Pages

Wednesday, February 1, 2017

*బడ్జెట్‌ 2017-18 హైలైట్స్‌*

*బడ్జెట్‌ 2017-18 హైలైట్స్‌*

పార్టీలు పన్ను రిటర్నులు సమర్పించాలి 
* 2017-18 సంవత్సరానికి రెవెన్యూ లోటు 1.9 శాతం 
* పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిగతులు తెలిశాయి. 
* నగదు లావాదేవీల ద్వారా పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోంది. అందుకే నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాం.

* రూ.5కోట్ల టర్నోవర్‌ లోపు ఉన్న కంపెనీలకు ఒక శాతం కార్పొరేట్‌ పన్ను మినహాయింపు 
* నోట్ల రద్దుతో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులో 35శాతం వృద్ధి 
* నల్లధనం నిరోధంలో భాగంగా రూ.3లక్షలకు మించి నగదు లావాదేవీలకు అనుమతి లేదు.

* రాజకీయ పార్టీల విరాళాలు రూ.20వేలకు మించితే లెక్క చూపాలి. విరాళాలు చెక్కు లేదా డిజిటల్‌ రూపంలోనే చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. 
* చారిటబుల్‌ ట్రస్టులకు ధన రూపేణా విరాళాలు రూ.2వేలకు మించరాదు. 
* డిజిటలైజేషన్‌ ప్రోత్సహించే పరికరాలకు పన్ను మినహాయింపు

*బడ్జెట్‌ 2017-18 @ 21.47లక్షల కోట్లు*
* రక్షణ రంగానికి రూ.2.74లక్షల కోట్లు 
* బీమ్‌ యాప్‌ ప్రోత్సాహం కోసం రెండు కొత్త పథకాలు
* సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ 
* పెట్రోల్‌ బంకులు, ఆస్పత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సాహం

* రూ.2500 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం. 
* త్వరలో ఆధార్‌ అనుసంధానిత వ్యవస్థ 
* ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తు కోసం ప్రత్యేక చట్టం 
* 2020లోగా 20లక్షల ఆధార్‌ ఆధారిత పీవోఎస్‌ యంత్రాలు

గ్రామాలకు ఇంటర్నెట్‌ 
* భారత్‌ నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం రూ.10వేల కోట్లు 
* మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,96,135 కోట్లు
* దేశవ్యాప్తంగా 250 ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. వీటి కోసం రూ.1.26లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 
* 20వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు

* ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేసేందుకు విలువ నిర్థరణ కమిటీ ఏర్పాటు 
* ముద్రా రుణాల కోసం రూ.2.44లక్షల కోట్లు 
* వృద్ధులకు ఆధార్‌ ఆధారిత ఆరోగ్య కార్డులు 
* విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు రద్దు 
* ఒడిశా, రాజస్థాన్‌లో ముడి చమురు నిల్వ కేంద్రాల ఏర్పాటు

రైల్వే బడ్జెట్‌ రూ.1.31లక్షల కోట్లు 
* రైల్వేకు రూ.55వేల కోట్ల ప్రభుత్వ సాయం 
* 2020 నాటికి బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో గేట్లు ఏర్పాటు 
* ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే రైలు టికెట్లపై సేవాపన్ను రద్దు 
* 2017-18లో 25 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

* దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానం 
* జనరిక్‌ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం 
* వైద్య పరికరాలు, ఉత్పత్తికి ప్రత్యేక విధానం 
* 2025లోగా క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు

* వెనుకబడిన కులాలకు రూ.52,393 కోట్లు కేటాయింపు 
* గిరిజనులకు రూ.31,920 
* మైనారిటీలకు రూ.4,195 కోట్లు 
* వృద్ధులకు 8శాతం వడ్డీతో ఎల్‌ఐసీ ద్వారా ప్రత్యేక బాండ్లు

* మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కానికి రూ.48వేల కోట్ల కేటాయింపు. 
* 2018క‌ల్లా గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌక‌ర్యం. 
* ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా. 
* గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది.

* 2018క‌ల్లా గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌక‌ర్యం. 
* ప్ర‌ధాన మంత్రి ప‌జ‌ల్ యోజ‌న కింద రోడ్లు, 133 కి.మీ. ప్ర‌తి రోజూ నిర్మించ‌నున్నాం. 
* ఉపాధిహామీ ప‌థ‌కంలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం పెంపు 
* కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు

* 100 రోజుల క‌నీస ఉపాధిహామీ. 
* స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భించింది. 
* సంక‌ల్ప్ ప‌థ‌కం ద్వారా యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌. 
* ఐసీటీ ద్వారా విద్యాబోధ‌న‌. అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ఒకే సంస్థ‌

* ప్ర‌తిభ క‌లిగిన క‌ళాశాల‌ల్లో ప్ర‌త్యేక ప్రోత్సాహకాలు. 
* సెకండ‌రీ విద్య‌లో ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌త్యేక‌నిధి. 
* ఉపాధి అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న కోర్సుల ఏర్పాటు.
* దేశం వెలుప‌ల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్ష‌ణ‌. 
* దేశ‌వ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు.

నైపుణ్యాభివృద్ధికి సంకల్పనిధి 
* విద్యారంగం కోసం ప్రత్యేక డీటీహెచ్‌ ఛానల్‌ ఏర్పాటు
* 600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 
* రూ.4వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి సంకల్ప నిధి 
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల అనుసంధానం

* ఐదు ప్రత్యేక పర్యాటక జోన్ల అభివృద్ధి 
* మహిళా సాధికారత కోసం రూ.500కోట్ల మహిళా శక్తి కేంద్రాలు 
* గర్భిణుల ఆస్పత్రి ఖర్చులకు రూ.వేల నగదు బదిలీ 
* గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా

* గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా రూ.20వేల కోట్ల రుణం 
* నోట్ల రద్దు ద్వారా వచ్చిన నగదు నిల్వలతో ఇప్పటికే బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. పరిమిత స్థాయిలో గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు ప్రధాని ఇప్పటికే ప్రకటించారు.

* 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అరికడతాం. 
* ఉపాధి హామీ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఉపాధి హామీ కోసం చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తాం. 
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,87,23 కోట్లు ఖర్చుచేస్తాం. 
* ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు రూ.19,100కోట్లు

* ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.23వేల కోట్లు 
* గ్రామజ్యోతి యోజనకు రూ.4,300కోట్లు 
* అంత్యోదయ యోజనకు రూ.2,500కోట్లు 
* నిరుపేదలకు కోటి ఇళ్ల నిర్మాణం 
* ఫ్లోరైడ్‌ పీడిత 28వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకాలు

* అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఒక‌టిగా ఐఎంఎఫ్ పేర్కొంది. 
* విదేశీ పెట్టుబ‌డులు భారీగా త‌ర‌లివ‌స్తున్నాయి. 361 బిలియ‌న్ డాల‌ర్లు విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు చేరాయి.
* రైతులకు అండ‌గా ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.

* పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చ‌ర్య‌లు. పాల కేంద్రాల‌ను పాల‌వెల్లువ ప‌థ‌కం కింద రూ.8వేల కోట్ల‌తో పాల‌సేక‌ర‌ణ కేంద్రాల స్థాప‌న‌. 
* గ్రామీణ ప్రాంతాల‌పై దృష్టి పెట్ట‌డంతో పాటు మౌలిక సౌక‌ర్యాలకు ప్రాధాన్య‌త ఇస్తున్నాం. 
* గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు వేగ‌వంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒక‌టి. 
* ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అనిశ్చితిలో ఉంది. అయినా భార‌త్ అన్నిరంగాల్లో ప్ర‌గ‌తి సాధించింది.

* వ్యవసాయ రుణాలకు రూ. 10లక్షల కోట్లు కేటాయింపు 
* ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు 
* నాబార్డుతో సహకార బ్యాంకులు, వ్యవసాయ సంఘాలను అనుసంధానిస్తాం

* ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలోనూ భూసార పరీక్ష కేంద్రాల ఏర్పాటు 
* సాగునీటి సౌకర్యం కోసం రూ.40వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు 
* ఈనామ్‌లు రూ.240 నుంచి రూ.500 పెంపు

* రైతులు, గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి 
* నోట్ల రద్దు, జీఎస్‌టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో అతి గొప్ప మార్పునకు పునాది పడింది. 
* ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టాయి.

* దేశ జీడీపీ 2017-18లో 7.6 శాతం, 2018-19లో 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. 
* మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన దిశగా బడ్జెట్‌ రూపొందించాం. 
* ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల విధానాలు సరళీకరిస్తున్నాం.

* ఈ బడ్జెట్‌ ద్వారా మూడు సంస్కరణలు తీసుకొచ్చాం. బడ్జెట్‌ను ఫిబ్రవరికి మార్చాం. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపాం. 
* ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంలా కాకుండా రంగాల వారీగా బడ్జెట్‌ రూపొందించాం. 
* రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం.

* 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. 
* ఈ ప్రభుత్వం సంపూర్ణ పారదర్శక విధానాలను అమలు చేస్తోంది. 
* విదేశీ మారక ద్రవ్యనిల్వలు 361 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

* భారత్‌ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. 
* ద్రవ్యోల్బణాన్ని రెండంకెల నుంచి కనిష్ఠస్థాయికి తగ్గించాం. 
* నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశాం. నల్లధనంపై యుద్ధం ప్రకటించాం. అవినీతిని నిర్మూలిస్తాం.

Your life flashes before your eyes moments before death, study confirms

తులసి తినాల్సిందే!


• తులసి తినాల్సిందే!
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా..
కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి. అసలు తులసి ఎలాంటి అనారోగ్యాల్ని దూరం చేస్తుందంటే..
 తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.

* ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్‌లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.

* దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి.. అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.

* అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.

* తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.

* తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.

Careful Popping balloons can cause permanent hearing loss

I really needed this right now ❤

Beacuse there is someone watering that grass everyday with love

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

    

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

33) గోపుర దర్శనం తప్పక చేయాలి.

34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.