Pages

Sunday, February 5, 2017

*మంచికథ......*

*మంచికథ......*

ఒక సారి *ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యుని*దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష *(Triple Filter Test)"* అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ *"నిజం"* - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ *"మంచి "* - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,

"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ *"ఉపయోగం"* - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది* కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, *మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.*
*శుభంభూయాత్ః...*🙏🏻

Bullying causes long-term mental health problems.

నాటు కోడి షోరువా

నాటు కోడి షోరువా

కావలసిన పదార్థాలు:

చికెన్: 750 గ్రా
మిరప్పొడి: మూడు టీ స్పూన్లు(కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు)
పసుపు: ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున(కడిగిన చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి పక్కన ఉంచాలి)
నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు
కరివేపాకు: రెండు రెమ్మలు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 100 గ్రా
కాశ్మీరీ మిరప్పొడి: రెండు టీ స్పూన్లు
మసాలా పౌడర్: 4 స్పూన్లు
ఉప్పు: తగినంత
కొత్తిమీర: గుప్పెడు(సన్నగా తరగాలి)

తయారీ:

నాన్స్టిక్ పాన్లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తరవాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి. ముక్కల్లో ఎరుపుదనం పోయి నీరు వెలువడడం మొదలయ్యాక మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి. మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. ఇది అన్నం, గారెలలోకి బాగుంటుంది.

మసాలా పౌడర్ తయారీ:

ఆరు స్పూన్ల ధనియాలు, పది లవంగాలు, ఎనిమిది ఏలకులు, దాల్చినచెక్క, రెండు అంగుళాల ముక్క, స్టార్ లవంగం ఒకటి, పాపీసీడ్స్ రెండు టీ స్పూన్లు తీసుకుని పొడిచేయాలి.

Rare footage of some extinct animal species

Fire ants assemble together to create unsinkable rafts during heavy floods

Here is how surgeons perform knock knee correction surgery

This device gives you super strength to lift heavy items