక్కడ ఉంటాయి. ఒకసారి రాకెట్ ను తీసుకు వెళ్లే లారీ గోతి లో పడితే దున్నపోతులు పెట్టి లాగించారట...... సాయంత్రం 5 దాటితే ఇక్కడ ఎవరు ఉండరు ఒక్క ఎస్కార్ట్ పోలీస్లు తప్ప
ఇదండీ SHAR విశేషాలు. ఉపయోగం అనిపించేలా ఉంటె అందరికి Share చేయండి

✍ప్రశ్న---జవాబు👍

✍ప్రశ్న---జవాబు👍

ఇంట్లో, గుడిలో దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా అనే ప్రశ్న ....   ...
ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకుంటుండేవారు, వారిలో ఒక పిల్లవాడికి ఇదే విధమయిన సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని  ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు. ఆరోజు పాఠం “ ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .  పాఠం చెప్పడం పూర్తయిన  తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి  ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.

పరమేశ్వరీ ప్రసాద సిద్ధిరస్తు.

నిత్యం ఎవరిని పూజించాలి…?

నిత్యం ఎవరిని పూజించాలి…?
సనాతన హైందవ ధర్మంలో ప్రతివారికి నిత్య పూజ ఒక భాగం.
అయితే ఈ విషయంలోనే అనేకమందికి అనేక సందేహాలు ఉంటాయి.

అసలు రోజూ ఏ దేవతని పూజించాలి ? ఏ దేవత ఫోటో ఇంట్లో ఉండాలి ? ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు.

మీ సందేహాలు అన్నిటికి నా ఈ ఆర్టికల్ ఉపయోగం అవుతుంది అని భావిస్తూ రాస్తున్నాను.

పూజా మందిరం లో ఎన్ని విగ్రహాలు ఉండాలి ?

ఆదిత్య గణనాథంచ దేవీం రుద్రంచ కేశవం ! పంచ దైవత్వమిత్యుక్తం సర్వ కర్మసు పూజయేత్ !  ( మత్స్య పురాణం ).

పై శ్లోకం పంచాయతనం గురించి వివరణ ఇస్తుంది.

1 . ఆదిత్యుడు అనగా సూర్యుడు – ఇతను ఆరోగ్య ప్రదాత ! ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్ర వచనం. ఆరోగ్యమే మహా భాగ్యం కదా !

2. గణనాథం అనగా గణపతి – ఇతను విఘ్నాలు తొలగించేవాడు! అన్ని పనులు విజయవంతం కావలి అంటే ఈయన అనుగ్రహం కావాలి !

3. దేవీం అనగా అమ్మవారు – ఈమె త్రిశక్తి  రూపిని కాళి – లక్ష్మి – సరస్వతి రూపిణి. శక్తి  – ధనం-విద్య  ఈమూడు అత్యవసరం కదా !

4. రుద్రం అనగా శివుడు –

5. కేశవం అనగా విష్ణువు –  …శివ కేశవుల అనుగ్రహం కోసమే మానవ జన్మ లక్ష్యం !

మనలో ప్రతి ఒక్కరూ ఈ 5 మంది దేవతలను నిత్యం పూజించాలి. ఇంకా అనేక విగ్రహాలు ఇంట్లో అవసరం లేదు.

అలా అని ఉన్నవాటిని పారేయమని నా ఉద్దేశం కాదు. పూజా మందిరం లో తక్కువ విగ్రహాలు ఉంటే మందిరం శుభ్రంగా ఉండడమే కాకుండా పూజ కూడా ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకోవడం జరుగుతుంది.

ఒకే దేవుని విగ్రహం ఒకటే ఉంటే మంచిది. ఒకే దేవుని విగ్రహాలు ఎక్కువ ఉంటే ఇంటికి కీడు దోషము అనే మాటలు నమ్మకండి. భగవంతుడు మనకు మేలు చేసేవాడే కానీ కలలో కూడా కీడు చేయడు అని గ్రహించండి. అలాంటి శాడిస్టు తనం దైవంలో ఉండదు.

దేవుని పటాలు కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇష్ట దేవత కులదేవతల ఫోటోలు కచ్చితంగా ఉండాలి.

పైన పంచాయతనం లో అనగా 5 విగ్రహాలలో శివుడు  మధ్యలో ఉండి చుట్టూ కింద చిత్రంలో ఉండేట్టు పెట్టుకోవడంని ” శివ పంచాయతనం ” అంటారు.

విష్ణువు మధ్యలో ఉంటే అది విష్ణు పంచాయతనం, అమ్మవారు మధ్యలో ఉంటే అది అంబికా పంచాయతనం, గణపతి మధ్యలో ఉంటే అది

” గణేష పంచాయతనం ”,  సూర్యుడు మధ్యలో ఉంటే అది ” ఆదిత్య పంచాయతనం” అంటారు.

పూజా మందిరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. అనవసర వస్తువులు, చెత్త చెదారం అసలు ఉండకూడదు.

శ్రద్ధతో రోజు షోడశ ఉపచార పూజ చేయాలి. సమయం దొరకని వారు పంచోపచార పూజ చేయవచ్చు. భక్తి మాత్రమే ప్రధానం.

పంచోపచార పూజ విధానం :

చాలా మందికి నిత్యం శాస్త్రోక్తంగా పూజ చేసుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఈ యాంత్రిక జీవనంలో సమయాభావం వల్ల ఏదో ‘ అయ్యింది ‘ అనిపిస్తుంటారు. కొద్ది సమయంలో శాస్త్రోక్తంగా ఎలా పూజ చేసుకోవాలి…ఇప్పుడు తెలుసుకుందాం !

ముందుగా దేవతా మందిరం శుభ్రం చేసుకోవాలి !
ముందు రోజు పెట్టిన పుష్పములను తీసివేయాలి, దీనినే నిర్మాల్యమ్ అంటారు !
దీపారాధన చేసుకోవాలి !
దేవతా విగ్రహములు లేదా పటములు శుభ్రం చేసుకుని అలంకరించుకుని పెట్టుకోవాలి !
అక్షింతలు తీసుకుని ఆయా దేవతలను ధ్యానించి అక్షింతలు వారి పైన వేసి నమస్కరించాలి !
లం – పృథివీ తత్వాత్మనె గంధం సమర్పయామి..అని గంధమ్ పసుపు కుంకుమ వేయాలి !
హం – ఆకాశ తత్వాత్మనె పుష్పం సమర్పయామి..అని పుష్పం సమర్పించాలి !
యం- వాయు తత్వాత్మనె ధూపం సమర్పయామి..అని ధూపం వేయాలి !
రం – తేజః తత్వాత్మనె దీపం సమర్పయామి..అని దీపం చూపించాలి !
వం – అమృత తత్వాత్మనె నైవేద్యం సమర్పయామి..అని నైవేద్యం సమర్పించాలి !
సం – సర్వ తత్వాత్మనె తాంబూలం సమర్పయామి..అని తాంబూలం సమర్పించాలి !
చివరికి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి ‘ మంత్ర హీనం..’ అని అక్షితలు వదిలేయాలి.
ఇది సూక్ష్మము మరియు శాస్త్రోక్తము. దీనిని పంచొపచార పూజ అంటారు.
ఇంకా సోమవారం శివార్చన, మంగళవారం హనుమ ఆరాధన, బుధవారం రాముని పూజ, గురువారం గురువుల పూజ, శుక్రవారం దేవీ ఆరాధన, శని వారం వెంకటేశ్వర ఆరాధన, ఆదివారం సుర్యారాధన కూడా పటములకు చేసుకోవచ్చు.
మనం ఎంత పూజ చేసినా పూజా మందిరం శుభ్రంగా లేకపోతె ఆ పూజలు అన్నీ నిష్ఫలం అవుతాయి.
దరిద్ర దేవత రావడం , దేవుడు శపించడం , అరిష్టం జరగడం ఇలాంటివి అన్నీ మనల్ని భయపెట్టడానికి చెప్పేవే కానీ అందులో నిజాలు లేవు.
దైవారాధనలో చేసే భక్తి ప్రధానం. భగవంతుడు వరాలు మాత్రమే ఇస్తాడు. శాపాలు ఇవ్వదు