Pages

Friday, February 17, 2017

✍ *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*

✍   *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*

*సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*

*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు*

*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*

*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*

*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*

*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*

*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*

*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*

*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*

*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*

*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*

*ఈ ఉపయోగకరమైన సమాచారం మీ మిత్రులకి షేర్ చేయండి.*

💐

10 Signs you are In a healthy relationship

అర్జునుడా..... కర్ణుడా.....

అర్జునుడా..... కర్ణుడా.....
🌻🔘🌻🌿🌻🔘🌻🔘

కర్ణుడి దానగుణాన్ని....
==============
అందరూ పొగుడుతూ ఉంటే.... అర్జునుడు భరించలేక
ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి....
👉బావా! నేను కూడా దానాలు చేశాను.
👉అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను.
👉అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు.
👉అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు.
👉దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

===================

ఆ సంభాషణ జరిగిన సాయంత్రం...
అలా కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు.
అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి....
ఈ బంగారు కొండను దానం చేయి..... అప్పుడైనా
నీకు కర్ణుడి కన్నా మంచిపేరు వస్తుందేమో...అన్నాడు
====================
అర్జునుడు వెంటనే తన సేవకుల చేత....
చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు.
అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు.
ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది....
ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు....
====================
కృష్ణా....
👉దానం చేయాలంటే చిరాకుగా ఉంది... అన్నాడు... అప్పుడు కృష్ణుడు..నీకు దానం ఎలా చేయాలో చెబుతా.... అని కర్ణుడిని పిలిపించాడు.
ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది..’’ అన్నాడు
======================
వెంటనే కర్ణుడు- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి- ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి..’’ అన్నాడు. అందరూ తమకు కావల్సిన బంగారం తీసుకెళ్లారు
=======================
అప్పుడు అర్జునుడితో కృష్ణుడు....
👉నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది.
👉అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు.
👉కానీ కర్ణుడికి ఆశ లేదు.
👉అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు.
========================
🌻🌿🔘దానం చేసేవారి మనసులో....
ఎటువంటి ఆశ ఉండకూడదు....
అప్పుడే ఆ దానం ఫలిస్తుంది....... అని బోధ చేశాడు.

🌿🌻సర్వేజనా సుఖినోభవంతు🌻🌿

Baby Girl drinks water - This is so funny

Be Positive, even when negativity surrounds you

Actress Himaja chit chat with her fans -3

This is why you should be cuddling!