Pages

Friday, February 3, 2017

క్యాల్షియం టాబ్లెట్లు వాడుతున్నారా ……?

క్యాల్షియం టాబ్లెట్లు వాడుతున్నారా ……?

అయితే గుండెకు ముప్పు పొంచిఉన్నట్లే క్యాల్షియం టాబ్లెట్లు వాడితే, ఎముకలకు మంచిదని ….. చాలా మంది డాక్టర్ల సూచన లేకుండానే సొంతంగావాడేస్తుంటారు. అది ఎంత మాత్రమూ ఆరోగ్యానికి మంచిది కాదు. కాల్షియంను మాత్రల రూపంలో తీసుకుంటే గుండెకు చేటని తాజా అధ్యయనం హెచ్చరించింది. ధమనుల్లో రాళ్లు పేరుకోవడం, గుండె పోటు తదితర రుగ్మతలు చుట్టుమట్టే ప్రమాదముందని వెల్లడించింది. అయితే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం మంచిదేనని తెలిపింది. అమెరికాలోని జాన్స్హాప్కిన్స్ వైద్య వర్సిటీ నిపుణులు దీన్ని నిర్వహించారు. 2,742 మందిపై పదేళ్లలో చేపట్టిన వివిధ పరీక్షల ఫలితాలను విశ్లేషించిన అనంతరం వారుతాజా అవగాహనకు వచ్చారు. రక్త నాళాలవ్యవస్థ, గుండెపై కాల్షియం మాత్రలు దుష్ప్రభావాలు చూపిస్తాయని తమ పరిశోధనలో సృష్టమైనట్లు దీనిలోపాలుపంచుకున్న ఎరినో మైఖోస్ తెలిపారు. ముఖ్యంగా వృద్ధుల్లో కాల్షియం మాత్రలు పూర్తిగా ఎముకలకు అందడంలేదని, ఇంకామూత్రం గుండా బయటకు రావడంలేదని చెప్పారు. శరీర కణజాలంలోఇవి పేరుకుంటూ ఉండొచ్చని ఆయన వివరించారు.

No comments:

Post a Comment