Pages

Monday, December 26, 2016

రాముడు సీతనెందుకు వదిలేసాడు?

రాముడు సీతనెందుకు వదిలేసాడు?

తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు.

పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది.

పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు.

పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.

సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.

ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.

అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.

శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.

”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.

శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.

ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు.

కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!

ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు.

ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!

--- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి ప్రవచనం నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Sundari Full Song lyrical _ Khaidi No 150 _ Chiranjeevi, Kajal _ Rockstar DSP



Video Link :
Sundari Full Song lyrical _ Khaidi No 150 _ Chiranjeevi, Kajal _ Rockstar DSP
http://ift.tt/2ijkbr9
Via #

హనుమాన్ చాలీసా ఎలాపుట్టింది? ఎందుకోసం?

హనుమాన్ చాలీసా ఎలాపుట్టింది? ఎందుకోసం?
వారణాసిలోనివసిస్తూవున్నసంత్ తులసీదాస్ రామనామగాననిరతుడయిబ్రహ్మానందములో తేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.
ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవ్వాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది.
శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.
దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.
ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.
తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీరామనామము ,మీరుచెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.
రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదు\షా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను .రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సిమ్హద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ …… జయ హనుమాన జ్ఞాన గుణసాగర………… అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమ్ కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది.
ఈ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా శ్లోకాల యొక్క భావసహితముగ  తెలుసుకుని స్వామి క్రుపకి పాత్రులు అవుదాము
జై శ్రీ దుర్గా నారాయణి🙏

🌹 తెలుగు భాష 🌹

🌹 తెలుగు భాష 🌹

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

తేట తేట తెనుగులా....

మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.

పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే

=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.

తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.

తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించండి . . .
___________________________

*భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు*.

*భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు*.
*వాటిలో వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి*...
*మట్టికుండలో .... 100%*
*కంచు పాత్రలో ......97%*
*ఇత్తడి పాత్రలో .........93%*
*అల్యూమినయం*
*ప్రెషర్ కుక్కర్ లో...7% లేక 13%*

*కావున మన మందరము ఇత్తడి లేక మట్టి పాత్రలను వాడి తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుగలము*. ...

*మట్టి పాత్రల విశిష్టత*

      *వాగ్బటాచార్యులు* చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . అది ఆహారము కాదు విషముతో సమానము . ఈ విషము నిదానముగా పని చేస్తుంది . అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది .

      *ప్రెషర్ కుక్కర్* లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగలదు . కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము . అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని  తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ* వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్ఛేసింది .

       ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది . కానీ ఉడుకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు .

       ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏగింజ పండడానికి ఎక్కవకాలం పడుతుందో అదేవిధంగా ఆగింజ వండడానికి ఎక్కవ సమయం తీసుకుంటుంది . గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి . మెత్తబడితే సరిపోదు . ఇది ప్రకృతి ధర్మం , ఆయుర్వేద సిద్ధాంతం .

      ప్రాచీన కాలంనుండి భారత దేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి , మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు . ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది . మన శరీరం అంతటా ఉండేది మట్టియే . మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో వున్నాయి . మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్ధాంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు . ప్రెషర్ కుక్కర్ లో  వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి . 93% లేక 87% న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి , లోపించాయి అని తేలింది . *మట్టిపాత్ర* లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి . ఈ పదార్ధినికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది .

       మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు . జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . జీవితాంతం మన శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . అదీ ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు . ఆనందంగా జీవిస్తారు .

     మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . ఈ పద్ధతికి అత్యుత్తమైనది *మట్టి పాత్ర* .

      మనకి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు . అన్ని రకాల మట్టి పాత్రలకు పనికి రాదు . ఏ మట్టి పనికి వస్తుందో , ఎలాంటి మట్టిలో వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు . ఇంత గొప్ప సేవచేసి మనకు ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు .

  *మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం* .

   *భారతీయ కుమ్మరికి శతకోటి వందనాలు* .

దుర్యోధనుని చెల్లెలి కథ

దుర్యోధనుని చెల్లెలి కథ

కౌరవులు ఎంతమంది అనగానే ఠక్కున వందమంది అని చెప్పేస్తాం. దృతరాష్ట్రుని పిల్లలందరూ కౌరవులే అనుకుంటే కనుక 102 మంది కౌరవుల లెక్క తేలుతుంది. ఎందుకంటే దృతరాష్ట్రునికీ, సుఖద అనే చెలికత్తెకీ యుయుత్సుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇక కౌరవులకు దుస్సల అనే చెల్లెలు కూడా ఉంది. ఈ ఇద్దరితో కలుపుకొని కౌరవులు 102 మంది!

జననం
వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది. అయితే కాలం గడుస్తున్నా తనకి సంతానం కలగకపోగా, తన తోటికోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు. దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు, తన వరం వృధా పోదనీ, ఆ మాంసపు ముద్దలని నూరు కుండలలో ఉంచమనీ... వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారనీ పేర్కొంటాడు. అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి. ఆమె కోరికను వ్యాసుడు మన్నించడంతో 101 కుండలలో ఆమె గర్భస్థ శిశువుని భద్రపరుస్తారు. అలా జన్మించిన 101వ శిశువే దుస్సల.
వివాహం
దుస్సల బాల్యం గురించి మహాభారతంలో ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే నూరుగురు సోదరులకు తోడు ఐదుగురు పాండవులు కూడా కలిసి పెరగడంతో బహుశా ఆమె వారందరి సోదర ప్రేమను పొంది ఉంటుందనడంలో సందేహం లేదు. దుస్సలకి యుక్తవయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రధునితో వివాహం జరుగుతుంది. ఇతను ఎవరో కాదు... మనం తరచూ వినే ‘సైంధవుడే’! సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధునికి ఆ పేరు వచ్చింది. సైంధవుడు మహా క్రూరుడు. పైగా స్త్రీలోలుడు. ఒకరోజు వనవాసంలో ఉన్న ద్రౌపది చూసి మోహిస్తాడు. ఆమె ఎంతగా వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆశ్రమానికి చేరుకున్న పాండవులు, విషయాన్ని తెలుసుకొని ద్రౌపదిని వెతుక్కుంటూ బయల్దేరతారు. ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకువెళ్తున్న సైంధవుడు కంట పడటంతో, వారి క్రోధానికి అంతులేకుండా పోతుంది. అయితే దుస్సల సౌభాగ్యం కోసం అతడిని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించడంతో.. అతని చావచితక్కొట్టి, గుండు గొరిగించి వదిలిపెడతారు పాండవులు. అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది.
తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సైంధవుడు, శివుని కోసం ఘోరర తపస్సుని ఆచరిస్తాడు. అర్జునుడు మినహా, మిగతా పాండవులందరినీ ఒక్కరోజు పాటు యుద్ధంలో నిలువరించగల వరాన్ని పొందుతాడు. ఆ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులను నిలువరించి, అభిమన్యుడి చావుకి కారణం అవుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుని చావుకి ప్రతీకారంగా సైంధవుని సంహరించడంతో సైంధవుని చరిత్ర సమాప్తమవుతుంది.
అర్జునునితో సంధి
కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితుడవుతాడు. అదే సమయంలో జయద్రధుని వారసునిగా, అతని కుమారుడైన సురధుడు సింధు రాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధయాగాన్ని తలపెడతాడు. ఇందులో భాగంగా యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీస్తుంది. ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడూ బయలుదేరాడు.

యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురదుడు, అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండాగి చనిపోతాడు. సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. కానీ మహామహావాళ్లే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు, అతను ఎంతసేపని తన పోరుని సాగించగలడు. అందుకే ‘తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి, తన మనవడిని కాపాడమంటూ’ దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెనుదిరుగుతాడు అర్జునుడు. అలా దుస్సల విచక్షణతో కౌరవ, పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరాన్ని నిలిచిపోతుంది

విష్ణుపురాణ అంతర్గత ఖగోళ రహస్యాలు

విష్ణుపురాణ అంతర్గత ఖగోళ రహస్యాలు

విష్ణుపురాణం సూర్య మండలం గురించి కొంత వివరంగా చెబుతుంది. చాలా క్రిప్టిక్ (నిగూఢo) గా ఆ వివరణ వుంటుంది.
సూర్యుడు ఒక ఏడు గుర్రాలు పూన్చిన రధం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని, ఆ రధానికి రెండు ఇరుసులు ఉంటాయని, ఒక ఇరుసు 157 కోట్ల యోజనాల దూరం ఉంటుందని ఆ ఇరుసుకు మనకు సంబంధించిన కాల చక్రం బిగించబడి ఉంటుందని, ఆ చక్రానికి మూడు నాభులు ఉన్నాయని 12 అంచులు ఉన్నాయని, ఆ చక్రానికి 6 కడకమ్మలు ఉన్నాయని చెబుతుంది. సూర్యుడు ఎప్పుడూ మేరు పర్వతానికి దక్షిణం వైపుగానే ఉంటాడని చెబుతుంది.

ఒకసారి  దీనిమీద మరింత లోతుగా చర్చిద్దాము.
అసలు సూర్యుడు ఏమిటి రధం ఎక్కడం ఏమిటి? నేటి సాంకేతికత పరంగా పురాణం చెబుతోందా? దీని మీద ఋషులు ఎన్నడో వివరణ ఇచ్చారు. మిగిలిన మతాలు, శాస్త్రజ్ఞులు కనుగొనక మునుపు నుండే మనం మనం నివసిస్తున్న ధరను భూగోళం అని వ్యవహరిస్తున్నాం. భూమి గోళాకారంలో ఉందని వేదం చెబుతోంది. దానికి ఉదాహరణకు ఒక్కసారి వరాహ అవతార విగ్రహాలను పరికించండి. కొన్ని వేల ఏళ్ళ క్రితం నుండి శిల్పశాస్త్రంలో ఈ విషయమై చూపుతారు. వరాహ స్వామీ కోర మీద భూమి ఒక గోళంగా చిత్రిస్తారు. ఇది ఎవడో ఒక్కసారి మేలుకుని నెత్తిమీద ఒక పండుదెబ్బతో తెలిసినది కాదు. మనకు ఎన్నటినుండో తెలిసి ఉన్న పరమ సత్యం. అంతేకాక సప్తద్వీపా వసుంధరా అని సంబోదిస్తాము. సప్త ద్వీపములు ఉన్నాయని సప్త మహా సముద్రాలు  ఉన్నాయని మనకు ఉగ్గుతో నేర్పిన సత్యము.

మనం ఉదాహరణకు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాము అనుకోండి. ఒక ఊరికి దగ్గర పడ్డప్పుడు ఆ ఊరొచ్చింది, ఆ ఊరు వెళ్ళిపోయింది అని అంటాము. వాస్తవానికి ఆ ఊరు ఎక్కడకీ పోదు, రాదు. కేవలం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు relative (సంబంధిత) గమనాన్నే చెబుతాము. మనకు తెలుసు శాస్త్రాదారంతో సూర్యుడు అక్కడే ఉంటాడు అని. నక్షత్రాలు అక్కడే ఉంటాయని, కానీ మనకు సమయం లెక్క కట్టడానికి వ్యవహార పరంగా సౌర్య మానం, చంద్ర మానం, సాయణం, నక్షత్రమానం గా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. భూమి తన పైనున్న ఆకాశంలో నక్షత్ర మండలాల పరిధులలో సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. కానీ ఆ చేసే ప్రదక్షిణం ఒక 23.5 డిగ్రీల కోణంలో చేస్తుంది, అందువలననే మనకు దక్షిణాయానం, ఉత్తరాయణం లో వివిధ రకాలుగా దివారాత్రాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న బొమ్మను చూడండి. ఒక cone (శృంగం) న్ని ఒక కోణంలో కత్తిరించినట్టు అయితే ఒక దీర్ఘవృత్తము (ellipse) వస్తుంది. ఆ కోణం యొక్క కోనను మనం ధ్రువపదం అని చెబుతాము. ఆ ధ్రువపదం మనకు రిఫరెన్స్ అన్నమాట. ఆ ధ్రువ పదానికి ఎప్పుడూ దక్షిణంలోనే సూర్యుడు ఉంటాడు. భూమి కూడా సూర్యునికి దీర్ఘ వృత్త మార్గంలోనే ప్రదక్షిణం చేస్తుంది. అందుకే మన భూమి ఒకసారి సూర్యునికి దగ్గరగా, ఒకసారి అత్యంత దూరంగా ప్రయాణం చేస్తుంది. పైన ఉన్న నక్షత్ర మండలం స్థిరంగా ఉంది అని మనం అనుకున్నప్పుడు భూమి ఆయా నక్షత్ర మండల పరిధులలో తిరుగుతుంది. ఆ మండలాన్ని మన ఋషులు 12 భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం భూమిని స్థిరంగా అనుకుని మిగిలినవన్నీ relative గా లెక్క కట్టినట్టు అయితే సూర్యుడు తిరుగుతాడు, పగలు ఉదయిస్తాడు, రాత్రికి అస్తమిస్తాడు. లెక్క కట్టడానికి మనకు సులువు, అందుకే మొట్ట మొదటి relativity గురించి ప్రస్తావన మన జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది.

ఇప్పుడు నిన్న 157 కోట్ల యోజనాలు సూర్యునికి భూమికి ఉన్న దూరం అని చెప్పుకున్నాము. అదే మనం గణించే కాల చక్రానికి ఆధారం. మూడు నాభులు పగలు, సాయం, నిశ(రాత్రి) కి సంకేతాలు, 6 కడకమ్మలు ఆరు ఋతువులకు నిగూఢనిరూపణ అయితే 12 అంచులు పన్నెండు నెలలకు సంకేతార్ధాలు. ఇదే కాక సూర్యుని రధం 36 లక్షల యోజనాల పొడవు అని చెబుతుంది.  అలాగే సూర్యుని ఒక ఇరుసుకు నాలుగు గుర్రాలు, మరొక దానికి 3 గుర్రాలు కట్టబద్దాయని, రెండవ ఇరుసు 145 కోట్ల యోజనాలు అని చెబుతుంది. ఒక ellipse కు రెండు focal పాయింట్స్ ఉంటాయి. అవి రెండు ఒకే విలువ వుంటే అది ఒక సర్కిల్ అవుతుంది. ఇక్కడ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది, దూరంగా వెళ్ళినప్పుడు 152 మిలియన్ కిలోమీటర్లు   దూరం. దానికి focal పాయింట్ గణిస్తే sqrt(a**2 – b**2) ఫార్ములా ప్రకారం అది సరిగ్గా 36 మిలియన్ కిలోమీటర్లు, సరిగ్గా వేదం చెప్పిన సూర్యుని రధం పొడవుకు సమానంగా.

కాబట్టి relative స్పీడ్ ఆధారంగా మనకు సూర్యుడు సప్తాశ్వరాధ -ఏడు గుర్రాల (VIBGYOR – ఏడు రంగుల )  రధం మీద మేరువుకు ప్రదక్షిణగా తిరుగుతాడు అని చెబుతారు. చూసే దృష్టి మార్చి చూస్తె మనకు వారు చెప్పిన పరమ సత్యాలు బోధపడతాయి. నేడు మనం కాంతి సంవత్సరం పరంగా గణిస్తున్నాము , మనం మాట్లాడే అంకెలు మారతాయి కానీ ఆ అంకెల ఆవల ఉన్న సత్యం, లోకం మారదుగా.

మనోహర్ స్వామి