Pages

Showing posts with label storage. Show all posts
Showing posts with label storage. Show all posts

Monday, July 18, 2016

శుభ్రంగా కాళ్ళూ, చేతులూ కడుక్కుని భోజనానికి కూర్చుంటాం.
మన అమ్మో, ఇల్లాలో మన కంచములో వేడి వేడి అన్నం వడ్డిస్తుంది.
అందులోకి ముద్దపప్పును వేస్తుంది.
ఘుమఘుమలాడే నెయ్యిని చెంచాతో పోస్తుంది.
అంచుకు నోరూరించే ఆవకాయ.

*మన ఆకలి రెట్టింపవుతుంది.*
*ఆత్రంగా దండయాత్ర మొదలుపెడతాం.*
*ఒక్కో ముద్ద లోనికి దిగుతుంటే, జీవుడు సంతోషంగా గంతులేస్తాడు.*
*ఆహాహా!...ఏమి మన భాగ్యము!.....*

ఇంతలో కఠక్ మని శబ్దం. పంటి కింద రాయి...

అంతకుముందటి దృశ్యం చెల్లాచెదరవుతుంది.
ముఖం రంగులు మారుతుంది.
కోపం నషాళానికి అంటుతుంది.

*ఈ రాయి ఎక్కడిది?*
బియ్యం లోదా?
పప్పులోదా?
మిల్లులోదా?
ప్లేటు శుభ్రంగా కడగకనా?
ఇల్లు సరిగ్గా ఊడవకనా?....
.దాని గురించి జుట్టు పీక్కుంటాం.

తిండి సంగతి మరిచిపోతాం.
వండినవాళ్ళ శ్రమను మరిచిపోతాం.
వడ్డించినవాళ్ళ ప్రేమను మరిచిపోతాం.
ఆ ముద్ద మన నోటికి అందేవరకు జరిగిన గొప్ప విషయాలేమీ మనం గుర్తుంచుకోం.

ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా.

చిన్న కారణానికి మంచి సంబంధం పాడుచేసుకుంటాం.

జీవితం కూడా అన్నం ముద్ద లాంటిదే!

భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపుముద్దను ప్రసాదించాడు.

*అందులో రాయి ఏమిటి?...చిన్న కష్టం.*

అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా, జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడం మానేస్తాం.
ఎన్ని సంతోషాలున్నాయో, ఎన్ని అనుభూతులున్నాయో అవన్నీ విస్మరిస్తాం.
రాయిలాంటి కష్టం మీదే మనసు పాడుచేసుకుంటాం.

ఇంత పెద్ద జీవితములో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా?.......

లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్.
ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇట్ ఈజ్ ఫుల్ లైఫ్.

*అందుకే కష్టం వచ్చినప్పుడు మనసు రాయి చేసుకోండి.*
*ఆ రాయిని పక్కన పెట్టండి. విందును తృప్తిగా ఆరగించండి.*
😊😊😊

Thursday, July 14, 2016

అమ్మ ఋణం

అమ్మ ఋణం
.
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది
మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు
ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది
ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది
ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది
ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే
అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది
ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”
కోపంగా అరిచేసే వాణ్ణి
ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు
నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది
అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది
ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను
మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది
నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను
అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది
మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు
నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?
మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను
పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను
మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను
బాగా డబ్బు సంపాదించాను
మంచి ఇల్లు కొనుక్కున్నాను
మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను
నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది
ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి
ఇంకెవరు?
మా అమ్మ
ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది
“ఎవరు నువ్వు?
ఎందుకొచ్చావిక్కడికి?
నువ్వెవరో నాకు తెలియదు
నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?
ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”
సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”
ఆమె అదృశ్యమై పోయింది
“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”
భారంగా ఊపిరి పీల్చుకున్నాను
ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు
వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికిఅబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను
స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను
ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి
మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది
ఆమె చేతిలో ఒక లేఖ
నా కోసమే రాసిపెట్టి ఉంది
దాని సారాంశం
ప్రియమైన కుమారునికి ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను
నేనింక నీవుండే దగ్గరికి రాను
కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!
ఏం చేయమంటావు?
నిన్ను చూడకుండా ఉండలేకున్నాను
కన్నపేగురా
తట్టుకోలేక పోతోంది
నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు
కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే
వస్తే నీకు మళ్ళీ అవ మానం చేసిన దాన్నవు తాను
ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు
చిన్నా!
నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది
నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!
అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను
నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?
నువ్వు చేసిన పనులన్నిం టికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు
ఒక్క రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాకోప్పడ్డాడంటేడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!”
అని సరిపెట్టుకున్నాను
చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు
ఉత్తరం తడిసి ముద్దయింది
నాకు ప్రపంచం కనిపించడం లేదు
నవనాడులూ కుంగి పోయాయి
భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను
తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?
మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?
ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ?
.
.
నాస్తి మాతృ సమం దైవం
నాస్తి మాతృ సమః పూజ్యో
నాస్తి మాతృ సమో బంధు
నాస్తిమాతృ సమో గురుః
అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు
తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు
ఆకలేసినా..
ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ
.
తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ
అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి
కనుపాప లా కాపాడండి
.
ఒక్కసారి ఆలోచించండి
.
నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి
బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం
*********************
.

Sunday, May 22, 2016

మోస్ట్ పవర్ ఫుల్ స్టొరీ!

మోస్ట్ పవర్ ఫుల్ స్టొరీ!
(ఇదొక ఈజిప్ట్ కథ .. ఈ కథ రాసిన రచయితను దేశం నుండి బహిష్కరించారట.)
ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది.
ఆడుతూ పాడుతూ పని చేసిది. అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది.
సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు.
ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు.
చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది, దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది. వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గా నియమించుకుంది. సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వలన ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబంధించిని రిపోర్ట్ లు వగైరా అడిగారు. ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది. అది చేసే పనికి తోడు పై అదికారులతో మీటింగ్ లు, ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి.
ఈ లోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజర్, వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి. క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఉత్పత్తి పడిపోయింది. సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్థితిిగతులని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి.
.

Tuesday, August 13, 2013

100 GB of Fast, Secure Storage

Sign up for a new account and get 100 GB of Free fast, secure cloud storage from Shared.com, if you want to sign up then please Click here

Monday, August 12, 2013

100 GB of Fast, Secure Storage

Sign up for a new account and get 100 GB of Free fast, secure cloud storage from Shared.com, if you want to sign up then please Click here