Pages

Wednesday, February 1, 2017

ఈ నూనె రాసుకుంటే 3వ రోజు నుంచే జుట్టు రాలడం ఆగిపోతుంది!!

ఈ నూనె రాసుకుంటే 3వ రోజు నుంచే జుట్టు రాలడం ఆగిపోతుంది!!
జుట్టు రాలటం ఇప్పుడు ప్రధాన సమస్య. కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులతో జుట్టు వేగంగా రాలిపోతోంది. దీంతో చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తుంది. మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే జుట్టును రాలటం అరికట్టడంతోపాటు, ఒత్తుగా జుట్టను పెంచేందుకు మార్కెట్లో అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. మరోవైపు ఖరీదెక్కువ. ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా, ఎఫెక్టివ్ గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు. కొబ్బరి నూనె, ఆముదం, కొద్దిగా అలోవీరాను నెలల్లో 4, 5, సార్లు వాడితే జుత్తు ఒత్తుగా పెరుగుదుంది. ఈ ప్రక్రియను ఎలా చేయాలో కింద తెలుసుకుని క్రమం తప్పకుండా ఆచరించి సమస్యకు చెక్ పెడదాం..
కావాల్సినవి…
* ఓ స్పూన్ కొబ్బరి నూనె.
* ఓ స్పూన్ ఆముదం.
* విటమిన్ E కాప్సిల్.(మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది.)
* కొంచెం అలోవీరా.
ఎలా వాడాలి.
* ముందు అలోవీరా గుజ్జును తీసుకోవాలి. కలబంద పైన ఉన్న బెరడును తొలగించి గుజ్జును వేరు చేయాలి.
* ఆ గుజ్జును వెంట్రుకలకు అప్లై చేయాలి. వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించాలి.
* ఓ పది నిమిషాల అనంతరం ఓ చిన్న గిన్నెలో టీ స్పూన్ కొబ్బరి నూనె, మరో టీ స్పూన్ ఆముదంను తీసుకోవాలి. ఆ రెండిటిని కలపాలి.
* విటమిన్ E కాప్పిల్ ను నెమ్మదిగా కట్ చేసి అందులో ఉన్న ఆయిల్ ను కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమంలో కలపాలి.
* ఓ గిన్నెలో నీటిని బాగా వేడి చేసి ఆ గిన్నెలో ఈ మిశ్రమం ఉన్న చిన్న గిన్నెను పెట్టాలి.
* నోట్: కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమాన్ని డైరెక్ట్ గా వేడి చేయకూడదు. స్టౌవ్ పై పెడితే మంటలు లేచే ప్రమాదం ఉంది.
* మిశ్రమం వేడెక్కిన తర్వాత దానిని ఓ పది నిమిషాల పాటు జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేయాలి.
* రాత్రంతా దానిని అలానే ఉంచి తెల్లవారే తలస్నానం చేయాలి.
* నెలలో 4, 5 సార్లు చేస్తే జుట్టు ఓత్తుగా పెరగటంతోపాటు, ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య చిట్కాలు! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.

No comments:

Post a Comment