Pages

Saturday, February 11, 2017

ఎందుకు నేను హిందువును ? పార్ట్ -3

ఎందుకు నేను హిందువును ?
పార్ట్ -3
అతను ఆమె స్థితిని, విశ్వాసం మీద ఆమెకున్న అవగాహనను   గ్రహించాడు.
నువ్వు ఇప్పుడు లీడింగ్ లో ఉన్న ఒకే దేవుడు ఒకే మతం అనే  మతాలతో హిందుత్వాన్ని పోల్చి చూడ వద్దు అని చెప్పి,అతను హిందుత్వము గురించి చెబుతున్నాడు.
ఒకే దేవుణ్ణి నమ్మేవాడు హిందువే.
ఎక్కువ మంది దేవీ దేవతలను నమ్మేవాడు హిందువే.
అదే కాదు దేవుణ్ణి నమ్మని వాడు హిందువే.
ఒక నాస్తికుడు కూడా హిందువే.
ఇది వినే సరికి ఆమె నోట మాట రాలేదు.ఇదో ఒక వింతగా ఆమెకి తోచింది.ఆమెకి అంతు చిక్కడం లేదు.ఊహకి అందడం లేదు.  ఒక క్రమమైన  వ్యవస్థ లేని, ఒక మూస పద్ధతిలో లేని  మతం వేల సంవత్సరాలు విదేశీ మతాల దాడులను తట్టుకుని ఇంకా బ్రతికి బట్ట కట్టింది.
నాకు ఇది అర్ధం కావటం లేదు , ఆశ్చర్యంగా ఉన్నది ,ఉత్సుకతతో అడిగింది అతనిని.
మీకు మతం ఉన్నదా ?అతను ఆమెకి ఏమీ చెప్పాడు ?
అతను చెబుతున్నాడు
నేను ప్రతి  రోజూ దేవాలయానికి నియమముగా వెళ్ళను.
నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న భక్తితో చేసే స్తోత్రాలను నేను ప్రతి రోజు రెగ్యులర్గా  చేయను.కానీ నేను వాటిని అప్పుడప్పుడూ వాటిని చెపుతూ ఆనందంగా ఉన్నాను.
ఆనందమా ?మీరు దేవుడికి భయపడరా ?అని ఆమె అడిగింది.
దేవుడు నాకు స్నేహితుడు.నేను దేవునికి భయపడను అని అతను చెప్పాడు.ఎవరు కూడా నన్ను పూజా పునస్కారాలు,స్తోత్రాలు చేయమని  బలవంత పెట్టెలేదు.
ఆమె విని కొంచెంసేపు ఆలోచించి అతణ్ణి అడిగింది.మీరు ఎప్పుడైనా ఇతర మతాలలోకి మారాలని ఆలోచించారా? అని  ఆమె అడిగింది అతనిని.
నేను ఎందుకు మారాలి ?ఒక వేళ నేను హిందుత్వంపై నమ్మకాన్ని గానీ ,నా గ్రంధాల గురించి కానీ నాకు నమ్మకం లేదని నేను ప్రశ్నించినా ?నన్ను ఎవరూ ఏ ఇతర మతాల లోకి మార్చ లేరు.నేను  హిందుత్వంను హిందువుగా స్వతంత్రంగా ప్రశ్నించే నా హక్కును నాకు హిందుత్వం ఇచ్చింది. ఎవరు నామీద  కండిషన్ పెట్టలేరు.నేను స్వతంత్రుడను.నేను ఎవరి బలవంతమీద గానో ,ఒత్తిడి చేయటం వలన గానో,ఏదో ఛాయిస్ గానో తప్పదు గాబట్టి  నేను హిందువుగా ఉండలేదు.నేను నా ఇష్టంతోనే హిందువుగా ఉన్నాను.అతను ఆమెకి చెప్పాడు.
హిందుత్వం ఒక మతం కాదు ,ఇది విభిన్న నమ్మకాలు ,ఆచరణలు ఇందులో ఉన్నాయి. క్రైస్తవం ,ఇస్లాం లాగా హిందుత్వం ఒక మతం కాదు.వాటిలాగా హిందుత్వాన్ని ఎవరో ఒక వ్యక్తి  స్థాపించలేదు ,క్రైస్తవం ఇస్లామ్ లాగా ఎవరూ దీనిని  కంట్రోల్ చేసే కంట్రోలింగ్ బాడీ ఏది లేదు.అని అతను ఆమెకి చెప్పాడు.
అందువలన నువ్వు దేవుణ్ణి నమ్మవు నువ్వు? అని అంది ఆమె.ఆమెకి అన్నీ తేట తెల్లము గా తెలుసుకోవాలని అనుకుంటున్నది.
నేను అలా దేవుణ్ణి నమ్మను అని చెప్ప లేదే.నిజమైన దేవుణ్ణి , దైవత్వం గురించి నేను నమ్మను అని చెప్పలేదే.
మా పురాణాలు,శృతులు, స్మృతులు వేదాలు ,ఉపనిషత్తులు , భగవద్గీత చెప్పాయి.భగవంతుడు ఉండని ,లేకపోని. పరబ్రహ్మ అనే సూపర్ అథారిటీ ఐన సుప్రీమ్ పవర్ ఐన ఈ బ్రహ్మాండాన్ని(సమస్త ప్రపంచాన్ని ) సృష్టించిన  ఆ పరబ్రహ్మను మేము ప్రార్దన చేస్తూనే ఉంటాము.అని అతను చెప్పాడు.
ఆమె :మీరు ఎందుకు ఒక వ్యక్తిని దేవునిగా నమ్మరు.
అతను :మేము ఒక దేవుడు అకాశాములో మేఘాల వెనుక  రహస్యంగా ఉన్నాడని,అతను ఒక దేవదూతని ప్రవక్తని పంపుతాడని ,అతనిని మేము తప్పకుండా కొలవాలని డిమాండ్ చేస్తాడని ,అలా కొలవక పొతే శిక్షిస్తాడని  మేము తలకాయ లేని మాటల్ని నమ్మము ,చెప్పము.అసలు భగవంతుడు అటువంటి పనికిమాలిన విషయాలు నియంత లాంటి చక్రవర్తి లాగా ఇతరులను భయపెట్టి తనను ఆరాధించమని కొలవమని అంటాడుఅని మేము అనుకోము.

ఎందుకు నేను హిందువును ? పార్ట్ -4

ఎందుకు నేను హిందువును ?
పార్ట్ -4
అతను ఆమెతో ఇంకా ఇలా అన్నాడు.ఇటువంటివి అన్నీ అపహాస్యమైనవి ,తక్కువ తత్వం  చదువుకున్న,తక్కువ తత్వం  తెలిసిన ,ఊహా జనిత మానవులు చెప్పే మానవుల హిందుత్వం తెలియని వాళ్లు చెప్పే  మాటలు అవి.మొదట్లో అలా హిందువులు , హిందుత్వం ఒక దేవుణ్ణి ,దేవతను వ్యక్తిగతంగా పూజించినట్లు , కొలిచినట్లు ,ఆరాధించినట్లు  కనబడితే కనబడ వచ్చు.మొదట్లో హిందుత్వం అతీత శక్తులను కొలిచినట్లు ,నమ్మినట్లు కనపడవచ్చు.కానీ హిందు తత్వ శాస్త్రం రెండోవైపు ఇటువంటి అతీత ,అతీన్ద్రియ శక్తిని హిందుత్వం త్రోసిపుచ్చుతుంది.

మంచిది.దేవుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నావు.నువ్వు చెప్పావు. నువ్వు ప్రార్ధిస్తానని.ఐతే నువ్వు ఏమని ప్రార్ధిస్తావు? అని ఆమె అతనిని అడిగింది.
లోకాసమస్తా సుఖినోభవంతు.
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః
అని ప్రార్ధిస్తాను అని అతను ఆమె తో చెప్పాడు.
(ఇంకా ఉన్నది )

ఎందుకు నేను హిందువును ?

ఎందుకు నేను హిందువును ?
ఒక హిందువు న్యూయార్క్ ఏర్ పోర్ట్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ఏర్ పోర్ట్ కి ఒక మీటింగ్ లో పాల్గొంటానికి  విమానంలో ప్రయాణిస్తున్నాడు.ఆ విమానం లో ఒక అమెరికన్ యువతి అతనితో పాటు ప్రయాణిస్తున్నడి.ఇద్దరూ కలసి 7గంటలు ప్రయాణించవలసి ఉన్నది.
అతను ఆమెని చూసి ఆశ్చర్య పోయాడు ఆమె అందరు అమెరికన్ లు లాగా కాకుండా ఆమె బైబిల్ చదువుతూ ఉన్నది.కొంతసేపటి తరువాత ఆమె అతనిని చూసి చిన్నగా నవ్వింది అలా ఇద్దరూ మాటలు మాట్లాడుతూ తాను ఇండియన్ అని అతను ఆమెతో అన్నాడు తనిని తాను పరిచయం చేసుకుంటూ.వెంటనే ఆమె అతనిని అడిగింది మీకు ఎవరి మీద విశ్వాసము అని.ఏమిటి ?మీ ప్రశ్న నాకు అర్ధము కాలేదు అని అన్నాడు అతను ఆమెతో.అదేనండి మీది ఏ మతము ?మీరు క్రైస్తవులా ?ముస్లిములా ?
కాదు నేను పై రెండు మతాల కి చెందని వాడను.

ఎందుకు నేను హిందువును? పార్ట్ -2

ఎందుకు నేను హిందువును?
పార్ట్ -2
నేను చెప్పిన సమాధానానికి ఆమె ఆశ్చర్య పోయి ఐతే నువ్వు ఎవరెవు ? నేను హిందువుని అని చెప్పగానే ఆమె నన్ను ఒక బోనులో  జంతువులాగా చూసి.నేను ఏమీ చెబుతున్నానో అర్ధం కానట్లు చూసింది.సాధారణ యూరప్ , అమెరికా పౌరులకి ప్రపంచం లోని ప్రస్తుత  లీడింగ్ మతాలైన క్రైస్తవం ,ఇస్లాం గురించి మాత్రమే తెలుసు.
హిందువు ఏమిటి ఇది ?
ఆమె:మీ మత ప్రవక్త ఎవరు ?
అతను:మాకు మత ప్రవక్త ఎవరూ లేరు.
ఆమె: మీ పవిత్ర  మత గ్రంధం ఏది ?
అతను: మాకు ఒక పవిత్ర  గ్రంధం  లేదు?
కానీ మాకు వందల,వేల  పవిత్ర ఆధ్యాత్మిక  గ్రంధాలు ఉన్నాయి.
ఆమె: ఐతే కనీసం  మీ దేవుడి గురించి చెప్పండి ? అతను మీరేమని అడుగుతున్న్నారు. అదే  క్రైస్తవుల కి క్రీస్తు ,ముస్లిము లకి అల్లాహ్ లాగా మీకు కూడా ఒక దేవుడు లేడా ?
అతను కాసేపు ఆలోచించాడు.
ముస్లిములు ,క్రైస్తవులు వాళ్ళ మతాలలో  ఒకే ఒక మగ  దేవుణ్ణి  మాత్రమే  నమ్ముతారు.వాళ్ళ దేవుడు మాత్రమే శ్రద్ధతో  ఈ మానవులను సృష్టించాడు అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నమ్మకం వాళ్ళ బుఱ్ఱ అంతవరకే పరిమితం.

ఆమె , ఆమెలాగానే  హిందుత్వం గురించి  తెలియని వాళ్ళందరూ
ఒక మతానికి ఒక దేవుడు ,ఒక పవిత్ర గ్రంధం ,ఒక ప్రవక్త ఉండాలి అని అనుకుంటారు.వాళ్ళ బుర్రలో ఆలోచన అంత వరకే ,పరిమితం గా ,విశాల ధృక్పధము ఉండవు.ఇంతకంటే భిన్నమైన ఆలోచన వాళ్లు ఒప్పుకోరు

Never let these things stop you from being happy

Friday, February 10, 2017

యమధూత వర్తమానం..

యమధూత వర్తమానం..

శ్మశానానికి వెళ్ళి  కాలుతున్న శవాలను అడిగా.. ఎక్కడకి వెళుతున్నారు మీరు అని??
ఏమో తెలీదు అయినా నువ్వెవరు ప్రాణాలతో శ్మశానానికి ఎందుకొచ్చావ్ ,ఎలా వచ్చావ్,ఇంత అర్థరాత్రి,
అని అడిగింది కాలుతున్న ఓ శవం..
నేను కొన్ని రోజులనుండి  మానసిక సంఘర్షణకు లోనౌతున్నా మనం ఎవరం ,ఎందుకు పుడుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం మనవెంట ఏం వస్తుంది?,... అని మాట పూర్తవకుండానే నా మాటకి అడ్డొచ్చింది
ఆ శవం, పిచ్చివాడా అవి అందరికీ వచ్చే,ప్రశ్నలే,ప్రతీ హృదయంలో  జరిగే సంఘర్షణే..ఆ మాటకొస్తే నామటుకునాకు చాలాసార్లు వచ్చింది.కాని ఎవరికైనా తెలిస్తే నవ్వుతారేమో అని ఎవరికి చెప్పకుండా ఇక్కడే ఉంటాం ఇదంతా మనదే అని,అణా కూడా దానం చేయకుండా, చాలా ధనం కూడబెట్టా,కొంత భూములు తవ్వికూడా దాచుకున్నా వాటిని తగ్గలెయ్యా నేను తగలబడిపోతున్నా రావట్లేదే???ఇందాకణ్ణించీ అదే ఆలోచిస్తున్నా..
సరే నువ్వేం చేసావో చెప్పు..
మళ్ళీ నేను చెప్పడం ఆరంభించా..
అలా మానసిక సంఘర్షణతో ఉండలేక అందర్ని అడగడం మొదలెట్టా ఎవ్వరూ చెప్పలేదు సరికదా కొంతమంది తిట్టారు,కొంతమంది కొట్టడానికొచ్చారు,కొంతమంది పిచ్చోడన్నారు..కొంతమందైతే సంపాదించడం చేతకాకే ఇలాంటివి ఆలోచిస్తున్నావ్ అన్నారు..
అంతే ఈ జనం,!!వాళ్ళు నడిచేదారికి వెంట్రుకవాసి పక్కకు జరిగినా ,వాళ్ళకు రాని ఆలోచన వచ్చిన తట్టుకోలేరు ఒక్కొక్కరుగా చెప్పిచూస్తారు లేకుంటే గుంపుగా వచ్చి మీదపడతారు,అరుస్తారు,బెదిరిస్తారు,అయినా వినకుంటే యుద్ధంమొదలెడతారు,మొత్తానికి వాళ్ళ దారిలోకి నిన్ను తెచ్చుకునే వరకూ నిద్రపోరు.
అంతే వాళ్ళంతే...

కానీ నేను సమాధానపడలేదు అన్వేషణ ఆపలేదు అలా నిర్విరామ అన్వేషణలో అలసి నీరసిల్లి ఓ చెట్టునీడన సొమ్మసిల్లి పడుకున్నా అంతే కలలో యమధూత వర్తమానం తెచ్చాడు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుంది అని..అంతే ఆ ఆనందకరకంగారులో మెలకువ వచ్చేసింది ఇలా వచ్చేసా..

శ్మశానానికి ఒక్కడివే ఇంత ధైర్యంగా అర్థరాత్రి వచ్చావంటేనే నాకు ఆశ్చర్యమేసింది!!చాలా వేదననుభవించుంటావ్ పాపం! అంది ఓ పుఱ్ఱె.
నేను ఆశ్చర్యంగా చూసా ఏంటి పుఱ్ఱొక్కటే ఉందేంటా అని,
క్షమించు నేనెవరో చెప్పలేదుకదా ,నా పేరు ఇపుడు చెపితే బాగుండదు కానీ ,బ్రతికున్నప్పుడు సుందరి ,చాలా అందంగత్తెనని అందరూ అనే వాళ్ళు,నేనూ అనుకునేదాన్ని కూడా,ఎంతో మంది పొగడేవారు కవితలు,పాటలు,వ్రాసేవారు నా కళ్ళమీద,జుత్తు మీద,ఒంపుసొంపుల మీద...
పొగడ్తలు కదా వాటి దుంపతెగ ఎలాంటి వారినైనా మత్తులో ముంచి దుఃఖంలో తేలుస్తాయ్!!
చాలా అహంకారంగా ఉండేదాన్ని,అంటే అందరికంటే నేను కొంచెం అధికురాలిని,తోటి వారిని చులకనగా చూడ్డం..అబ్బో చాలా చేసాలే ఇపుడు ఏడుద్దామంటే కళ్ళుకూడా లేవు!!
అందం శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటుందని ,శరీరం ఇలా ఒంపులతో ఉంటుందని అనుకునే దాన్ని ,
కొంతకాలాలానికి....
నడుం ఒంగింది,జుత్తు తెల్లబడింది,చర్మం ముడతలు పడింది,అందగత్తె అని విన్న నాచెవుల్లో కొన్నాళ్ళకి, ముసల్ది ముసల్ది  అనీ,ఇపుడు దిగిందిరా దీని పొగరు  అనే మాటలు మార్మోగాయి .అదితట్టుకో లేక , ఆ బాధతో కుమిలి,కుమిలి మంచం పట్టా కొన్నాళ్ళకి ఇక్కడికొచ్చా ..
శునకాలు,గ్రద్దలు అన్ని ఎముకలు లాక్కుని,పీక్కుని పోగా ఇలా పుఱ్ఱెగా మిగిలా...
ఇపుడు తత్త్వం తెలిసింది ఏం లాభం చెప్పు ???
అని ఆవేదన పడింది..

నా హృదయాంతరాళంలో ఏవో పొరలు తెగసాగాయి.,

ఇంతలో ఓ బూడిదగుట్ట నాతో ఇలా అంది ,నువ్వు అదృష్టవంతునిలా ఉన్నావ్ ప్రాణం ఉండగానే మంచి ఆలోచనలొస్తున్నాయ్,సత్యాన్వేషణ మొదలైంది నీకు..
నాకు ఇలాంటివేమీ వచ్చేవి కావు. పేరు, గొప్ప వస్తే చాలు అందరూ నన్ను గుర్తిస్తే చాలు,అందరూ నన్ను గొప్పవాడు అంటే చాలు  అనుకునే వాణ్ణి!!
ఎక్కడైనా దానాలు చేస్తే అక్కడే గోడలమీద పెద్దపెద్ద అక్షరాలతో నాపేరు రాళ్ళమీద చెక్కించుకునే వాడిని.
కాలం మారింది ఆస్తులు కరిగాయి గొప్పవాడన్నవారే కళ్ళు నెత్తికెక్కి దానాలు చేసాడు ఎంత పొగరుగా ఉండే వాడు ఇపుడు అన్నీ చల్లారాయ్ పాపం..అని హేళన చేసేవారు..అంతే మానసికంగా కృంగిపోయి కొన్నాళ్ళకి ఇలా బూడిదగా మిగిలా ఇపుడు గాలెటువీస్తే అటు కదలడం తప్ప ఏం చేయలేను,

ఆ మాటలు విని నా కంట నీరు ఆగలేదు..
హృదయంలో మిగిలిన చీకటి పొరలేవో తెగిపోయినట్టు అనిపించింది..
నెమ్మదిగా సూర్యోదయమైంది...
వారందరికీ సాష్టాంగ నమస్కారం చేసి అక్కడనుండి కదలా,ఇపుడు ప్రతీ అడుగులో ఏదో క్రొత్తదనం ఉంది,
ఊపిరి తీసుకుంటుంటే ఆనందంగా ఉంది,
ఏవో కావాలి అని అనిపించట్లేదు,
ఆ ఆనంద పారవశ్యంలో, యమధూతకు హృదయంలోనే నమస్కారం తెలుపుతూ కదులుతున్నా ....
శవాన్ని మోసుకుంటూ ఓ గుంపు వస్తోంది..
నేనూ శవాన్ని మోస్తానని వారినికోరాను వారు అనుమతించారు..నేను సంతోషించా,ఎందుకో కళ్ళవెంట నీరు అలా వస్తూనే ఉంది వారితో మళ్ళీ శ్మశానం వరకూ వచ్చాను మధ్యలో  ఆ శవం మీద పుష్పం ఒకటి నా చెవులోకి వచ్చి ఇలా అన్నది..
"ఇపుడు అర్థమైందా ఏది మిగులుతుందో??
అన్నీ పోతాయ్ .పోనిది ఒక్కటే అది నీలోనూ ఉంది నాలోనూ ఉంది అంతటా ఉంది.."
అని అంటూ మళ్ళీ ఆ శవం చెవిదగ్గరకు వెళ్ళింది..
ఇపుడు నా కన్నీరు ఆగింది..
వర్ణించిచెప్పలేని ఆనందాన్ని నాలో గుర్తించా!!

ఈ విశ్వాన్నంతటిని నడిపిస్తున్న ఆ సకలాతీత శక్తికి అనుక్షణం ప్రణామాలు తెలుపుతూన్నా...

అర్జునుడా..... కర్ణుడా.....

అర్జునుడా..... కర్ణుడా.....
🌻🔘🌻🌿🌻🔘🌻🔘

కర్ణుడి దానగుణాన్ని....
==============
అందరూ పొగుడుతూ ఉంటే.... అర్జునుడు భరించలేక
ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి....
👉బావా! నేను కూడా దానాలు చేశాను.
👉అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను.
👉అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు.
👉అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు.
👉దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

===================

ఆ సంభాషణ జరిగిన సాయంత్రం...
అలా కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు.
అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి....
ఈ బంగారు కొండను దానం చేయి..... అప్పుడైనా
నీకు కర్ణుడి కన్నా మంచిపేరు వస్తుందేమో...అన్నాడు
====================
అర్జునుడు వెంటనే తన సేవకుల చేత....
చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు.
అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు.
ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది....
ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు....
====================
కృష్ణా....
👉దానం చేయాలంటే చిరాకుగా ఉంది... అన్నాడు... అప్పుడు కృష్ణుడు..నీకు దానం ఎలా చేయాలో చెబుతా.... అని కర్ణుడిని పిలిపించాడు.
ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది..’’ అన్నాడు
======================
వెంటనే కర్ణుడు- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి- ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి..’’ అన్నాడు. అందరూ తమకు కావల్సిన బంగారం తీసుకెళ్లారు
=======================
అప్పుడు అర్జునుడితో కృష్ణుడు....
👉నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది.
👉అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు.
👉కానీ కర్ణుడికి ఆశ లేదు.
👉అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు.
========================
🌻🌿🔘దానం చేసేవారి మనసులో....
ఎటువంటి ఆశ ఉండకూడదు....
అప్పుడే ఆ దానం ఫలిస్తుంది....... అని బోధ చేశాడు.

🌿🌻సర్వేజనా సుఖినోభవంతు🌻🌿