Pages

Wednesday, January 4, 2017

Gaura mani tours Harinam Sankirtan Agra kirtan 💖🙏❤

ఆది గురువు దక్షిణామూర్తి

ఆది గురువు దక్షిణామూర్తి

భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు.
అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్షదైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణిం చాయి.
''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తిశంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురుసేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పుర్షులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు.
వ్యక్తి క్రమ శిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కా రంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఈయ బడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారా లతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థా లను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కార వంతుడు కావడానికి తొలి గురువు తల్లి. ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వ్యక్తి విద్యాసంస్కారం అలవరచు కోవడానికి గురువును ఆశ్రయిస్తాడు.
గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదు గురికి పంచుతూ ఒక నాటి శిష్యుడు గురు స్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒకచైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా వుంది.

''జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే''.
పై భావం ఏ దేశానిదైనా, ఏ భాషదైనా అంత రార్థం ఒక్కటే. గురు ముఖత: నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శ వంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణా మూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా వుంది.

''గురవే సర్వలోకానాం
భిషజే భవ రోణినాం
నిధయే సర్వ విద్యానాం
దక్షిణా మూర్తయేనమ:''
అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణా మూర్తి గానూ, ఆదిగురువుగాను తెలియ జేస్తోంది. గురువు విశ్వానికి, జ్ఞానానికి వుండే సంబం ధాన్ని విశదప రుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం. అంథకా రాన్ని తొలగించే జ్ఞానం. అచేతనం నుండి చేతనా నికి తీసుకపోయే మార్గ దర్శి.
గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు. ''పూర్వ దత్తేషు యా విద్యా'' అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో

''గురుమూర్తించి దాకాశం సచ్చిదానంద విగ్రహం
నిర్వి కల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే
గురుస్తుతితో ధన్యులమౌదాం.
ఓం శ్రీత్రిమూర్తి స్వరూప గురవేనమ:

ఓం నమో దక్షిణామూర్తియే నమః
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||

Earth provides enough to satisfy every man’s need, but not every man’s

ప్రతీ అబ్బాయీ, అమ్మాయి తప్పక చదవండి Must Read & Share

ప్రతీ అబ్బాయీ, అమ్మాయి తప్పక చదవండి Must Read & Share

"ఒరేయ్.. ఒసేయ్.." అని సినిమాల్ని చూసి inspire అయి మాట్లాడుకోవడం.. ఛాట్ చేసుకోవడం సరదాగానే ఉంటుంది..

కానీ ఆ సరదా జీవితాల్ని బలి తీసుకుంటోంది...

ఇవ్వాళ ఒకమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం డీల్ చెయ్యాల్సి వచ్చింది.. ఇలాంటివి ఇప్పటికి ఓ పదీ, పదిహేను కేసులు నా దృష్టికి వచ్చాయి..

ఆ అమ్మాయి పెళ్లయి నెలన్నర మాత్రమే అయింది... పెళ్లవగానే భర్త సింగపూర్‌ వెళ్లిపోయాడు, భార్యని తర్వాత తీసుకు వెళ్లే ప్లాన్‌తో. అంతలో ఈ అమ్మాయి మెయిల్, ఐడి, పాస్‌వర్డ్ ద్వారా పాత ఛాట్ హిస్టరీ మొత్తం తిరగేస్తే ఓ అబ్బాయితో ఛాట్ చేసిన మాటలు సమస్య సృష్టించాయి. "ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా" అని అనుమానం మొదలెట్టాడు.

--------------------

ఇక్కడ ఎవ్వడికీ జీవితంపై బాధ్యత లేదు.. అమ్మాయిలకు తలనొప్పి వస్తే జండూబామ్‌లు రాసే బాయ్ ఫ్రెండ్స్ కావాలి.. అబ్బాయిలకు కొద్దిగా రొమాంటింగ్‌గా మాట్లాడడానికి కోపరేట్ చేసే అమ్మాయిలు కావాలి... ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటారు. కానీ ఆ మాటలు ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఎవడికీ పట్టదు!!

రేపు పెళ్లయ్యాక మీ భార్య ఇలాగే వేరొకరితో మాట్లాడి ఉందీ అని తెలిస్తే తట్టుకోవడం అబ్బాయిలకు సాధ్యమవుతుందా? మీ భార్యల్ని క్షమించలేని వాళ్లు ఎవరో ముక్కూ మొహం తెలీని అమ్మాయిలతో ఎందుకు మాటల్లోనే మానసిక వ్యభిచారం చేసేస్తారు?

అమ్మాయిలూ ఏం తక్కువ తినట్లేదు.. మంచిగా, బుద్ధిగా ఉండేవాళ్లు అమ్మాయిలకు నచ్చట్లేదు. కొద్దిగా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి... ఎంత అడ్వాన్స్‌డ్ అంటే సినిమాలకూ, షికార్లకీ తిప్పుతూ ముద్దులూ, హగ్‌లూ ఇచ్చే బాపతు జనాలే నచ్చుతున్నారు.. ఏ మూమెంటో కాలు జారినా ఫర్లేదు.. నష్టం ఏం లేదు.. ఇవ్వాళ రేపు వర్జినిటీ అన్న మాట చూసి అమ్మాయిలే నవ్వుకుంటున్నారు.

----------

సిగ్గుపడాల్సి వస్తోంది భారతదేశ పతనాన్ని చూసి! తమ జీవితాల్ని తామే సర్వనాశనం చేసుకుంటున్న యువతని చూసి!!

-----------------

కంప్యూటర్లూ, ఇంటర్నెట్లూ, మొబైల్ ఫోన్లూ, ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నది విచ్చలవిడిగా ఏదిబడితే అది మాట్లాడుకోవడానికి కాదు.. అలా మాట్లాడుకోవడం సరదానూ కాదు.. అలాంటి మాటలే రేపు మీ జీవితాలకు ఉరితాళ్లు కాబోతున్నాయి.

మీరేం చేయాల్సిన పనిలేదు.. చనువుగా ఒక్క వ్యక్తితో మాట్లాడితే చాలు.. అనుమానం ఇట్టే పుట్టుకొస్తుంది.. మీ భార్యా, మీ భర్తా మిమ్మల్ని అనుమానించినంత మాత్రాన వాళ్లు ఇరుకైన ఆలోచనలు కలిగిన వాళ్లూ కాదూ.. మీరు విశాల హృదయులూ కాదు. ఈ సిస్టమ్ ఇంతే... మీరేదో గొప్ప అని ఫీలవకండి... మీ పార్టనర్ అనుమానించకుండా గౌరవంగా ఉండాల్సిన బాధ్యతా మీది, మీ పార్టనర్‌కి అనుమానం వచ్చినా మీ ప్రవర్తనతో సంభాళించుకుని మళ్లీ మామూలు అవ్వాల్సిన బాధ్యతా మీ పార్టనర్‌ది.

అంతే గానీ.. "వాడెడడు నన్ను అనుమానించడానికి.. నిన్నగాక మొన్న తాళికట్టాడు.. నాకు ఈ మనిషే వద్దు.. నేను సంపాదించుకోవట్లేదా.. నా బ్రతుకు బ్రతకలేనా.." అని ఏటిట్యూడ్ చూపించదలుచుకున్నారా? మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నట్లు! చేయాల్సిదంతా మీరే చేసి తప్పు ఎవరిదో అన్నట్లు ఉండడం ఎలా కరెక్ట్?

----------------------

చివరిగా ఒక్క మాట...

ఈ దేశంలో కొన్ని కోట్ల దంపతులు జీవితాంతం కలిసి ఉన్నారు తరతరాల నుండీ... కలిసి బ్రతకడానికీ, కుటుంబ వైవాహిక జీవనానికీ అర్థం నేర్పిందీ సంస్కృతి.. దీన్ని మీ అజ్ఞానంతో రోజుకో మనిషితో కలిసి బ్రతికే దారుణమైన స్థితికి దిగజార్చకండి.

మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక చాంధస ఆచారం అని ఆడుపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్య వంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలి వేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
ఆచార హీనాః నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోండి.
(మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకు పోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే.)

మడి అంటే ఏమిటి?

మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి.  నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.

మడి ఎలా కట్టుకోవాలి? :

రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ( 11 లోపు ) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం.  ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండేముల మీద ఇంటిలో గానీ లేక  ఆరు బయట గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల  అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )  మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడి గుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట / పూజ చేయ వలెను. మడితో నే  సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు.  ( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.

మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు.  ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు వస్త్రము.  

మగ వాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని  గానీ, ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ లో పావడా తో  గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట వలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.  ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవ్వాలి. మనల్ని మనము కాపాడు కోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవము లోకి వస్తాయి.

  నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

శుభంభూయాత్!

హిందూ ధర్మములో కలియుగము లో వుండే రాక్షసుల గురించి ఈ కింది విధముగా చెప్పబడినది.
హిందూ ధర్మములో కలియుగము లో వుండే రాక్షసుల గురించి ఈ కింది విధముగా చెప్పబడినది.

1. చుట్టూ ఉన్నవారికి కంటకముగా మారినవాడు.

2. యుక్తాయుక్త విచక్షణ లేక చెప్పుడు మాటల విని ఇతరులను రాక్షసముగా పీడించేవాడు.

3. ఇతరులను ఆకారణముగా దుషిస్తూ ధర్మ సూత్రములు వల్లించేవాడు.

4. సహాయం పొందుతూ కూడా కృతజ్ఞత చూపకుండా నిందలు వేసేవాడు.

5. శరీర కష్టం లేకుండా తిని పడుకునే సోమరిపోతు.

6. దయ చుపినవాడిని మాటలతో కుల్లపోడుచువాడు.

7. తన సంతానమును ఆకారణముగా దూషించు వాడు.

8. వావి వరసలు లేక మ్రుగామువలె తన సోదర/సోదరిల  యొక్క భార్య/భర్తలను తిట్టువాడు.

9. తన మంచి కోరి చెప్పిన విషయాలను తనని చులకన చేయుటకు చెప్పిన విషయలుగు నిందలు వెయ్యువాడు.

10. ఎంత సేవ చేసినాను తనకు ఎవరు ఏమి చేయుటలేదని ఏడ్చువాడు.

11. జీవితము మీద ముందు చూపుతో ఇతరులు చేసుకునే కష్టాన్ని హేళన చేసేవాడు.

12. చెడ్డ భార్య మాటలు విని కన్నా తల్లిని దూషించి కొట్టేవాడు.

13. ఇతరుల వస్తువులను తన అవసరానికి వాడుకొని, అవసరము తీరిన తరవాత ఆ వస్తువు నాసిరకముదని, మోసపురితమైనదని దురద్రుష్టకరమైనదని నిందలు మోపేవాడు. 

15. తనకు సంబంధించిన కార్యక్రమాలకు అందరు సంతోషముగా కులిలవలె సేవలు చెయ్యాలి కాని ఇతరులకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమూ ఎవరో చచినట్టు మోహము పెట్టుకొని కుర్చునేవాళ్ళు. ఎ సహాయము చేయ్యనివాళ్ళు.

16. మోహము మీద చిరునవ్వు కూడా లేకుండా బ్రతికేసేవాడు.

17. తన చాతకాని తనము వల్ల  ప్రపంచము మీద పగ పెంచుకునేవాడు.

18. తనకు కోపం వచినప్పుడు అందరు భయపడాలి తనకు సంతోషం వచినప్పుడు అందరు సంతోషముగా వుండాలి అనుకునేవాడు.

19. పట్టరాని కోపముతో ఇతరులను ఎల్లప్పుడూ దుషిస్తూ, ఇతరులు మాత్రం ఏమి జరగనట్టు సాదారనముగా వుండాలి అనుకునేవాడు. పైనుండి అట్లా ఉండని వాళ్ళు తనని చులకనగా చూస్తున్నారని నిందలు మోపేవాడు.

20. ఏ క్షణానికి ఆ క్షణం బురదలో దొరిలే పంది వలె గడిపేస్తూ, కొంచము కూడా మూడు చూపు లేకుండా  గడిపేసే పశువు వంటి వాడు.

21. ఇతరులు జీవితమున సంతోషముగా వుంటే అధర్మము చేస్తున్నారని నిందలువేసేవాడు.

22. అన్నం పెట్టె చేతిని కాల్చేవాడు.

23. కనీస ప్రయత్నము చెయ్యక తనకు తగనివారి తో పోటి పడి, వారిని దుషించేవాడు.

24. తనకున్న శారీరిక రోగమును అడ్డము పెట్టుకొని అందరిని బెదిరించేవాడు.

25. నిత్యము కోపము ఆశనముతో రగిలిపొఎవాదు.

26. ఆకారణముగా ఇతరులను బూతులు తిట్టేవాడు.

హిందూ ధర్మము ప్రకారము కలియుగములో ప్రత్యక్షముగా రాక్షసులనే వారు వుండరు కాని, పైన చెప్పినట్టి వారు రాక్షసులకంటే క్రురమైనవారని, వారిని రాచపుండుతో సమానముగా చూడాలని చెప్పబడి వున్నది.

కావున తస్మాత్ జాగ్రత్త...!!!