Pages

Thursday, February 16, 2017

So Sweet

Warning Clean your contact lenses regularly

హరహర శివశివా శ్రీరామా

హరహర శివశివా శ్రీరామా

అరుణాచలశివ

        ***కలియుగం విశిష్టత ***

     మిగతా ముడు యుగము లకు లేని విశిష్టత కలియుగం కలదు
     ఈ యుగం లో చిన్న పుణ్యం కూడా అనంతమైన పుణ్యం కలుగుతుంది
ఎదైన ఒక నామం ను నిరంతరం చేయడం వలన ముక్తీ ని పొందవచ్చు
   "" ఈ కలియుగంలో కనీసం 18 సేకన్లు మనసును ఎవరైతే భగవంతుని పై నిలబేట్టిన వారు ముక్తిని పొందవచ్చును "" అని నడిచే దైవం అని పేరు గాంచిన మరో ఆది శంకర అవతరం అయినా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యులు సేలవిచ్చరు అంటే ముక్తి ని పొందడం  ఎంత సులువో కలియుగం లక్షణాం
     అపర పుణ్యం సంపదించుకొవలను అనుకునే వారికి తీర్థయాత్రల రూపంలో గాని ప్రసిద్ధ క్షేత్రంలో నారాయణ సేవ( అన్నదానం) చేసిన అనంత పుణ్యం సంపదించవచ్చు
      అత్యంత పుణ్యం కావలసినవారు గోశాలలు నిర్మాణం చేసి గో సేవ చేసిన పురాతన దేవాలయంలు పునః నిర్మాణం చేసినా వాటి అలన పాలన చూసిన అపర పుణ్యం సంపదించి ముక్తి ని పొంపవచ్చు
     మరి ఎమి రానివారు నామ స్మరణ నిరంతరం చేసి చేసి అంత్య కాలమందు అదే నామం పలికి ముక్తి ని పొందవచ్చును
      అందుకే ఆది శంకరలు "" భజ గోవిందం భజ గోవిందం ముడఃమతే...................."" అనే  శ్లోకం లో గోవింద గోవింద గోవింద పలుకురా అని జ్ఞాన బోధన చేశారు

     అందుకే సామాన్యులు కూడ తరించడానికి అతి సులువైన మార్గం నామ స్మరణ ఒకటి
   
అందుకే పరమ శివుడు "" (అ శ్లోకం నాకు రాదు కాని)

చిదంబరం లో ఆకాశ లింగం దర్శనం చేస్తే లేదా
కమళలయం (తిరువరురు) లో జన్మించిన
కాశీ లో మరణించిన
లేదా నిత్యం ఒకసారి  స్మరణాత్ """అరుణాచల శివ "" అని స్మరించిన ముక్తి ఇస్తను అని పురాణ వాక్యాలు

కలియుగం లో తరించడానికి అత్యంత సులభం అయిన మార్గం నామ స్మరణే

  ** ఇది నేను పెద్దల వ్యాక్యనం విన్నది మీ ముందు చేర్చాను ఎమైన దోషాలు ఉంటే పెద్ద మనసుతో మన్నించ గలరు

పిల్లలు-పెంపకం

పిల్లలు-పెంపకం
........................................

మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి .

కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు

“నేను పడ్డ కష్టం,
శ్రమ నా పిల్లలు పడకూడదు” అని.

ఇది తల్లి, తండ్రుల నిస్పక్షపాతమైన, కల్మషమైన, పవిత్ర ప్రేమకు చిహ్నం .

కాని ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నాము...
మీరు ఆ కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి భాద్యతగా ఉంటూ వున్నారు..
అదే మీ పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం మీరు, వారు, వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది...

"కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు."

"నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు."

"కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు. "

ఈ సత్యాన్ని  గ్రహించాలి...

"అతి ప్రేమ,అతి గారాబం, అలుసు అనేది అస్సలు మంచిది కాదు"..

మీ పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో వారిని మరీ సున్నితంగా పెంచుతున్నాము.

ఇదే నేడు సమస్యగా మారింది.

స్వీటీ అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు.
అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు.
చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను స్వీటీలో పెంచారు.
ఉన్నత చదువులు చదివి.. పెళ్లాయ్యాక...
భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది.
ఇలా పెరిగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఇలా స్వీటీ ఒక్కటే కాదు..
ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
దీనికి పెంపకంలోని లోపాలే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

నాని అనే అబ్బాయి కూడా..అన్నీ తనకు నచ్చినట్టే జరగాలని పంతంగా వుండేవాడు.పెళ్ళి అయింది అక్కడా అంతే ఇలా వద్దు ..అలా ఎందుకు
ఇది ఇంతే అంటూ ..గొడవలు మనస్థాపాలూ ....ఈ కాలంలో  మరీ ఎక్కువగా వున్నాయి.

ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు అన్నం  విలువ,డబ్బు విలువతో  పాటు నలుగురితో కలసి వుండాలనీ  తెలియచేయాలి...

కొన్ని సందర్భాలలో చేతినిండా డబ్బు ఉన్నా తినడానికి తిండి దొరకదు..
అలాగే కొన్నిసార్లు తినిడానికి  దొరికినా చేతిలో డబ్బులు ఉండవు..

ఇటువంటి పరిస్ధితులు జీవితంలో ఎదుర్కొన్న వారికి తప్పకుండా అన్నం,డబ్బు విలువ తెలుస్తుంది...
అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది..
అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం,తిట్టడం చేయడం వలన
మొండిగా......మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది...
కనుక తల్లిదండ్రులు ఈ రెండింటిని సమన్వయంచేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి...

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి....
వారికి కష్టం... నష్టం... సుఖం ..దుఃఖ్ఖం
అన్నీ తెలియాలి.

లగ్జరీగా పిల్లల్ని పెంచడం నేటి ఫ్యాషన్‌.

అదే ఇప్పుడు కొంప ముంచుతోంది.
ఇలా పెరిగిన వారు చిన్న కష్టాలకి కూడా  హడలుతున్నారు.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ అంశాలపై అవగాహన పెంచాలి.

కొంతమంది తల్లి, తండ్రులు తమకు ఎన్ని కస్టాలు వున్నయో...ఎన్ని ఇబ్బందులు వున్నాయో... వగైరా విషయాలు పిల్లల దాకా రానివ్వరు .
ఇవన్ని వాళ్ళకు తెలియాలని అనుకోరు..
కాని అది కరెక్ట్ కాదు.అవసరమైన మేర
పిల్లలకు తప్పక తెలియజేయాలి.
వారడిగినవన్నీ  ఇస్తూ విచ్చలవిడి తనాన్ని మనమే అలవాటు చేస్తున్నాం..

మనం  సంపాదించే ప్రతీ రూపాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు తెలియాలి
తద్వారా వాళ్ళకు దుబారా ఖర్చులు అలవడకుండా వుంటాయి..
ముఖ్యముగా తల్లి తండ్రులు వాళ్ళకు చదువు కంటె జీవితంలో జనరల్ విషయాలు ఎక్కువ అవగాహనకు తీసుకురావాలి.. 
చదువు ఒక్కటే ఉంటె ఈ కాలంలో సరిపోదు.

కొందరు పిల్లలను సెలవు దినాల్లో ఏదైనా పనికి పంపుతుంటారు
లేదా ఇంటిలోనే పనులు చెప్పి బాగా
చేస్తే  కొంత మొత్తం ఇవ్వటం జరుగేది.
కారణం వాళ్ళు సంపాదించి పెడతారని కాదు..
వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుందని ..
నా చిన్నప్పుడు నన్ను ఇలానే మా  తల్లితండ్రులు కూరాగాయలు కోయటానికి  వారితో తీసుకు వెళ్ళేవారు .
వచ్చిన డబ్బుతో  అవసరమైనవి కొనుక్కోమంటే కొనేవాళ్ళమే కాదు
సొంతంగా సంపాదించటం దానిలోని కష్టంతో పాటు తృప్తి కూడా తెలుస్తాయి

ప్రతీ  తల్లి తండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహనా,
సరైన శిక్షణ అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు.
గొప్ప వాళ్ళు కాకపోయినా మంచి మనుషులుగా ఎదుటి  వారికి విలువ  ఇచ్చే వారిగా మిగులుతారు...

ప్రతీ గొప్ప వారు డబ్బునుంచి వచ్చిన వారు కాదు కష్ట, నష్టాల్లోనుంచి వచ్చిన వారు వున్నారు
వారు అన్నీ అనుభవించి వచ్చినవారు కనుక వారికి అన్ని తెలుసు..
సమయానుకూలంగా చెయ్యాలనే విషయం వారు స్వయంగా కష్ట, నష్టాలు అనుభవిస్తేనే తెలుస్తుంది...

పిల్లల్ని ముద్దుగా చూడటంలో తప్పులేదు కానీ...
వారికి లోకం తెలీకుండా పెంచడంలోనే అసలు సమస్య.
అందుకే దయచేసి తల్లి, తండ్రులారా మేల్కోండి..

మనపిల్లలే కాదు
రేపటి భావితరపు భవిష్యత్తు మన చేతుల్లో వుంది
మన ఒక్క అడుగు రేపటి పటిష్ట భారతావనిని అచంచల విశ్వాసాన్ని... కలిగిన వారసులను తయారుచేస్తుంది

కీరదోస మిల్క్ షేక్

కీరదోస మిల్క్ షేక్

కావలసిన పదార్థాలు :
కీరదోస - నాలుగు
పాలు - ఒకటిన్నర లీటర్
చక్కెర - 200 గ్రా.
యాలకుల పొడి - అరచెంచ
జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా - అన్నీ కలిపి 75 గ్రా.
నెయ్యి - రెండు చెంచాలు

తయారుచేసే పద్ధతి :
కీరదోస చెక్కుతోపాటు గింజల్నీ తీసేసి మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
ఓ గిన్నెలో పాలు తీసుకొని, చక్కెర వేసి పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక అందులో కీరదోస గుజ్జు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి అది చిక్కబడుతుంది.
ఓ బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా పలుకుల్ని వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష తప్ప మిగిలిన అన్నీ పలుకుల్ని మెత్తగా కాకుండా పోడిలా చేసుకోవాలి.
ఇప్పుడు ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి పాలల్లో వేసి వేసి మళ్ళీ కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

చట్నీ పొడి తయారు చేసుకునే విధానము

ఈ  రోజు  మీకు  చట్నీ పొడి  తయారు  చేసుకునే  విధానము  గురించి  తెలియ చేస్తాను.

ఈ  చట్నీపొడి  ఇడ్లీలలోకి , దోశెల లోకి  చాలా  బాగుంటుంది .

మా  చిన్నప్పుడు   అమ్మ  ఊరెళ్ళ వలసి  వస్తే  ఒక  సీసా నిండా  చట్నీ పొడి  కొట్టి  వెళ్ళేది.

మేమందరం  వేడి  వేడి  అన్నంలో  ఈ  చట్నీ పొడి  , నెయ్యి  వేసుకుని  తినే వాళ్ళం.

పిల్లలకు  అన్నం లోకి  ఆదరువుగా  బాగుంటుంది.

ఈ  చట్నీ  పొడికి  కావల్సిన వస్తువులు .

ఎండుమిరపకాయలు  -- 15
పుట్నాల పప్పు  ---  100 గ్రాములు
(  వేయించిన  శనగపప్పు  )
పచ్చి శనగపప్పు   - -  50  గ్రాములు.
చాయ మినపప్పు  --  మూడు స్పూన్లు.
జీలకర్ర   --  అర స్పూను .
ధనియాలు  --  స్పూను.
ఎండు కొబ్బరి  ---  అర చిప్ప
కరివేపాకు  ---   ఒక చిన్న కప్పుడు
చింతపండు   --  నిమ్మకాయంత
ఉప్పు  --  తగినంత
బెల్లం --  తరిగిన బెల్లం  ఒక  స్పూను.
పసుపు  --  పావు  స్పూను .
మెంతులు  --  పావు స్పూను.
నూనె  --  మూడు  స్పూన్లు .
ఇంగువ -  కొద్దిగా

చట్నీ  పొడి  తయారు  చేయు  విధానము.

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి
పచ్చి శనగపప్పు   కమ్మని  వాసన వచ్చే దాకా  నూనె  వేయకుండా  విడిగా  వేయించి  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

ఆ  తర్వాత  పుట్నాల పప్పు కూడా
కొంచెం   వేయించి  విడిగా  ప్లేటులో
వేరే  పెట్టు కోవాలి నూనె లేకుండా.

ఎండుకొబ్బరి  కోరుకుని  విడిగా  వేయించుకోవాలి నూనె  లేకుండా.

ఉప్పు  , గింజలు    ఈనెలు  తీసిన   చింతపండు  కూడా  తడి  లేకుండా  వేయించుకోవాలి.నూనె  వేయకుండా.

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్ల   నూనె  వేసి నూనె బాగా  కాగాక ముందుగా మెంతులు వేయాలి , ఆ తర్వాత చాయ మినపప్పు ,  ధనియాలు ,
జీలకర్ర  , కొద్దిగా  ఇంగువ, పసుపు కొద్దిగా వేసి , ఎండుమిరపకాయలు
కరివేపాకు  వేసి కమ్మని  వాసన వచ్చే దాక   వేయించు కోవాలి .

పోపు  ,  విడిగా   వేయించిన  పదార్ధములు  చల్లారాక  మిక్సీలో
ముందు
పచ్చి శనగపప్పు   వేసి మెత్తగా తిప్పాలి.

తర్వాత  అందులోనే  వేయించిన శనగపప్పు   వేసి  తిప్పాలి .

తర్వాత  వేయించుకున్న పోపంతా అందులో  వేసి  తిప్పాలి .

తర్వాత  ఎండుకొబ్బరి , చింతపండు , ఉప్పు  , తరిగి  ఉంచుకున్న బెల్లం కూడా  వేసి అన్నీ  మెత్తగా  మిక్సీ వేసుకోవాలి.

ఇప్పుడు  అన్నీ  ఒక  ప్లేట్లో లోకి  తీసుకొని  బాగా కలిపి  ఉప్పు  సరిపోయిందో  లేదో  చూసుకుని  ఒక  సీసాలో  పోసి   ఉంచుకుంటే
ఒక  నెల  రోజుల  పైనే  నిల్వ  ఉంటుంది .

బెల్లం  ఇష్టం  లేని  వారు  మానేయవచ్చు.
కాని 
కొంచెం  బెల్లం వేసుకుంటేనే  చట్నీ పొడికి  రుచి  వస్తుంది .

కారం  ఉండదు  కాబట్టి  పిల్లలు  చాలా  ఇష్టం గా  తింటారు.

వాటర్ మెలన్ జ్యూస్

వాటర్ మెలన్ జ్యూస్

కావలసిన పదార్థాలు :
నిమ్మకాయ - ఒకటి (పెద్దది)
పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు
సోడా - 50 మి.లీ
పంచదార - అరకప్పు

తయారుచేసే పద్ధతి :
ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి.
పంచదారను కొద్ది నీళ్ళలో వేసి కరిగించుకోవాలి.
పుచ్చకాయలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
నిమ్మరసం, పంచదార నీళ్ళు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పి వడబోయాలి.
ఫ్రిజ్ లో ఉంచాలి.
సర్వ్ చేసే ముందు సోడా కలిపితే రుచిగా ఉంటుంది.