Pages

Wednesday, February 1, 2017

తులసి తినాల్సిందే!


• తులసి తినాల్సిందే!
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా..
కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి. అసలు తులసి ఎలాంటి అనారోగ్యాల్ని దూరం చేస్తుందంటే..
 తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.

* ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్‌లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.

* దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి.. అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.

* అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.

* తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.

* తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.

No comments:

Post a Comment