Pages

Showing posts with label useful info. Show all posts
Showing posts with label useful info. Show all posts

Wednesday, January 4, 2017

మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక చాంధస ఆచారం అని ఆడుపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్య వంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలి వేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
ఆచార హీనాః నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోండి.
(మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకు పోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే.)

మడి అంటే ఏమిటి?

మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి.  నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.

మడి ఎలా కట్టుకోవాలి? :

రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ( 11 లోపు ) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం.  ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండేముల మీద ఇంటిలో గానీ లేక  ఆరు బయట గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల  అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )  మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడి గుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట / పూజ చేయ వలెను. మడితో నే  సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు.  ( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.

మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు.  ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు వస్త్రము.  

మగ వాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని  గానీ, ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ లో పావడా తో  గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట వలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.  ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవ్వాలి. మనల్ని మనము కాపాడు కోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవము లోకి వస్తాయి.

  నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

శుభంభూయాత్!

హిందూ ధర్మములో కలియుగము లో వుండే రాక్షసుల గురించి ఈ కింది విధముగా చెప్పబడినది.
హిందూ ధర్మములో కలియుగము లో వుండే రాక్షసుల గురించి ఈ కింది విధముగా చెప్పబడినది.

1. చుట్టూ ఉన్నవారికి కంటకముగా మారినవాడు.

2. యుక్తాయుక్త విచక్షణ లేక చెప్పుడు మాటల విని ఇతరులను రాక్షసముగా పీడించేవాడు.

3. ఇతరులను ఆకారణముగా దుషిస్తూ ధర్మ సూత్రములు వల్లించేవాడు.

4. సహాయం పొందుతూ కూడా కృతజ్ఞత చూపకుండా నిందలు వేసేవాడు.

5. శరీర కష్టం లేకుండా తిని పడుకునే సోమరిపోతు.

6. దయ చుపినవాడిని మాటలతో కుల్లపోడుచువాడు.

7. తన సంతానమును ఆకారణముగా దూషించు వాడు.

8. వావి వరసలు లేక మ్రుగామువలె తన సోదర/సోదరిల  యొక్క భార్య/భర్తలను తిట్టువాడు.

9. తన మంచి కోరి చెప్పిన విషయాలను తనని చులకన చేయుటకు చెప్పిన విషయలుగు నిందలు వెయ్యువాడు.

10. ఎంత సేవ చేసినాను తనకు ఎవరు ఏమి చేయుటలేదని ఏడ్చువాడు.

11. జీవితము మీద ముందు చూపుతో ఇతరులు చేసుకునే కష్టాన్ని హేళన చేసేవాడు.

12. చెడ్డ భార్య మాటలు విని కన్నా తల్లిని దూషించి కొట్టేవాడు.

13. ఇతరుల వస్తువులను తన అవసరానికి వాడుకొని, అవసరము తీరిన తరవాత ఆ వస్తువు నాసిరకముదని, మోసపురితమైనదని దురద్రుష్టకరమైనదని నిందలు మోపేవాడు. 

15. తనకు సంబంధించిన కార్యక్రమాలకు అందరు సంతోషముగా కులిలవలె సేవలు చెయ్యాలి కాని ఇతరులకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమూ ఎవరో చచినట్టు మోహము పెట్టుకొని కుర్చునేవాళ్ళు. ఎ సహాయము చేయ్యనివాళ్ళు.

16. మోహము మీద చిరునవ్వు కూడా లేకుండా బ్రతికేసేవాడు.

17. తన చాతకాని తనము వల్ల  ప్రపంచము మీద పగ పెంచుకునేవాడు.

18. తనకు కోపం వచినప్పుడు అందరు భయపడాలి తనకు సంతోషం వచినప్పుడు అందరు సంతోషముగా వుండాలి అనుకునేవాడు.

19. పట్టరాని కోపముతో ఇతరులను ఎల్లప్పుడూ దుషిస్తూ, ఇతరులు మాత్రం ఏమి జరగనట్టు సాదారనముగా వుండాలి అనుకునేవాడు. పైనుండి అట్లా ఉండని వాళ్ళు తనని చులకనగా చూస్తున్నారని నిందలు మోపేవాడు.

20. ఏ క్షణానికి ఆ క్షణం బురదలో దొరిలే పంది వలె గడిపేస్తూ, కొంచము కూడా మూడు చూపు లేకుండా  గడిపేసే పశువు వంటి వాడు.

21. ఇతరులు జీవితమున సంతోషముగా వుంటే అధర్మము చేస్తున్నారని నిందలువేసేవాడు.

22. అన్నం పెట్టె చేతిని కాల్చేవాడు.

23. కనీస ప్రయత్నము చెయ్యక తనకు తగనివారి తో పోటి పడి, వారిని దుషించేవాడు.

24. తనకున్న శారీరిక రోగమును అడ్డము పెట్టుకొని అందరిని బెదిరించేవాడు.

25. నిత్యము కోపము ఆశనముతో రగిలిపొఎవాదు.

26. ఆకారణముగా ఇతరులను బూతులు తిట్టేవాడు.

హిందూ ధర్మము ప్రకారము కలియుగములో ప్రత్యక్షముగా రాక్షసులనే వారు వుండరు కాని, పైన చెప్పినట్టి వారు రాక్షసులకంటే క్రురమైనవారని, వారిని రాచపుండుతో సమానముగా చూడాలని చెప్పబడి వున్నది.

కావున తస్మాత్ జాగ్రత్త...!!!

Monday, December 26, 2016

రాముడు సీతనెందుకు వదిలేసాడు?

రాముడు సీతనెందుకు వదిలేసాడు?

తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు.

పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది.

పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు.

పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.

సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.

ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.

అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.

శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.

”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.

శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.

ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు.

కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!

ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు.

ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!

--- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి ప్రవచనం నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

హనుమాన్ చాలీసా ఎలాపుట్టింది? ఎందుకోసం?

హనుమాన్ చాలీసా ఎలాపుట్టింది? ఎందుకోసం?
వారణాసిలోనివసిస్తూవున్నసంత్ తులసీదాస్ రామనామగాననిరతుడయిబ్రహ్మానందములో తేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.
ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవ్వాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది.
శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.
దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.
ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.
తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీరామనామము ,మీరుచెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.
రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదు\షా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను .రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సిమ్హద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ …… జయ హనుమాన జ్ఞాన గుణసాగర………… అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమ్ కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది.
ఈ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా శ్లోకాల యొక్క భావసహితముగ  తెలుసుకుని స్వామి క్రుపకి పాత్రులు అవుదాము
జై శ్రీ దుర్గా నారాయణి🙏