Pages

Monday, July 18, 2016

శుభ్రంగా కాళ్ళూ, చేతులూ కడుక్కుని భోజనానికి కూర్చుంటాం.
మన అమ్మో, ఇల్లాలో మన కంచములో వేడి వేడి అన్నం వడ్డిస్తుంది.
అందులోకి ముద్దపప్పును వేస్తుంది.
ఘుమఘుమలాడే నెయ్యిని చెంచాతో పోస్తుంది.
అంచుకు నోరూరించే ఆవకాయ.

*మన ఆకలి రెట్టింపవుతుంది.*
*ఆత్రంగా దండయాత్ర మొదలుపెడతాం.*
*ఒక్కో ముద్ద లోనికి దిగుతుంటే, జీవుడు సంతోషంగా గంతులేస్తాడు.*
*ఆహాహా!...ఏమి మన భాగ్యము!.....*

ఇంతలో కఠక్ మని శబ్దం. పంటి కింద రాయి...

అంతకుముందటి దృశ్యం చెల్లాచెదరవుతుంది.
ముఖం రంగులు మారుతుంది.
కోపం నషాళానికి అంటుతుంది.

*ఈ రాయి ఎక్కడిది?*
బియ్యం లోదా?
పప్పులోదా?
మిల్లులోదా?
ప్లేటు శుభ్రంగా కడగకనా?
ఇల్లు సరిగ్గా ఊడవకనా?....
.దాని గురించి జుట్టు పీక్కుంటాం.

తిండి సంగతి మరిచిపోతాం.
వండినవాళ్ళ శ్రమను మరిచిపోతాం.
వడ్డించినవాళ్ళ ప్రేమను మరిచిపోతాం.
ఆ ముద్ద మన నోటికి అందేవరకు జరిగిన గొప్ప విషయాలేమీ మనం గుర్తుంచుకోం.

ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా.

చిన్న కారణానికి మంచి సంబంధం పాడుచేసుకుంటాం.

జీవితం కూడా అన్నం ముద్ద లాంటిదే!

భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపుముద్దను ప్రసాదించాడు.

*అందులో రాయి ఏమిటి?...చిన్న కష్టం.*

అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా, జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడం మానేస్తాం.
ఎన్ని సంతోషాలున్నాయో, ఎన్ని అనుభూతులున్నాయో అవన్నీ విస్మరిస్తాం.
రాయిలాంటి కష్టం మీదే మనసు పాడుచేసుకుంటాం.

ఇంత పెద్ద జీవితములో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా?.......

లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్.
ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇట్ ఈజ్ ఫుల్ లైఫ్.

*అందుకే కష్టం వచ్చినప్పుడు మనసు రాయి చేసుకోండి.*
*ఆ రాయిని పక్కన పెట్టండి. విందును తృప్తిగా ఆరగించండి.*
😊😊😊

Superb girl .. amazing talent



Video Link :
Superb girl .. amazing talent
http://ift.tt/29PPB3C
Via #

Planes Collide Above New York



Video Link :
Planes Collide Above New York
http://ift.tt/29P76U3
Via #

Mid Air Plane Crash New York City United Airlines vs Trans World Airlines Mid Air Crash



Video Link :
Mid Air Plane Crash New York City United Airlines vs Trans World Airlines Mid Air Crash
http://ift.tt/29UejD4
Via #

Sunday, July 17, 2016

డబ్బుతో కొనలేని సంతోషం...***

డబ్బుతో కొనలేని సంతోషం...***

ఓ మానసిక శాస్తవ్రేత్తని  స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృథాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది. ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది. సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది.

వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు.
తన చేతిలో చీపురుని ఓ మూలన పడేసి ఆ స్త్రీ ఆ యువతి ముందు వున్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది.

‘‘నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను. అంతా దుఃఖం. ఏమీ తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతో వారిని పలకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది.

నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.
ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను. ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది.

డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు. కాని సంతోషాన్ని కొనుక్కోలేరు. అది మనకి మనం పొందాల్సి ఉంటుంది.’’ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది.
నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది.
నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది.
సంతోషం అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం.సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది
సంతోషం పరాధీనత కాదు అది ఓ నిర్ణయం.

తెలివి తక్కువ పులి

తెలివి తక్కువ పులి
.
అనగా అనగా ఒక అడవికి దగ్గర్లో ఒక ఊరు ఉండేది. ఆ అడవిలో ఒక పులి నివసిస్తూ ఉండేది. ప్రతిరోజూ అది ఊరి మీద పడి, దొరికిన మనుషులనల్లా చంపి తినేది. ఊరి ప్రజలెవ్వరూ దాని దాటికి తట్టుకోలేక- పోయారు. అందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి, తమ కష్టాలు చెప్పుకున్నారు. ఆ ఊరి పెద్ద అప్పుడు ఇలా చాటింపు వేయించాడు: “పులిని ఎవరైతే బంధించి తెచ్చిస్తారో వాళ్ళకు వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తాను” అని. బహుమానానికి ఆశపడి, దగ్గర గ్రామాల్లోని వీరులందరూ పులిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు- కానీ ఎవ్వరూ దాన్ని బంధించలేకపోయారు.
ప్రక్క ఊళ్లో నివసించే రత్నమ్మకు రాము,రవి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు . వాళ్లిద్దరికీ 13సంవత్సరాలే. వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. వాళ్ళకు చాలా భాషలు వచ్చు కూడా. వాళ్ళకు వచ్చిన ఒక భాష, పులి భాష! పొరుగూరి పెద్ద వేయించిన చాటింపు విని, వాళ్లకు ఎలాగైనా పులిని బంధించాలని ఆలోచన వచ్చింది. ఇక వాళ్ళిద్దరూ రెండు గట్టి తాళ్ళను తీసుకొని, తినేందుకు భోజనం మూట గట్టుకొని, బయలుదేరారు.
వాళ్ళు అడవిలోకి చేరుకునేటప్పటికి, పులి ఒక జింకను పట్టుకొని తింటూ కనిపించింది. వీళ్లను చూడగానే ‘వీళ్లు తనను పట్టుకునేందుకు వచ్చినవాళ్ళు’ అని అర్థమైంది పులికి. అది కోపంతో గర్జిస్తూ వీళ్ల మీదికి దూకబోయింది.
రాము, రవి ఇద్దరూ చాలా ధైర్యం ఉన్నవాళ్ళే- అందుకని వాళ్ళు పులంటే అస్సలు భయపడలేదు. వాళ్ళు అలా నిబ్బరంగా ఉండటం చూసి పులే ఆశ్చర్యపోయింది. అప్పుడు రాము దానితో పులిభాషలో “ఏమ్మా, పులీ! ఆకలిగా ఉన్నట్లున్నావే, ముందు ఆ జింకను తినటం పూర్తి చెయ్యి. ఆ తర్వాత మమ్మల్ని తిందువులే. ప్రస్తుతం మా దగ్గర మా ఎముకలు మాత్రమే ఉన్నాయి- కండలేదు. నిన్న దారిలో పోతుంటే ఇంకో పులి కనబడి, మా కండ కావాలని అడిగింది. ‘నీకెందుకు శ్రమ, మేమే ఇచ్చేస్తాం’ అని మేం మా కండను దానికి ఇచ్చేశాం. మా కండదేముంది- రెండు రోజుల్లో తిరిగి తయారవుతుంది గదా” అన్నాడు.
పులి ఇంకా ఆశ్చర్యపోయింది. ‘వీళ్ళకు పులిభాష ఎలావచ్చు?’ అని. అది వాళ్ళను ముట్టుకొని చూస్తే, నిజంగానే వీళ్లిద్దరికీ పెద్దగా కండ లేదు. ‘కండ ఎక్కడుంటుందిలే, పులికి ఇచ్చేశాం కద!’ అన్నాడు రవి దానితో, మళ్ళీ.
‘నిజంగానా, మీ కండ రెండు రోజుల్లో పెరిగిపోతుందా, ఎలాగ?’ అని అడిగిందది. “ఏముంది, బాగా అన్నం తింటే సరి! మేం నిన్న తిన్నాం కద, అందుకనే ఈ మాత్రం వచ్చింది. ఇవాళ్ళకూడా తిన్నామంటే, ఇక కండే కండ” అన్నాడు రాము, నమ్మకంగా.
“అయితే తినండి, తినండి. మీక్కూడా కొంచెం జింక మాంసం ఇవ్వమంటారా, ఇంకా బాగా కండ పడుతుంది?” అన్నది పులి, సంబర పడిపోతూ.
“అయ్యో, పచ్చి మాంసం తింటే కండ పట్టటం కష్టం. మేం అన్నం తెచ్చుకున్నాంలే. అది సరిపోతుంది. మేము ఇక్కడే, నీ ముందరే భోజనం చేస్తాము. అప్పుడు మాకు బాగా కండ పడుతుంది. ఆ తర్వాత నీక్కావలసినంత కండ నీకు ఇచ్చేస్తాం” అని చెప్పి రాము, రవి తాము తెచ్చిన తాళ్ళను నేలమీద పరిచారు.
వీళ్లను చూసి పులికి చాలా సంతోషం వేసింది. అది వాళ్ళతో అవీ-ఇవీ మాట్లాడుతూ క్రింద కూర్చోబోయింది. వాళ్ళు దాన్ని వారిస్తూ “అయ్యయ్యో, ఆగండి. మీరు పెద్దవాళ్ళు- అట్లా నేలమీద కూర్చోకూడదు. మేం మీకోసం చాప వేస్తాము” అని చెప్పి, నేలమీద త్రాళ్ళు పరిచి, దానిమీద అక్కడే ఉన్న పచ్చి ఆకులు వేసి, పులిని తాళ్ళ మీద కూర్చోబెట్టారు.
పులి ఆ త్రాళ్ళమీద పడుకొని, “ఈ రోజు నాకు బాగా కండ ఉన్న మాంసం దొరకబోతోంది. బాగా తినండి, తినండి! తొందరగా తినండి ! నాకు చాలా ఆకలిగా ఉన్నది” అని చెబుతూ ఒక్క క్షణంపాటు సంతోషంగా కళ్ళు మూసుకున్నది. అదే సమయం కోసం ఎదురుచూస్తున్న రాము, రవిలు ఒక్క ఉదుటున లేచి దాన్ని తాళ్ళతో బంధించేశారు.
“అయ్యో, అయ్యో! ఇదేంటి?” అన్నది పులి. “ఏమీ లేదు తల్లీ, నువ్వేమో మనుషుల కండనే తినాలంటున్నావు. మనుషులేమో మమ్మల్ని కాపాడమంటున్నారు. మరి మేం ఏం చేయాలి, నువ్వే చెప్పు?” అన్నారు వాళ్లు.
“అలాకాదు- నేనుండే అడవిలోకి మనుషులు వచ్చేస్తుంటే, చెట్లన్నీ కొట్టేస్తుంటే, నాకు జంతువులు దొరక్కుండా చేస్తుంటే, మీరే చెప్పండి మరి, నేనేం చెయ్యాలి?” అన్నది పులి.
“నీకేం అవ్వదులే, నిన్ను తీసుకెళ్ళి అభయారణ్యంలోనైనా పెడతారు, లేకపోతే ఏ జంతు ప్రదర్శన శాలలోనైనా పెట్టి నీకు కడుపు నిండేలా చూస్తారు- ఊరికే ఉండు” అని రాము, రవి ఇద్దరూ దాన్ని పట్టుకొని పోయి ఊరి పెద్దకి అప్పజెప్పారు.
గ్రామపెద్ద, అటవీశాఖ వాళ్ళను పిలిచి వాళ్ళకు పులిని అప్పగించాడు. రాము, రవి తమకు వచ్చిన వెయ్యి రూపాయల బహుమానాన్ని “జంతునిధి”లో వేసుకున్నారు!
.

Thursday, July 14, 2016

అమ్మ ఋణం

అమ్మ ఋణం
.
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది
మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు
ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది
ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది
ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది
ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే
అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది
ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”
కోపంగా అరిచేసే వాణ్ణి
ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు
నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది
అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది
ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను
మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది
నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను
అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది
మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు
నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?
మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను
పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను
మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను
బాగా డబ్బు సంపాదించాను
మంచి ఇల్లు కొనుక్కున్నాను
మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను
నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది
ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి
ఇంకెవరు?
మా అమ్మ
ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది
“ఎవరు నువ్వు?
ఎందుకొచ్చావిక్కడికి?
నువ్వెవరో నాకు తెలియదు
నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?
ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”
సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”
ఆమె అదృశ్యమై పోయింది
“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”
భారంగా ఊపిరి పీల్చుకున్నాను
ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు
వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికిఅబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను
స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను
ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి
మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది
ఆమె చేతిలో ఒక లేఖ
నా కోసమే రాసిపెట్టి ఉంది
దాని సారాంశం
ప్రియమైన కుమారునికి ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను
నేనింక నీవుండే దగ్గరికి రాను
కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!
ఏం చేయమంటావు?
నిన్ను చూడకుండా ఉండలేకున్నాను
కన్నపేగురా
తట్టుకోలేక పోతోంది
నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు
కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే
వస్తే నీకు మళ్ళీ అవ మానం చేసిన దాన్నవు తాను
ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు
చిన్నా!
నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది
నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!
అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను
నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?
నువ్వు చేసిన పనులన్నిం టికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు
ఒక్క రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాకోప్పడ్డాడంటేడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!”
అని సరిపెట్టుకున్నాను
చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు
ఉత్తరం తడిసి ముద్దయింది
నాకు ప్రపంచం కనిపించడం లేదు
నవనాడులూ కుంగి పోయాయి
భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను
తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?
మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?
ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ?
.
.
నాస్తి మాతృ సమం దైవం
నాస్తి మాతృ సమః పూజ్యో
నాస్తి మాతృ సమో బంధు
నాస్తిమాతృ సమో గురుః
అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు
తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు
ఆకలేసినా..
ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ
.
తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ
అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి
కనుపాప లా కాపాడండి
.
ఒక్కసారి ఆలోచించండి
.
నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి
బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం
*********************
.