Sunday, February 5, 2017
మన భారతదేశంలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
మన భారతదేశంలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
ప్రపంచంలోనే భారతదేశంలో అనేక మిస్టీరియస్ సన్నివేశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. భారతదేశంలో ప్రతీది ఒక మిస్టరీనే తలపిస్తుంది.
సంపన్నమైన పురాణగాధలు, అపార పరిమాణం, మరిచిపోలేని ఇతిహాసాలకు పుట్టినిల్లు భారతావని. కొన్ని చూసి తరించేవి అయితే.. మరికొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేవి. మరికొన్ని సందేహాలతో సతమతపెట్టేవి చాలా ఉన్నాయి.
: హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ.. మిస్టరీతో మిలితమై ఉన్నాయి. ఎవరికీ అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు, కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మీలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు తీసుకొచ్చే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం..
పంజాబ్ లోని మోహాలి జిల్లాలో ఉంది .
...గురుద్వార. ....
1659లో సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇక్కడున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా.. మామిడి పండ్లు ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న .......యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెద్ద నందీశ్వరుడి విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వస్తోందని భక్తులు నమ్ముతారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు ఆలయం ప్రాంగణం అంతా వ్యాపించిందని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాయి స్వభావం పెరిగే తత్వం కలిగి ఉందని.. ఆ రాయి 20 ఏళ్లకు 1 ఇంచు పరిమాణం పెరుగుతుందని పురావస్తు శాఖ సర్వే తెలియజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం.
తంజావూర్ లోని శివాలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయమంతా గ్రానైట్ స్టోన్స్ తోనే కట్టారు. అది కూడా అక్కడ దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడా స్టోన్ లభించేది కాదు. 216 అడుగుల అతి పెద్ద నిర్మాణం ఈ తంజావూర్ ఆలయం. ఆలయ సమీపంలో ఎలాంటి సదుపాయాలు లేవు. పెద్ద గాలి, వర్షాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినా కూడా వెయ్యి ఏళ్ల క్రితం ఈ ఆలయం ఇంత పెద్దగా.. ఎలాంటి మెటీరియల్ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ.
తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి అయిన ప్రాంతాలలో. .... పూరి .......నాలుగోది. ఛార్ ధామ్ క్షేత్రాలలో ఇదొకటి. విష్ణువునే ఇక్కడ జగన్నాథ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రతిమ రాయి కాదు... వేప బెరడుతో తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని బ్రహ్మ అంటారు. ఈ విగ్రహాలను 12 ఏళ్లకొకసారి అంటే నబ కళేబర ఉత్సవ సమయంలో మారుస్తారు. అదే ఇక్కడున్న స్పెషాలిటీ.
మహారాష్ర్టలో ఉన్న శని షింగాపూర్ చాలా ఫేమస్.
ఎందుకంటే ఈ ఊళ్లో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవు. తలుపులు లేకపోయినా.. ఇంతవరకు ఎప్పుడూ దొంగతనాలు కూడా జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లకు శని దేవుడే శిక్ష విధిస్తాడని గ్రామస్తుల నమ్మకం. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే.. 2011లో ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ప్రారంభించారు. అది కూడా ఎలాంటి తాళం లేకుండా. దేశంలో మొదటిసారి ఇలాంటి విశేషం జరిగింది.
కైలాస ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది.
దీని నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి కట్టడమైనా.. పునాది నుంచి మొదలవుతుంది. కానీ.. కొండలనే శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.
మహారాష్ర్టలోని షోలాపూర్ జిల్లా షేప్టాల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా... పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు
. ఉత్తరప్రదేశ్ లోని సితాపూర్ జిల్లాలోని.
.... ఖబీస్ బాబా ఆలయం ... చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.. పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి.. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.
శ్రావణబెళగలలోని గోమతేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాతితో ఈ విగ్రహాన్ని చెక్కడం విశేషం. 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. గోమతేశ్వర జైనుల గురువు.
అమ్రోహా ఉత్తరప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం షార్ర్ఫుద్దీన్ షా విలాయత్ గా ప్రసిద్ది చెందింది. ఈ పుణ్యక్షేత్రం మతాధికారి ఆలయ రక్షణగా తేళ్లను పెట్టారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకోవచ్చు. కానీ అవి వాళ్లకు ఎలాంటి హాని చేయవు. అదే ఇక్కడి స్పెషాలిటీ.
మమ్మీస్ ....
అంటే అందరికీ ఈజిఫ్టే గుర్తొస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది. సంఘా టెంజింగ్ అనే టిబిట్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చొని ఉంది. అది కూడా చెక్కుచెదరని చర్మం, జుట్టుతో ఈ మమ్మీ కనిపిస్తుంది.
Saturday, February 4, 2017
Excellent story
Excellent story
కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు
వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
ఏమి చేస్తాడు .?
ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
కారులో పెట్టాడు ..
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
అదొక చిన్న హోటల్ .
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
తేవడానికి వెళ్ళింది .
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
సహాయపడు . " అని రాసి ఉంది..
ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు .
ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..
మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!
మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.. థాంక్స్..🙏🙏🙏
Iam not the writer ... Received from one of the friends... Message is good Hence forwarding as received....
*********** "రాయలసీమ" చరిత్ర...!! ((కొన్ని వాస్తవాలు..!!)) ************
*********** "రాయలసీమ" చరిత్ర...!! ((కొన్ని వాస్తవాలు..!!)) ************
.
►►ప్రపంచంలోనే ఎర్ర చందనం పెరిగే ఏకైక ప్రాంతం..
దక్షిణ నల్లమల , శేషాచలం అడవులు..ఇది పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం..!!
.
►►కలివి కోడి (Jordon’s courser) భారతదేశంలోని
Critically Endangered పక్షులలో ఒకటైన
"కలివికోడి" చివరి ఆవాసం (ప్రపంచంలోనే ) కడప జిల్లా లంకమల అభయారణ్యం..!!
.
►►ప్రపంచంలోనే అతి పెద్ద బైరటీస్...
నిల్వలు ఉన్న ప్రాంతం కడప జిల్లా మంగంపేట గనులు
.
►►ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్-కడప జిల్లాలో...
మొదలయ్యి ఉత్తరాదిసగా వ్యాపించింది అన్నది Anthropologists ల మాట..!!
.
ఆధ్యాత్మిక ప్రపంచం..!!
-------------------------
►►తిరుమల వెంకన్న గుడి ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం..!!
►►రాయలసీమ లో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైల మల్లికార్జునుడు )
►►ఒక పంచభూత లింగం (శ్రీకాళహస్తి –వాయు లింగం )
►►అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక )
►►నవ నారసింహ క్షేత్రాలలో రెండు
(కదిరి లక్ష్మీ నరసింహ స్వామి మరియు అహోబిలం నరసింహ స్వామి ) కలవు..!!
►►ప్రపంచంలోనే అతి పురాతన లింగం
(మొట్టమొదటి లింగం ) చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో కలదు..!!
.
మరొకొన్ని..!!
---------------
►►తెలుగు భాష మొదటి శాసనం – కడప జిల్లా కలమళ్ళ శాసనం
►►మన జాతీయగీతం మన మదనపల్లి లో రాయబడింది
►►తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క
►►దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు – మన శ్రీశైలం టైగర్ రిజర్వు
►►కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణభారతంలో అతి పెద్ద చెట్టు
►►కడప జిల్లాలో దేశంలోనే అతి పెద్ద Crysotile Asbestos నిల్వలు కలవు..!!
►►తెలుగు సినిమా పుట్టినిల్లు మన సురభి గ్రామం (కడప జిల్లా )
►►ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై
తిరిగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు
►►కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశంలోనే రెండవ పెద్ద గుహా సముదాయాలుగా
పేరుపొందాయి .వేర్పాటు వాదుల ఖిల్లా గాలివారి పల్లె,రాజంపేట సరేసరి...!!
►►ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా ..
.
రాయలసీమ గురించి ఇంకా చెప్పాలంటే...!!
----------------------------------------------
వేమన్న పద్యం...!!
అన్నమయ్య కీర్తన...!!
మొల్ల రామాయణం...!!
వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం...!!
కన్నప్ప భక్తీ...!!
అష్టదిగ్గజ వైభవం...!!
రాయల రాజసం...!!
బుడ్డా వెంగల్ రెడ్డి దాతృత్వం...!!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం...!!
తరిగొండ వెంగమాంబ భక్తి...!!
గడియారం వెంకటశేష శాస్త్రి...!!
పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం...!!
లక్కోజు సంజీవ రాయ శర్మ మేధస్సు...!!
జిడ్డు కృష్ణమూర్తి తత్త్వం నా తల్లి రాయలసీమ...!!
సంస్కృతీ కళల పట్టుగొమ్మ...!!
.
ఇలా ఎంతో వైభవంతో..ఉన్నంతంగా..కీర్తించబడిన నేల..!!
మరెంతోమంది గొప్ప గొప్ప వారిని ప్రపంచానికి పరిచయం చేసిన గడ్డ రాయలసీమ సీమ..!!
భీష్మతర్పణ విధి - భీష్మాష్టమి:
భీష్మతర్పణ విధి - భీష్మాష్టమి:
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం.
శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
తర్పణము
1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)
పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
An old man lived alone in an American town. His only son was in prison. The old man wrote a letter to his son.
Dear Son,
I am feeling pretty bad because it looks like I won’t be able to plant my potato garden this year. I’m just getting too old to be digging up a garden plot. If you were here, all my troubles would be over. I know you would dig the plot for me, if you weren't in prison.
Love,
Dad
Shortly, the old man received this telegram:
‘For Heaven’s sake, Dad, don’t dig up the plot. That’s where I buried the GUNS !!’
At 4 a.m. the next morning, a dozen FBI agents and local police officers showed up and dug up the entire garden without finding any guns. Confused, the old man wrote another note to his son telling him what had happened, and asked him what to do next.
His son’s reply was: ‘Go ahead and plant your potatoes, Dad. It’s the best I could do for you, from here.’😇
MORAL:
NO MATTER WHERE YOU ARE IN THE WORLD, IF YOU HAVE DECIDED TO DO SOMETHING DEEP FROM YOUR HEART, YOU CAN DO IT. IT IS THE THOUGHT THAT MATTERS, NOT WHERE YOU ARE.