Pages

Wednesday, February 8, 2017

పూజ

పూజ

పూజకు ఏమీ వస్తువులు కావలయును మరియు ఎలా చేయాలి ?

* ప్రాతః కాలములోనే నిద్రలేవాలి, లేచి కాలకృత్యములు పూర్తిచేయలి. తర్వాత స్నానముచేసి (Dress Code పాటించాలి) శుభ్రమైన పొడి వస్త్రము (ధోవతి) ధరించాలి, ఉత్తరీయమును నడుముకు కట్టుకోవాలి. హృదయము పైన ఎలాంటి వస్త్రమూ (బనియను, చొక్కా లాంటివి ధరించరాదు) వుంచుకొనరాదు. వారివారి సాంప్రదాయమును అనుసరించి నుదుటిభాగమును (విభూదితో కానీ చందనముతో కానీ తిరుమణితో కానీ శ్రీ చూర్ణముతో కానీ) తిలకధారణ చేయలి. తిలకధారణ (ముఖాన బొట్టు) లేకుండా పూజమందిర ప్రవేశము నిరుపయోగము. మనము నుదుట బొట్టు ధరించడము, మన సనాతన ధర్మములపట్ల, వేదములపట్ల, పునర్జన్మ సిద్ధాంతము పట్ల, నమ్మకమునకు, గౌరవమునకు సూచన. పూజామందిరము ముందు నిలబడి మెల్లగా చప్పుడు (మూడు పర్యాయములు మెల్లగా సున్నితముగా చప్పట్లుకొట్టుచూ) చేయాలి. మనము పూజమందిరము తలుపుతీయుటకు స్వామి వారిని అనుమతిమ్మని కోరుతూ ఇలా అనుమతిని కోరుతూ చేయుక్రియ. తర్వాత మెల్లమెల్లగా పూజమందిరము తలుపును తీయలి.

పూజమందిరములోనికి వినయముతో, భయభక్తులతో, అతిజాగ్రత్తగా, వినమ్ర మనస్కులమై లోనకు ప్రవేశించాలి (ఒక అధికారి తో అతి ముఖ్యమైన ఎంతో అత్యవసరమైన పని ఉన్నప్పుడు ఎంతో గౌరవముగా తలుపువద్ద నిలబడి అతివినయము ప్రదర్శిస్తూ (“MAY I COME IN SIR,”) అని అడిగి లోనకు ప్రవేశిస్తాముకదా. మరి మన స్వామి జగత్తు కే అధికారి, ఆ అధికారి గదిలోనికి ప్రవేశించేటప్పుడు, ఎంత జాగరూకతతో ప్రవేశించాలి, ఒకసారి ఆలోచించండి.

అతి జాగ్రత్తగా స్వామివారి సింహాసనమును, పూజామందిరములోని నిర్మాల్యమును (నిన్నటి రోజున మనము స్వామివారికి సమర్పించిన ఫల పుష్పాది తీర్థప్రసాదములను, కుంకుమాది అక్షితాది పూజా వినియోగములను, దీపారాధన సామగ్రిని) అతి సున్నితముగా, భయభక్తుతలతో, తొలగించాలి. తదుపరి పూజామందిరమును శుభ్రముగా శుభ్రపరచాలి.

1. పూజకు సమయ పాలన అతి ముఖ్యమైన అంశము. ఉదయం 6 గం|| పూజ అంటే మనము ఎక్కడ ఉన్నా తప్పకుండా ఉదయం 6 గం|| పూజ ప్రారంబించాలి, అనే నడవడిని మనము మన మనస్సుకు తరఫీదు ఇవ్వాలి. ఉదా :- పదవీ విరమణ చేసిన ఒక సైనికుడు ఇంటికి వచ్చేస్తాడు. (మిలటరీ ఉద్యోగి). అయినా అతడు మరణించే అంత వరకు, మిలటరీలో ఎలా అయితే ఉదయం 4 గం|| నిద్ర లేస్తారో, అదేవిధముగ పదవీవిరమణ చేసి, ఇంటి దగ్గర తన భార్యబిడ్డలతో ఉన్నా, క్రమం తప్పకుండా 4గం|| నిద్రలేస్తాడు. ఎందుకు? అతని మనసుకు కొన్ని సంవత్సరములుగ మిలటరీ వారు ఇచ్చిన ప్రాక్టీసు.

2. పూజకు (పూజ వేళకు) ఉపయోగించడానికి విడి విడిగా పాత్రలలో (పంచ పాత్ర) శుద్ద జలము సిద్దము చేసుకోవాలి. పూజకు ఒక ఉద్దరిణి, పంచపాత్ర, చిన్న గ్లాసులు రెండు , తట్ట, గంట, హారతి పళ్ళెము సిద్దము చేసుకొనవలయును. 3. వారి వారి అభిరుచుల (ఇష్టదేవత/గురూపదేశము) ను అనసరించి అర్చనామూర్తిని సిద్దము చేయవలయును.

ముఖ్య గమనిక:- దైవము యొక్క ప్రతిమగానీ, Photo గానీ సిద్దము చేసుకున్న తరువాత, త్రికరణ శుద్దిగా, పూజ సమయంలో కానీ, పూజానంతరం కానీ, పూజ గదిలో ఉన్నది ప్రతిమ, Photo అనే భావన ఏ పరిస్థితులోనూ రాకూడదు. అక్కడ సింహాసనము పై అర్చనా మూర్తి ఆసీనులైఉన్నారని, అక్కడ కూర్చొని మనలను మన కుటుంబమును ఎల్ల వేళలా, చూచుచూ మనలను కాపాడు చున్నాడని, మరువ రాదు. స్వామి వారు అక్కడకు వచ్చి కూర్చొని ఉన్నారు, అనే భావనతో భయ భక్తులతో పూజ ప్రారంభించాలి.

4.దీపారాధనకు పత్తితో తయారు చేసిన వత్తులను సిద్దం చేసుకోవాలి. దీపారాధనకు యధాశక్తి తైలమును(నూనెను) ఉపయోగించాలి. ఆవు నెయ్యి సర్వశ్రేష్ఠము.

5.ధూపారాధనకు అగరబత్తీలు, ధూప్ స్టిక్కులు, సాంబ్రాణి సిద్దంచేసుకోవాలి. అగ్ని హోత్రము తయారుచేసి సాంబ్రాణి వేయడము శ్రేష్ఠము.

6.పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, గంధము (అంగడిలో అమ్మే గంధము కాకుండా ఇంటిలో సానరాయి, గంధపు చెక్క ఉంచుకుని, నిత్యము గంధము తీసి భగవంతునికి సమర్పించడం సర్వ శ్రేష్ఠము) ఆగరు వత్తులు, హారతికి కర్పూరము, కొబ్బరికాయ (యధాశక్తి) సిద్దం చేసుకొనవలయును.

7. నివేదన నిమిత్తo నిత్యము బెల్లము ముక్కను తప్పనిసరిగా ఉంచవలయును. అలాగే నైవేద్యమునుకు సాత్వికాహారము, సాత్విక పదార్థాము లను, నివేదించవలయును. భగవంతునికి (పూజకు) ఒకటి, మనము భుజించడానికి ఒకటి, తయారు చేయుట నిషిద్దము. భగవంతునికి ఏమి నివేదించుతామో మనము కూడా అదే తీసుకొనవలయును. తర్వాత

గురుపరంపర ప్రార్థన:

శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః
పోదు త్తనియన్లు ప్రాతార్నిత్యాను సంధేయ శ్లోకములు
మణవాళమహామునుల తనియన్ –శ్రీ రంగనాథులు ప్రసాదించినది.

1) శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|
యతీన్దృ ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||
శ్రీ గురుపరంపర తనియన్- కూరత్తాళ్వానులు సాయించినది.

2) లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||
ఎంబెరుమానార్ తనియన్- కూరత్తాళ్వాన్ సాయించినది.

౩. యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|
అస్మద్గురో ర్భగవతోఽ వ్యామోహత స్య దయైకసిన్దోః
రామానుజస్య చరణౌ శరణం ప్రవద్యే ||
నమ్మాళ్వార్ తనియన్- ఆళవందార్ సాయించినది.

4. మతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యాదేవ నియమేన మదన్వయానామ్
అద్యస్య నః కులపతే ర్వకుళాభి రామం
శ్రీమత్త దం ఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా
ఆళ్వారుల తనియన్ – శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది.

5 భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాధ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహన్
భక్తాంఘ్రిరేణుపరకాల యతీన్దృమిశ్రాన్
శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోఽస్మి నిత్యమ్

గురుపరంపర ప్రార్థన తర్వాత
“శుక్లాం భరధరమ్ విష్ణుమ్” శ్లోకం తో ప్రారంభించి ఇష్టదేవతా ప్రార్ధనాశ్లోకాలు పద్యాలు, మంత్రాలు పఠించుచూ పూజ చేసుకోవలయును.
వారివారి సమయభారమునుబట్టి శ్రీ విష్ణుసహస్రనామాలు, శ్రీ లలితా సహస్రనామాలు శ్రద్దాభక్తులతో మనసును స్వామి పదములమీద ఉంచి ఏకాగ్రతతో పఠించి పూజాకార్యక్రమమును చేసుకొనవలయును.
నిత్యాంతరంగ ప్రార్ధన

1. పరమాత్మా నన్ను బ్రాహ్మ ముహూర్తములో (ఉదయం 4 గంటలకు) నిద్ర నుండి లేచి ఈశ్వరారాధనాభిముఖునిగా ఉండునట్లు, నా బుద్ధిని ప్రచోదనము చేయుము. దయా సింధో సర్వకాల సర్వావస్తలయందు, నిన్ను స్మరించు బుద్ధిని నాకు ప్రసాదించు.

2. సత్సాంగత్యము(భగవాన్ భక్తులతో స్నేహము) నిరంతరము కొనసాగునట్లు నన్ను ఆశీర్వదింపుము. అనాయాస మరణము, చివరి శ్వాస నీ ధ్యాసలో ఉండునట్లు అనుగ్రహింపుము.

3. అరిషడ్వర్గములను జయించు శక్తిని, నా బుద్ధికి ప్రసాదింపుము. నిరంతరం పరోపకారమే పరమావధిగా, మానవ సేవే మాధవ సేవ యను భావము, నాలో నిరంతరము కొనసాగించుము.

4. దేహాభిమానమును నాలోని అహమును పారద్రోలుము. ప్రేమతో నా హృదయమును నింపుము. ప్రకృతిలో సకల జీవరాసులలో, పరమాత్మను చూచు భూత దయను, నాకు ప్రసాదింపుము.

5. ప్రతి స్త్రీ యందు మాతృమూర్తిని, పరదేవతను (అమ్మను) దర్శించగలిగే బుద్ధిని, జ్ఞానమును నా బుద్ధికి,మనస్సుకు ప్రసాదించుము.

++++ శిఖ యొక్క ప్రాముఖ్యత ++++

++++ శిఖ యొక్క ప్రాముఖ్యత ++++
సనాతన ధర్మంలో చరించు వారందరూ శిఖను విధిగా ఉంచుకోవాలి. శిఖా
పరిత్యాజముచే తానున్న వర్ణమునుండి ఛండాలుడను ఐదవ జాతికి జారిపడతాడు.
సంధ్యావందనం చేసేటప్పుడు కాని ఇతర మంత్రానుష్టానం చేసేటప్పుడు కానీ
అంగన్యాసంలో శిఖాయైవశట్ అన్నచోట శిఖను ముట్టుకోవాలి. అది లేకపోతే ఇక
అంగన్యాసం పరిపూర్ణమెలా అవుతుంది. ఒక వేళ ప్రమాదవశాత్తు
క్షురకర్మ చేయించుకునేటప్పుడు శిఖ తొలిగింపబడడం కానీ, లేదా జుట్టు
ఊడిపోయిన వారుకాని అనుష్టానం చేసేటప్పుడు ఒక దర్భను తలచుట్టూ చుట్టుకుని
శిఖలా భావించి అనుష్టానం సాగించాలి. సంధ్యావందనం చేసేవారు తప్పక శిఖ
ఉంచుకోవాలి. గాయత్రార్హత పొంది శిఖ, యజ్ఙోపవీతంలేనివాడు ఛండాలుడే.
శిఖలేనిదే వైదిక కర్మ ఆచరించినా వ్యర్థమని శాస్త్రవాక్కు. కాబట్టి శిఖ
ముఖ్యాతిముఖ్యము.
"గాయత్రాతు శిఖాం.............బద్ధ్వాతతః కర్మసమార భేత్''
అను ధర్మం ప్రకారం వైదిక కర్మ ప్రారంభమునకు ముందు శిఖను బంధించవలెను.
వేంకటాచల మహాత్మ్యం లోని ఉదంతం కూడా అదే చూపుతుంది. ఛండాల స్త్రీని
కోరుకున్నవాడు ఛండాలుడుగా మారడానికిగాను ఆ స్త్రీ చెప్పినట్టు శిఖా
పరిత్యాగం, యజ్ఙోపవీత పరిత్యాగం చేసి ఛండాలుడుగా మారుతాడు. అందుకే
శిఖలేకుండా సంపూర్ణ ముండనం చేయించుకోరాదు.
కనీసంలో కనీసం పన్నెండు కన్నా ఎక్కువ వెంట్రుకలను కూర్చి శిఖగా
పెట్టుకోవాలి. పెద్దగాలేకున్నా మామూలు జుట్టులో కలిసిపోతుంది. అందరూ శిఖ
ఉంచుకోవడం విధి, ఇప్పటి వరకూ ఎవరైనా అది ఉంచుకోక, ఇప్పటినుండి
ఉంచుకోవాలనుక్కున్నా చక్కగా ఉంచుకోవచ్చు. తెలియని తనాన్ని భగవంతుడు
క్షమిస్తాడు.
శిఖ యొక్క ప్రధాన్యత,వైద్యపరంగా వివరించబడింది.శరీరంలో మంత్ర-అనుష్టానలచేత గాని, అతి వాతము వలన కాని ప్రోగుపడిన అతిఎక్కువ విద్యుదావేశాన్ని బయటకు పంపే వొక యాన్తెన్నా/ఏరియల్ గా శిఖ పని చేస్తుంది .అంటే పరోక్షంగా శరీరంలో వీర్యకణాల ఉత్పత్తికికి అనువైన శారీరక ఉష్ణోగ్రతను శిఖ ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా వేదం చదివే వారి వారి దేహ ఉష్ణోగ్రత కొంచం ఎక్కువగా ఉంటుంది. దీనిని సమతుల్యం చేయడానికే శిఖిని పెట్టుకోమన్నారు పెద్దలు.
చాగంటి వారు తమ ప్రవచానాల్లో శిఖ గురించి తెలియజేస్తూ బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు.

* గాయత్రి దేవి అంటే ఎవరు..?

* గాయత్రి దేవి అంటే ఎవరు..?
* గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...
* మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ....
* తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ...
.
.
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం :..
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
.
గాయత్రి మంత్రాక్షరాలు :..
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

*సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం..!!*

*సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం..!!*

సనాతన ధర్మశాస్త్రరీత్యా స్త్రీ ప్రకృతి స్వరూపినిగాను ధరణి(భూమాత) గాను గౌరవించటం పూజించటం జరిగింది..!
పరమాత్మ సైతం తనను రెండు భాగాలుగా విభజించుకుని అందులో రెండవ సగభాగం పరాశక్తికి ఇచ్చాడు..
నారాయణుడు సైతం లక్ష్మిని తన వక్షస్థలమున నిలిపాడు..!!

స్త్రీలందరూ మహా ప్రకృతియొక్క అంశలతో పుడతారని వారిని గౌరవించటం మన ధర్మమని..!
స్త్రీని దేవి స్వరూపంగా భావించి గౌరిపూజ కుమారిపూజ వంటి పూజలతో వస్త్రాలు అలంకారాలతో అర్చించటం పుణ్యప్రదమని మన సనాతన సంస్కృతి తెలుపుతుంది..!!

ధర్మార్థకామ్యమోక్షార్ది అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పితృఋణం.. దేవ ఋణం .. ఋషి ఋణాలనుండి ముక్తుడవుతాడు..
పురుషునకు సంతాన భాగ్యాన్ని విశేష గౌరవాన్ని అమృతత్వాన్ని ప్రసాదించేది భార్య మాత్రమే..!!

*"సఖా సప్తపదాభవ"*

స్నేహితలువలే ఇద్దరి మనసులు ఒక్కటికావాలి
ప్రేమానురాగాలతో జీవనం సాగించాలని కోరతారు..
వివాహ బంధంతో స్త్రీ తన జీవితాన్ని భర్తకు అర్పించటం మాత్రమే కాదు..
పురుషుడు సైతం తన సర్వస్వాన్ని తన జీవిత భాగస్వామికి అందిస్తాడు..!!

*"మూర్దానాం పత్యునారోహ"*

జీవికి శిరస్సు ఎంత ప్రధామైనదో
పురుషునకు స్త్రీ కూడా శిరస్సువలే ప్రధానమైనది..
శిరస్సు లేకుండా జీవించటం ఎంత అసాధ్యమో
భార్య లేని పురుషుడు కుడా శిరస్సు లేనటువంటి వాడే..!!

*"మమ హృదయే హృదయంతే అస్తు"*

నా హృదయం లో నీ హృదయం నా చిత్తం లో నీ చిత్తం మమేకమై ప్రేమభావముతో జీవించెదరు..!!

*" కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి "*

దాసిగా సేవచేస్తూ.. మంత్రిగా సూచిస్తూ.. తల్లిగా పాలిస్తూ.. రంభగా లాలిస్తూ.. ధరిత్రిగా క్షమిస్తుంది భార్య..!!
అనేక విధాలుగా భర్తకు సేవ చేస్తుంది ..
సేవ చేస్తుందని సేవకురాలు కాదు తానే ఇంటి యజమానురాలు..!!
తల్లిగా సేవచేసే లక్షణం వారికి జన్మతః వస్తుంది
కనుకనే ప్రతీ స్త్రీలో మాతృమూర్తిని చూడగలుగుతున్నాం..!!

దేవ ఋషి పితృ ఋణాలు తీర్చవచ్చునుగాని
మాతృఋణం తీర్చలేనిది
చెడ్డ కొడుకు పుట్టవచ్చునేమో కాని చెడ్డ తల్లి ఉండదు
తల్లిని వదిలేసిన సంతానం ఉంటుందిగాని
తల్లి వదిలేసిన సంతానం ఎవరు ఉండరు..!
మోక్ష మార్గాన్ని చూపే గురువుకన్నా
మోక్షస్వరూపమైన తండ్రికన్నా
జన్మనిచ్చిన తల్లి భుమికన్నా విలువైనది
తల్లిని పూజించటం కంటే గొప్ప పూజంటు లేదు..!!

*ఉపనయనంలో ముందుగా తల్లికే మాతృభిక్ష యాచించటం జరుగుతుంది .. సన్యాసించిన వారు ఎవరికి నమస్కరించకూడదు కాని తల్లికి నమస్కరించాలి... తల్లి ఋణం తీర్చలేనిది.. తల్లి శాపం త్రిప్పలేనటువంటది అనుభవించక తప్పదు.. తల్లిని గౌరవించకపోయినా హీనంగా చూసినా లేదా వృద్ధాప్యం లో వదిలేసిన రౌరవాది నరకాలు తప్పవని శాస్త్రాకర్తలు వాక్యానించారు..!!*

*" యత్ర నార్యస్తు పూజ్యంతే రమ్యతే తత్ర దేవతాః"*

ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో(గౌరవించబడతారో) అక్కడ దేవతలు క్రీడిస్తారు (సంతోషంగా నివసిస్తారు)..!!

*"కలకంఠి కన్నీరొలికిన సిరియింటనుండనొల్లదు సుమతీ"*

స్త్రీ కంట కన్నీరు వచ్చిన క్షణం గృహంలో లక్ష్మి నివసించదు

*"సగృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే గృహంతు గృహీణీహీనం అరణ్యం సదృషం భవేత్"*

స్త్రీ గృహంలో నివసిస్తుంది కనుకనే గృహము అనబడింది
స్త్రీ లేని గృహం అరణ్యంతో సమానం..!!

స్త్రీని అగ్నితో పోల్చారు..
అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్రమైనది ..
పరస్త్రీ ని తల్లిగా చెల్లిగా చూడాలని..
తల్లి అని సంబోధించాలని మన సంస్కృతి తెలుపుతుంది..!!

స్త్రీ దేవతలను పూజించే ఆచారం ఏ సంస్కృతిలోనైనా ఉందా అంటే అది కేవలం సనాతన ధర్మానికి మాత్రమే సొంతం..!!
స్త్రీలకు ఇంతటి గౌరవాన్నందించిన సనాతన ధర్మంలో జన్మించిన ప్రతీ ఒక్కరు ధన్యజీవులే కదా..!!

Potential blood test for Multiple Sclerosis has been discovered

This device can clean your blood from toxins and deadly germs

This scanner can detect breast cancer within 5 minutes