Pages

Showing posts with label samskruthi. Show all posts
Showing posts with label samskruthi. Show all posts

Monday, March 14, 2016

మన సంస్కృతి గురించి తెలుసుకుందాం...ఆచరిద్దాం !

మనం "నమస్తే" ఎందుకు చెబుతాము?

మిత్రులారా, మనం ఎవరైనా ఎదురుపడినపుడు లేదా ఎవరినైనా కలిసినపుడు నమస్తే చెప్పి పలకరిస్తాము. అదే పాశ్చాత్య సంస్కృతిలో అయితే కరచాలనం తో పలకరిస్తారు. కాని నమస్తే చెప్పి పలకరించడంలో చాలా విశిష్టత ఉన్నది. నమస్తే అన్న పదానికి అర్థం "ఎదుటి వ్యక్తికి వినయంతో నమస్కరించుట"

"నమ" అనే పదాన్ని రెండుగా విభజిస్తే, "మ" అనగా నాది మరియు "న" అనగా కాదు. అనగా దాని అర్థం ఎదైతే నీది అనుకుంటావో అది పరమాత్మకు చెందినది. ఎదుటి వ్యక్తిలో ఉండే ఆ పరమాత్మకు చేతులు జోడించడమే "నమస్తే" అన్న పదానికి అర్థం ! నమస్తే అనగా నీలో ఉండే అహంకారన్ని చంపివేసి ఎదుటి వ్యక్తి లో ఉన్న పరమాత్మకు హృదయ పూర్వకంగా నమస్కరించడమే !

నమస్తే అన్న దాన్ని ఇలా కుడా అర్థం చెసుకోవచ్చు. "నీలో ఉన్న భగవంతునికి నాలో ఉన్న భగవంతుడు నమస్కరించుచున్నాడు."

కాబట్టి నమస్తే చెప్పడం అన్నది మన గొప్ప సంస్కృతిలో భాగం. నమస్తే అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే "ఎదుటి వ్యక్తిలో దైవత్వాన్ని చుడడం మరియు నమస్కరించడం"

చుశారా మిత్రులారా! మన సంస్కృతి ఎంత గొప్పది. ప్రతీ జీవిలోను దేవుణ్ని చుడాలి, అందరు సమానమే అన్నదే మన సంస్కృతిలోని అంతరార్దం !

కాబట్టి ఇకమీదట ఎవరైన పెద్దలు కనిపించిన, ఎక్కడికి వెళ్ళినా నమస్తే తో పలకరించండి..